వెంకటంపల్లి (కంబదూరు మండలం)

(పి.వెంకటంపల్లి నుండి దారిమార్పు చెందింది)

వెంకటంపల్లి. కంబదూరు మండలం అనంతపురం జిల్లాలోని రెవెన్యూయేతర గ్రామం.

వెంకటంపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
వెంకటంపల్లి is located in Andhra Pradesh
వెంకటంపల్లి
వెంకటంపల్లి
అక్షాంశరేఖాంశాలు: 14°47′24″N 77°49′50″E / 14.78992°N 77.83056°E / 14.78992; 77.83056
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం కంబదూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

జిల్లాలో చాలా వెంకటంపల్లి గ్రామాలు ఉన్నాయి. అయితే కంబదురు మండలం లో మాత్రం ఇది ఒక్కటే. ఈ గ్రామానికి చుట్టూ తూర్పున యెర్రమల్లె పల్లి గ్రామం, పడమర దురదకుంట గ్రామం, ఉత్తరం పొలాలు, కల్యానదుర్గం దర్మవరం రహదారి, దక్షిణాన పాల్లూరు గ్రామం కలవు. ఈ గ్రామం అబివ్రుద్ద్ది చెందుతున్న గ్రామంగా ఉంది. గ్రామం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది.

విద్య మార్చు

1 నుండి 7 వ తరగతి వరకు పాఠశాల ఉంది. చాలా మంది విద్యా వంతులు ఉన్నారు. విద్య విషయంలొ ఇంకా చైతన్యం రావలసి ఉంది. గ్రామానికి వార్తా దినపత్రికలు రోజూ వస్తున్నాయి.

వ్యవసాయం మార్చు

వర్షాధార పంటలు మొదలు ఆధునికమైన పంటలు పండిస్తారు. గ్రామానికే ఆదర్షమైన వ్యక్తి టి.ప్రకాషరెడ్డి అను రైతు, గ్రామ నాయకుడు అయిన ఇతను ఎన్నొ కొత్త పంటలను గ్రామంలో సాగు చేస్తూ ముందడుగు వేస్తున్నాడు. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గ్రామ అబివ్రుద్దికి పాటు పడుతున్నాడు. ఇంకా చాలా మంది విద్యావంతులు వ్యవసాయ రైతులుగా ఉన్నారు. అయితే వ్యవసాయానికి ప్రధాన నీటి వనరు భూగర్బ జలాలే, ఇప్పటికే చాలా బోరు బావులు ఎండి పోయాయి. ఈ గ్రామ భూగర్బజలాలకు మూలమైన గ్రామ చెరువు పూడికతో నిండి ఉంది. ఇంకొక ప్రధాన నీటి వనరు అయిన పాల్లూరు చెరువు గట్టు తెగిపోయి ఉంది. అందువల్ల చాలా వరకు భూగర్బజలాలు ఇంకిపోయాయి.

వినోదరంగం మార్చు

చాలా మంది ప్రజలు ఈమధ్యనే కలర్ టివి లు తెచ్చుకున్నారు. ఇంకా చాలా మంది వినోదానికి దూరంగానే ఉన్నారు. గ్రామానికి ఆదాయ వనరుల కొరత వల్ల చాలా మంది పేదరికంతో జీవనం సాగిస్తున్నారు.

త్రాగునీరు మార్చు

చాలా రోజుల తరబడి త్రాగునీటికి ఇబ్బందిగా ఉన్నా ఈమధ్యనే అందరికి ట్యాప్ వాటర్ అందుతోంది. రవణా సదుపాయం:- ప్రధానంగా అనంతపురం జిల్లా కేంద్రం నుంచి కల్యాణదుర్గం కి రావాలి. కల్యాణదుర్గం నుంచి పాల్లూరు బస్ లో గ్రామానికి రావచ్చు. ఈమధ్యనే కల్యాణదుర్గం నుంచి గ్రామానికి చాలా 7 వీలర్ అటోలు నడుస్తున్నాయి. వీటి ద్వారా గ్రామానికి చేరుకోవచ్చు.

పండుగలు, జాతరలు మార్చు

గ్రామంలో ప్రధానంగా ప్రజలందరూ ఐకమత్యంతో పండుగలను జరుపు కుంటారు. సాదరనంగానే దశరా, సంక్రంతి, ఉగాది, వినాయకచవితి, దీపావలి, శివరాత్రి మొ. పండుగలను గనంగానే జరుపుకుంటారు. గ్రామ పండుగలైన మారెమ్మ జాతర, పీర్ల పండుగలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ప్రజలందరు సంప్రదాయాలను పాటిస్తారు. పురుషుల సంఖ్య ఆధునికంగాను ఉంటారు.

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు