పినపాక మండలం
పినపాక మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1]
పినపాక | |
— మండలం — | |
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, పినపాక స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°02′04″N 80°41′17″E / 18.034566°N 80.688°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | భద్రాద్రి జిల్లా |
మండల కేంద్రం | పినపాక |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 237 km² (91.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 48,376 |
- పురుషులు | 23,708 |
- స్త్రీలు | 24,668 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.68% |
- పురుషులు | 62.44% |
- స్త్రీలు | 38.57% |
పిన్‌కోడ్ | 507117 |
ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భద్రాచలం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాల్వంచ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.మండల కేంద్రం పినపాక.
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 48,376 - పురుషులు 23,708 - స్త్రీలు 24,668
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 237 చ.కి.మీ. కాగా, జనాభా 33,155. జనాభాలో పురుషులు 15,933 కాగా, స్త్రీల సంఖ్య 17,222. మండలంలో 8,757 గృహాలున్నాయి.[3]
ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.
మార్చులోగడ పినపాక మండలం,ఖమ్మం జిల్లా,పాల్వంచ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పినపాక మండలాన్ని (1+17) పద్నెనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]
శాసనసభ నియోజకవర్గం
మార్చుమండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- పొట్లపల్లి
- దుగినేపల్లి
- చెగరసాల
- భీమవరం
- సర్జాత్‌పల్లి
- జనంపేట
- సింగిరెడ్డిపల్లి
- వెంకట్రావుపేట
- ఏల్చిరెడ్డిపల్లి
- అల్లంపల్లి
- గడ్డంపల్లి
- పినపాక
- ఉప్పాక
- బయ్యారం
- సీతారాంపురం
- బొమ్మరాజుపల్లి
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-07.