పిలిభిత్
పిలిభిత్ ఉత్తర ప్రదేశ్, పిలిభిత్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. ఇది నేపాల్ సరిహద్దులో శివాలిక్ పర్వతాల పక్కన ఉన్న ఉప హిమాలయ పీఠభూమి లోని రోహిల్ఖండ్ ప్రాంతంలో ఉంది. గోమతి నది ఉద్బవించిన స్థలం ఇది. ఉత్తర భారతదేశంలో అత్యధిక అటవీ సంపద గల ప్రాంతాల్లో ఇదొకటి. పిలిభిత్ ను బాసురీ నగరి (వేణువుల భూమి) అని కూడా పిలుస్తారు భారతదేశపు వేణువులలో సుమారు 95 శాతం ఇక్కడే తయారౌతాయి. [2]
పిలిభిత్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 28°38′59″N 79°52′21″E / 28.6497°N 79.8724°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | పిలిభిత్ |
విస్తీర్ణం | |
• Total | 47 కి.మీ2 (18 చ. మై) |
Elevation | 172 మీ (564 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 1,27,988 |
• జనసాంద్రత | 559/కి.మీ2 (1,450/చ. మై.) |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 262001 |
టెలిఫోన్ కోడ్ | 05882 |
Coastline | 0 కిలోమీటర్లు (0 మై.) |
Climate | HS-TH (Köppen) |
శీతోష్ణస్థితి
మార్చుపిలిభిత్లో నవంబరు నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం ఉంటుంది. ఇది ఆహ్లాదకరమైన, గాలులతో కూడిన కాలం. స్పష్టమైన ఆకాశం, చల్లని రాత్రులూ ఉంటాయి. పగటి ఉష్ణోగ్రత 14 °C (57 °F), రాత్రి ఉష్ణోగ్రత 7 °C (45 °F) కన్నా తక్కువ ఉంటుంది. డిసెంబరు, జనవరి నెలల్లో తరచుగా 3 °C (37 °F) - 4 °C (39 °F)కి పడిపోతుంది. ఫిబ్రవరిలో వర్షం పడుతుంది. [3]
- పిలిభిత్‌లో 1989 మే 29 నఅత్యధిక ఉష్ణోగ్రత 48.5 °C (119 °F)గా నమోదైంది .
- పిలిభిత్‌లో 1949 జనవరి 17 న అతి తక్కువ ఉష్ణోగ్రత −1.2 °C (30 °F) నమోదైంది.
శీతోష్ణస్థితి డేటా - Pilibhit, Uttar Pradesh, India | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C | 14 | 19 | 21 | 36 | 40 | 42 | 40 | 36 | 34 | 29 | 20 | 11 | 29 |
సగటు అల్ప °C | 4 | 10 | 13 | 23 | 31 | 34 | 32 | 27 | 24 | 20 | 13 | 6 | 20 |
సగటు వర్షపాతం mm | 7.6 | 23 | 30 | 46 | 81 | 120 | 130 | 140 | 110 | 30 | 23 | 13 | 753.6 |
సగటు అధిక °F | 57 | 66 | 70 | 97 | 104 | 108 | 104 | 97 | 93 | 84 | 68 | 52 | 83 |
సగటు అల్ప °F | 39 | 50 | 55 | 73 | 88 | 93 | 90 | 81 | 75 | 68 | 55 | 43 | 68 |
సగటు వర్షపాతం inches | 0.3 | 0.9 | 1.2 | 1.8 | 3.2 | 4.8 | 5.2 | 5.5 | 4.3 | 1.2 | 0.9 | 0.5 | 29.8 |
Source: www.wunderground.com[4] |
రవాణా
మార్చుపిలిబిత్ నుండి బరేలీ, తనక్పూర్, ఢిల్లీ, లక్నో, డెహ్రాడూన్, హరిద్వార్, ఆగ్రాలతో పాటు ఉత్తర ప్రదేశ్ లోని ఇతర ప్రధాన నగరాలకు రాష్ట్ర రవాణా సంస్థ (యుపిఎస్ఆర్టిసి) బస్సులు నడుస్తున్నాయి. సంస్థకు చెందిన ఎసి శతాబ్ది బస్సులు పిలిభిత్ నుండి ఢిల్లీ, లక్నో, డెహ్రాడూన్ లకు నడుస్తాయి. కొన్ని రాష్ట్ర బస్సులు పిలిభిత్ నుండి షాజహాన్పూర్, హల్ద్వానీ, ఉధమ్ సింగ్ నగర్ వరకు నడుస్తాయి.
పిలిభిత్ జంక్షన్ రైల్వే స్టేషన్ బరేలీ - లఖింపూర్ రైల్వే లైన్ లో ఉంది. ఈ స్టేషన్ ఈశాన్య రైల్వేల పరిధిలో ఉంది.
మూలాలు
మార్చు- ↑ "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.
- ↑ "Pilibhit as Bansuri Nagari". The Indian Express. Retrieved 24 January 2010.
- ↑ "Annual Weather Pilibhit". Weather Underground. Archived from the original on 13 డిసెంబరు 2004. Retrieved 22 October 2006.
- ↑ "Pilibhit weather". Weather Underground. Archived from the original on 11 డిసెంబరు 2008. Retrieved 4 February 2008.