భద్రాచలం రెవెన్యూ డివిజను

తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం.

భద్రాచలం రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 8 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం భద్రాచలం పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం, భద్రాచలం శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.

భద్రాచలం రెవెన్యూ డివిజను
జిల్లా కలెక్టరేట్
జిల్లా కలెక్టరేట్
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాభద్రాద్రి కొత్తగూడెం

వివరాలు

మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

పరిపాలన

మార్చు

భద్రాచలం డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం భద్రాచలం రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 భద్రాచలం మండలం 1 రెవెన్యూ గ్రామం
2 దుమ్ముగూడెం మండలం 83 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
3 చర్ల మండలం 74 రెవెన్యూ గ్రామాలు (13 నిర్జన గ్రామాలు)
4 బూర్గంపాడు మండలం 12 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
5 అశ్వాపురం మండలం 11 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
6 మణుగూరు మండలం 10 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
7 పినపాక మండలం 18 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
8 కరకగూడెం మండలం 9 రెవెన్యూ గ్రామాలు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-06-29.
  3. "ABOUT DISTRICT | BHADRADRI KOTHAGUDEM DISTRICT | India". Archived from the original on 2022-01-30. Retrieved 2022-06-29.
  4. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2022-06-29.