పిడుగు (2016 సినిమా)

పిడుగు, 2016 ఏప్రిల్ 29న విడుదలైన తెలుగు సినిమా.[1] వి2 ఫిల్మ్స్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానరులో అశోక్ గోటి నిర్మించిన ఈ సినిమాకు సి.హెచ్. రామమోహన్ దర్శకత్వం వహించారు. ఇందులో వినీత్ గోటి, మోనికా సింగ్, వినోద్ కుమార్, బెనర్జీ తదితరులు నటించగా, ఆర్. కార్తీక్ కుమార్ - విజయ్ కురాకుల సంగీతం సమకూర్చారు.[2][3]

పిడుగు
Pidugu Movie Poster.jpg
పిడుగు సినిమా పోస్టర్
దర్శకత్వంసి.హెచ్. రామమోహన్
రచనరమేష్ రాయ్ (మాటలు)
నిర్మాతఅశోక్ గోటి
తారాగణంవినీత్ గోటి
మోనికా సింగ్
వినోద్ కుమార్
బెనర్జీ
ఛాయాగ్రహణంపి.యస్. ప్రకాష్
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంఆర్. కార్తీక్ కుమార్
విజయ్ కురాకుల (నేపథ్య సంగీతం)
నిర్మాణ
సంస్థ
వి2 ఫిల్మ్స్ ప్రైవేటు లిమిటెడ్
విడుదల తేదీ
2016 ఏప్రిల్ 29
సినిమా నిడివి
122 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

కథా సారాశంసవరించు

వివిథ నగరాల్లోని ధనవంతులకు అమ్మాయిలను ఎరగా వేసి చివరికి వాళ్ళను చంపేసి వాళ్ళ ఆస్తిని ఒక గ్యాంగ్ లీగల్ గా చేజిక్కించుకుంటుంది. బిజినెస్ మ్యాన్ కొడుకైన జై (వినీత్)ను కూడా ఇలానే బుట్టలో వేసుకోవాలనుకుని ప్లాన్ వేస్తుంటారు. ఆ సమయంలోనే జై లాంటి మరొక వ్యక్తి, జై జీవితంలోకి ప్రవేశించి అతని కుటుంబాన్ని, వ్యాపారాన్ని ఇబ్బంది పెడుతుంటాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[4]

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ సినిమాకు ఆర్. కార్తీక్ కుమార్ - విజయ్ కురాకుల సంగీతం అందించాడు.[5]

  1. దూబా దూబా (రచన: భాస్కరభట్ల, గానం: హైమత్‌, స్వీటీ)
  2. లడికి లడికి (రచన: అనంత శ్రీరామ్, గానం: ఆర్. కార్తీక్ కుమార్)
  3. మస్తుగున్న (రచన: వరికుప్పల యాదగిరి, గానం: సింహ, మోహన)
  4. చెలియా (రచన: శ్రీమణి, గానం: వేదాల హేమచంద్ర, మనిషా)
  5. గోల గోల (రచన: వరికుప్పల యాదగిరి, గానం: ఉమ నేహ, రేవంత్)

మూలాలుసవరించు

  1. "Pidugu 2016 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Pidugu (2016) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow". in.bookmyshow.com. Retrieved 2021-07-25.
  3. "Pidugu Movie". www.timesofindia.indiatimes.com. Retrieved 2021-07-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Pidugu Telugu Movie Review". www.123telugu.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-29. Retrieved 2021-07-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Pidugu 2016 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.{{cite web}}: CS1 maint: url-status (link)