కరాటే కల్యాణి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కరాటే కల్యాణి ఒక తెలుగు సినీ నటి.[1] 120 కి పైగా సినిమాలలో నటించింది. ఈమె ఒక హరికథ కళాకారిణి కూడా. పాటలు పాడుతుంది. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. సుదీర్ఘ కాలం పాటు హరికథ చెప్పినందుకు గాను ఈమె లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.[2]
కరాటే కల్యాణి | |
---|---|
జననం | పడాల కల్యాణి |
వృత్తి | నటి, హరికథా కళాకారిణి |
క్రియాశీల సంవత్సరాలు | 2001- ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | కాసర్ల శ్యాం |
తల్లిదండ్రులు |
|
జీవిత విశేషాలు
మార్చుపడాల కల్యాణి రాందాస్, విజయలక్ష్మి దంపతులకు కవిటిలో జన్మించింది. విజయనగరంలోని కల్యాణానంద భారతి పాఠశాలలో చదివింది. అక్కడే మహిళా కళాశాలలో డిప్లోమా చదివింది. ఆమె భర్త పేరు కాసర్ల శ్యాం.
కెరీర్
మార్చుకల్యాణి మొదటి సినిమా 2001 లో వచ్చిన వేచి ఉంటా అనే సినిమా. ఈ సినిమాలో హీరోయిన్ కు స్నేహితురాలిగా నటించింది.
సినిమాలు
మార్చు- ఛత్రపతి
- కృష్ణ
- మిరపకాయ్
- బ్లేడ్ బాబ్జీ
- గోదావరి
- శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.
- గుంటూర్ టాకీస్
- ఐతే ఏంటి (2004)
- అదిరిందయ్యా చంద్రం (2005)
- పిడుగు (2016)
- గాలి సంపత్ (2021)
సీరియళ్ళు
మార్చుమూలాలు
మార్చు- ↑ "కరాటే కల్యాణి ప్రొఫైలు". maastars.com. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. Retrieved 15 September 2016.
- ↑ "Karate kalyani Into Limca book of guinness records". ladduz.in. Archived from the original on 7 May 2016. Retrieved 15 September 2016.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కరాటే కల్యాణి పేజీ