పాతూరి రాజగోపాల నాయుడు
రాజన్నగా పేరు గాంచిన పాతూరి రాజగోపాల నాయుడు 1900 వ సంవత్సరము నవంబర్ 7వ తేదీన తన స్వగ్రామమైన దిగువమాఘంలో జన్మించాడు. ఈయన స్వాతంత్ర్య సమర యోధుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. రైతు నాయకుడు. సాహితీవేత్త. సంఘసంస్కర్త, రచయిత.
పాతూరి రాజగోపాలనాయుడు | |
---|---|
జననం | |
వృత్తి | రాజకీయ నాయకుడు, రచయిత |
పిల్లలు | గల్లా అరుణకుమారి |
రాజకీయ జీవితంసవరించు
రాజన్న స్వతంత్ర పార్టీ తరపున చిత్తూరు నియోజక వర్గము నుండి వరుసగా రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 6 వ లోక్ సభకు 1977-1980 మధ్య కాలంలోనూ, 7 వ లోక్ సభకు 1980-1984 మధ్య కాలంలో వీరు పార్లమెంటు సభ్యునిగా వ్యవహరించారు.
సంతానముసవరించు
ఈయన కుమార్తె గల్లా అరుణ కుమారి కూడా రాజకీయ నాయకురాలే. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిథ్యం వహించింది. ఈమె వ్యాపారవేత్త గల్లా రామచంద్ర నాయుడు ని వివాహమాడింది. వీరి కుమారుడు గల్లా జయదేవ్ కూడా వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు.
రచనలుసవరించు
ఛత్రపతి శివాజీ, రామానుజం ప్రతిజ్ఞ, కురుక్షేత్రం, సారాసీసా (నాటకం), కూలోళ్ళు, తమసోమా, చంద్రగిరి దుర్గం, ఓరుగల్లు పీఠం, అనార్కలి, జేజవ్వ (నాటకం), లకుమ (అనువాదం)