పితోరాగఢ్ జిల్లా
పితోరాగఢ్ జిల్లా, ఉత్తరాఖండ్ లోని ఒక జిల్లా. ఈ ప్రాంతం గొప్పవైన హిమాలయ పర్వత శ్రేణుల ప్రవేశానికి ఒక ప్రవేశ ద్వారంగా వుంటుంది[1] ఈ ప్రదేశం అందమైన సాయర్ వాలీలో ఉంది. దీనికి ఉత్తరాన ఆల్మోరా జిల్లా సరిహద్దుగా ఉంది. పొరుగున తూర్పులో కల నేపాల్ దేశాన్ని ఈ భూభాగంతో కాళీనది విభజిస్తుంది. పితర్‌ఘర్ సముద్రమట్టానికి సుమారు 1,514 మీటర్లు (4967 అడుగులు) ఎత్తులో 29°35′N 80°13′E / 29.58°N 80.22°E భౌగోళికాంశాల మధ్య ఉంది..[2]
పితోరాఘర్
पिथौरागढ़ | |
---|---|
పట్టణం | |
దేశము | India |
రాష్ట్రం | ఉత్తరాఖండ్ |
జిల్లా | పితోరాఘర్ |
Elevation | 1,514 మీ (4,967 అ.) |
జనాభా (2001) | |
• Total | 41,157 |
భాషలు | |
• అధికార భాష | హిందీ, నేపాలీ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ నెంబరు | 262501 |
దూరవాణి కోడ్ | 915964 |
చరిత్ర
మార్చుఈ ప్రాంతాన్ని పాల్, చాంద్ వంశాలు పాలించినపుడు ఇక్కడ అనేక టెంపుల్స్, కోటలు కట్టించారు. సా.శ.15 వ శతాబ్దంలో కొద్ది కాలం ఈ ప్రాంతం బ్రహ్మ రాజుల పాలనలో వుండేది. తర్వాత చాంద్ వంశం వశ పరచుకొని బ్రిటిష్ వారు వచ్చే వరకూ పాలించింది. ఇక్కడ ప్రజలు కుమావొన్ భాష మాట్లాడతారు. ఈ ప్రాంతం సున్నపు రాయి, రాగి, మెగ్నీషియం, స్లాటే వంటి సహజ వనరులకు ప్రసిద్ధి. ఈ ప్రాంతం చుట్టూ పచ్చటి కాని ఫెరస్, సాల్, చిర, ఓక్ చెట్ల అడవులు ఉన్నాయి. ఈ ప్రాంతం హిమాలయాలలో తిరిగే వివిధ జంతువులుకు ప్రసిద్ధి. అనేక పక్షులు, పాము జాతులు కూడా ఉన్నాయి.
పర్యాటకాకర్షణలు
మార్చుఅనేక చర్చిలు, మిషన్ స్కూల్స్, భవనాలు బ్రిటిష్ పాలనలో కట్టినవి ఉన్నాయి.
మహాదేవ్ ఆలయం
మార్చుశివుడి మహాదేవ టెంపుల్, తప్పక దర్శించాలి. జానపదుల కథనాలు ఇక్కడ ఋషి కపిలుడు ఈ ప్రదేశంలో తపస్సు చేసాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. శివరాత్రి వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయాన్నిసందర్శిస్తారు.
అర్జునేస్వర్ ఆలయం
మార్చుఅర్జునేస్వర్ ఆలయం ప్రధాన ఆకర్షణ. ఇది సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తున ఉంది. పితోర్ ఘర్ నుండి ఇది 10 కి.మీ.ల దూరం ఉంది. ట్రెక్కింగ్ లో ఇక్కడకు చేరాలి. ఈ టెంపుల్ శివుడికి చెందినది. జానపదుల మేరకు, ఈ టెంపుల్ ను పాండవులలో ఒకరైన అర్జున నిర్మించాడని విశ్వసిస్తున్నారు.
కపిలేశ్వర్ మహాదేవ ఆలయం
మార్చుపితోరాగఢ్ కు 3 కి.మీ.ల దూరంలో సమీపంలో ఉన్న తకురా, తకారి గ్రామాలకు సమీపంగా వుంటుంది కపిలేశ్వర్ మహాదేవ ఆలయం ప్రసిద్ధచెందిన పుణ్య క్షేత్రం సోయార్ వాలీలో ఉంది. ఇది ఒక గుహలో పది మీటర్ల దూరంలో ఉంది. ఈ టెంపుల్ ఒక శివాలయం. పురాణాల మేరకు మహర్షి కపిలుడు ఇక్కడ ధ్యానం చేసాడని విశ్వసిస్తున్నారు. ఇక్కడ సుందర హిమాలయ పర్వత శ్రేణులను చూడవచ్చు. పితోరాగఢ్ సమీపంలో మరొక శివాలయంకూడా ఉంది.
నకులేశ్వరాలయం
మార్చుపితోర్ ఘర్ టవున్ కు 4 కి.మీ.ల దూరంలో ఉన్న శిలింగ్ గ్రామానికి 2 కి.మీ.ల దూరంలో నకులేస్వరాలయం ఉంది.. నకుల అనే పదం గొప్పవైన హిమాలయాల నుండి ఈశ్వర్ అనే పదం శివుడి పేరు తోను కలిపి దీనికి నకులేశ్వర్ అని పేరు పెట్టారు. ఈ ఆలయం ఖజురాహో శిల్పశైలిలో నిర్మించబడింది. ఈ ఆలయంలో వివిధ 38 రాతి శిల్పాలు, హిందూ దేవతా మూర్తులు, దేవతల మూర్తులు ఉంటాయి. శివ పార్వతులు, ఉమా వాసుదేవ, నవ వర్గ, సూర్య, మహిషాసుర మర్దిని, వామన, కూర్మ, నరసిన్ఘ మొదలైనవి ఉన్నాయి. ఇతిహాసం కథనాలు ఈ ఆలయం పాండవులలోని నకుల, సహదేవులు నిర్మించబడినట్లు వివరిస్తున్నాయి.
తాల్ కేదార్
మార్చుపితోరాగఢ్ పట్టణం నుండి 8 కి.మీ.ల దూరంలో తాల్ కేదార్ క్షేత్రం ఉంది. ఆలయాన్ని చేరడానికి సన్నని మార్గం గుండా పయనించాలి. ఇది సముద్ర మట్టానికి సుమారు 2000 మీటర్ల ఎత్తున ఉంది. శివరాత్రి పండుగ సందర్భంగా వేలాది భక్తులు ఇక్కడకు సందర్శనార్ధం వస్తారు. ఈ ప్రదేశంలో కల నకులేస్వరాలయం అయిన్చోలి ఆలయాలు కూడా పితోర్ ఘర్ నుండి ట్రెక్కింగ్ లో చేరవచ్చు.
కోట్ గారి దేవి ఆలయం
మార్చుకోట్ గారి దేవి ఆలయం తాల్ కు 9 కి.మీ.ల దూరంలో ఉంది. జీవితంలో ఏదైనా అన్యాయం జరిగినందని భావించిన భక్తులు ఇక్కడకు వస్తారు, తమ న్యాయమైన జరిపించమని తమ న్యాయమైన కోరికలను తీర్చమని భగవంతుడిని కోరతారు.
ధ్వజ్ ఆలయం
మార్చుపితోరాగఢ్కు సమీపంలో ధ్వజ్ ఆలయం ఉంది. ఈ ఆలయావళి సముద్ర మట్టానికి సుమారు 2100 మీటర్ల ఎత్తున ఉంది. ఇక్కడి నుండి మంచుతో కప్పబడిన హిమాలయ శ్రేణులను అనేక సుందర దృశ్యాలను చూడవచ్చు. ఈ ఆలయంలో ప్రధానదైవం భగవానుడు శివుడు, జయంతి అమ్మవార్ల విగ్రహాలుంటాయి.
మోస్తమాను ఆలయం
మార్చుమోస్తమాను ఆలయం పితోర్ ఘర్ టవున్ కు సమీపంలో ఉంది. ఈ టెంపుల్ చేరాలంటే, పితోర్ ఘర్ నుండి 6 కి.మీ.లు బస్సు ప్రయాణం చేసి, 2 కి.మీ.లు కాలినడకన ప్రయాణించాలి. ఈ టెంపుల్ లో మోస్తా దేముడు ఉంటాడు. ప్రతి సంవత్సరం ఆగస్టు - సెప్టెంబరు లలో ఇక్కడ ఒక జాతర నిర్వహిస్తారు.
నారాయణాశ్రమం
మార్చునారాయణ్ ఆశ్రమం సముద్ర మట్టానికి 2734 మీటర్ల ఎత్తున ఉంది. పితోరాగఢ్‌కు 44 కి.మీ.ల దూరంలో గల ఈ ఆశ్రాన్ని నారాయణ్ స్వామి 1936లో స్థాపించారు. ఈ ఆశ్రమం దాని సభ్యులకు అనేక ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాలు అమలు చేస్తుంది.
స్కీయింగ్
మార్చుపితోరాగఢ్ పర్యాటకులు సాధారణంగా స్కీయింగ్ అంటే మక్కువ చూపుతారు. ఇక్కడ కల బెతులి దార్ వాలు ప్రదేశం స్కీయింగ్ కు అనుకూలం. సముద్ర మట్టానికి 3090 మీటర్ల ఎత్తునకల చిప్లా కోట్ లో కూడా స్కీయింగ్ చేయవచ్చు. ఇంతేకాక, ఖాలియా టాప్, అందమైన ఆల్పైన్ మైదానాలు కూడా స్కీయింగ్ కు అనుకూలమే.
ముంష్యారీ
మార్చుపితోర్ ఘర్ కు 127 కి.మీ.ల దూరంలో ఒక చిన్న పట్టణం ముంష్యారీ. ఈ ప్రదేశం హిమాలయ పర్వత శ్రేణుల లోని జోహార్ ప్రాంతానికి గేటు వేగా పనిచేస్తుంది. ఈ ఆలయం సమీపంలో మిల్లం, నామిక్, రాళం మంచు పర్వతాలు ఉన్నాయి. ఈ పట్టణం చుట్టూ మహేశ్వర్ కుండ్, తమరి కుండ్ చెరువులు ఉన్నాయి. ఈ స్థలం నుండి గోరి గంగా రివర్ కూడా పుట్టింది. మున్ష్యరి భుగ్యాల్ అనే ఒక పూల మైదానం పట్టణం చుట్టూ వుంటుంది.
దిది హాట్
మార్చుపితోరాగఢ్ జిల్లాలో దిది హాట్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది పితోర్ ఘర్ టవున్ కు 54 కి. మీ.ల దూరంలో ఉంది. ఇది గ్రామపంచాయతి పాలనలో ఉన్నగ్రామం. సముద్ర మట్టానికి 1725 మీటర్ల ఎత్తున " డిగ్ తారా " అనే పేరుకల కొండపై ఉంది. ఈ పేరు కుమావొనీ భాష దిది హాట్ అంటే చిన్న కొండ అని అర్ధం. ఇక్కడనుండి చరం గాడ్ నది కిందకు ప్రవహిస్తుంది. దీనికి సమీపం లోనే అందమైన హాట్ వాలీ ఉంది. ఇక్కడ సిరా కోట్ అనే శివుడి ఆలయం ఉంది. నాన్ పాపు గ్రామంలో కల మరొక గిరిజన ఆలయాన్ని కూడా అనేక మంది టూరిస్టులు సందర్శిస్తారు.
జౌళ్ జిబి
మార్చుపితోర్ ఘర్ పట్టణానికి 80 కి.మీ.ల దూరంలో కల జౌళ్ జిబి ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈప్రదేశంలో రెండు నదులు కలుస్తాయి. అవి గోరి, కాళి నదులు. ఇక్కడప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి గొప్ప ఉత్సవం జరుపు తారు. ఈ జాతర వేడుక ఈ ప్రాంతంలో మొదటి సారిగా 1914 నవంబరులో నిర్వహించారు. జౌళ్ జిబి నుండి 10 కి.మీ.ల దూరంలో కాలాపానీ హిల్ అనే మరో పర్యాటక ఆకర్షణీయమైన ప్రదేశం ఉంది. ఇక్కడ ఒక వేడి నీటి బుగ్గ ఉంది. ఈ నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని విశ్వసించబడుతుంది.. సమీపం లోని వ్యాసగుహను కూడా అనేక మంది పర్యాతాకులు దర్శిస్తారు.
జులా ఘాట్
మార్చుజూలా ఘాట్ గ్రామం పితోర్ ఘర్ నుండి 36 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ గ్రామం ఇండో నేపాల్ సరిహద్దులో ఉంది. కాళి నది ఈ సరిహద్దులో ప్రవహిస్తుంది. ఇక్కడ కాళి నది పై ఉన్న ఒక వేలాడే వంతెన భారతదేశం, నేపాల్ దేశాలను కలుపుతుంది.
మను ఆలయం
మార్చుపితోర్ఘర్ కు 8 కి.మీ.ల దూరంలో చండక్ ఉంది. ఇక్కడకు చేరాలంటే సాయర్ వాలీ ఉత్తర భాగంలో ఉన్న ఒక అందమైన కొండ ఎక్కాలి. ఈ ప్రదేశం హాంగ్ గ్లైడింగ్ ఆనందాలు అందిస్తుంది. ఇక్కడ మను ఆలయం, ఒక మాగ్నైట్ మైనింగ్ ఫ్యాక్టరీ కూడా ఉంది.
పితోరాగఢ్ కోట
మార్చుపితోరా ఘర్ కోట పితోరాగఢ్‌కు సమీపంలో వుంటుంది. ఈ కోట నుండి కుమావొన్ అందాలను పర్యాటకులు ఆస్వాదించవచ్చు. గుర్ఖాలు ఈ పట్టణంపై దండెత్తిన తర్వాత ఈ కోటను గూర్ఖాలు 1789లో నిర్మించారు.
ఆలయాలు క్రీడలు
మార్చుపితోరాగఢ్ నుండి 4 కి.మీ.ల దూరంలో నకులేశ్వర్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ ఆలయం, ఖజురాహో శిల్పశైలిలో నిర్మించారు. అర్జునేస్వర్ ఆలయం, చండక్, మోస్తమను ఆలయం, ద్వాజ్ ఆలయం, కోట్ గారి దేవి ఆలయం,, దిది హాట్, నారాయణ్ ఆశ్రమం, జూలా ఘాట్ వంటివి మరికొన్ని పర్యాటక ఆకర్షణలు. ఈ ప్రదేశం స్కీయింగ్, హాంగ్ గ్లైడింగ్, పారా గ్లైడింగ్ వంటి సాహస క్రీడలకు కూడా ప్రసిద్ధి. టూరిస్టులు వాయు, రైలు, రోడ్ మార్గాలలో ఇక్కడకు చేరవచ్చు.
పక్షుల శరణాలయం
మార్చుపితోరాగఢ్ కు దక్షిణంగా 8 కి.మీ.ల దూరంలో కల మరొక టెంపుల్ కూడా చూడవచ్చు. పితోరాగఢ్ నుండి 20 కి.మీ.ల దూరంలో అందమైన ఆశుర్ చూలా అనే ఒక బర్డ్ సాన్క్చురి ఉంది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 5412 అడుగుల ఎత్తున ఉంది.
జంతు శరణాలయం
మార్చుపర్యాటక ఆకర్షణ అంటే అది మున్ష్యారి ప్రదేశం. ఇది జోహార్ ప్రాంతానికి ఒక గేటు వేగా వుంటుంది. ఈ గేటు వే మిల్లం, నామిక్, రాళం మంచు పర్వతాలకు దోవ తీస్తుంది. పితోరాగఢ్ కోటను గూర్ఖాలు 1789లో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొన్న తర్వాత నిర్మించారు. టూరిస్టులు అస్కాట్ మస్క్ డీర్ సంక్చురిని కూడా చూడవచ్చు.ఈ శరణాలయం పర్యాటకులకు వివిధ రకాల జంతువులు అంటే చిరుత, జంగల్ కాట్, సివెట్ కాట్, బార్కింగ్ డీర్, సెరో, గోరల్, బ్రౌన్ బేర్ స్నో లెపర్డ్ లు, కస్తూరి జింక, హిమాలయ బ్లాకు బేర్, భరల్ వంటి వాటిని చూడవచ్చు.
ప్రయాణ వసతులు
మార్చుపితోరాగఢ్ రోడ్డు, రైలు, సమీపపట్టణాల నుండి విమానాలలో చేరుకోవచ్చు.
రోడ్ ప్రయాణం
మార్చుపర్యాటకులు పితోరాగఢ్ ప్రదేశాన్ని ప్రభుత్వ, ప్రైవేటు బస్సులలో వివిధ ప్రాంతాల నుండి అంటే కాథ్ గోదాం, ఆల్మోరా, హాల్ద్వానిల నుండి కూడా చేరవచ్చు.
రైలు ప్రయాణం
మార్చుపితోరాగఢ్ నుండి 150 కి. మీ. ల దూరంలో కల తానాక్ పూర్ రైలు స్టేషను నుండి నార్త్ ఇండియా లోని ప్రధాన నగరాలకు చేరవచ్చు. ఈ రైలు స్టేషను నుండి టాక్సీలు దొరుకుతాయి. పితోరాగఢ్ నుండి 217 కి.మీ.ల దూరంలో కల కాథ్ గోదాం రైలు స్టేషను నుండి కూడా చేరవచ్చు.
విమాన ప్రయాణం
మార్చుపితోరాగఢ్ కు పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ సమీపం. సుమారు 250 కి. మీ.ల దూరంలో వుంటుంది. ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీలు లభ్యంగా వుంటాయి.
చిత్రమాలిక
మార్చుమూలాలు
మార్చు- ↑ Official website of Pithoragarh
- ↑ "Falling Rain Genomics, Inc - Pithoragarh". Archived from the original on 2013-10-06. Retrieved 2014-02-02.