పి.శంకరరావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. మాజీ రాష్ట్ర మంత్రి. ఇప్పటివరకు శంకరరావు 5 సార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 4 సార్లు షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నిక కాగా 2009లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు.

పి.శంకరరావు
పి.శంకరరావు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి
నియోజకవర్గం షాద్‌నగర్ (2009 వరకు)
కంటోన్మెంట్ (ప్రస్తుతం)

వ్యక్తిగత వివరాలు

జననం (1948-04-20) 1948 ఏప్రిల్ 20 (వయసు 76)
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె

ప్రారంభ జీవితం

మార్చు

శంకరరావు 1948 ఏప్రిల్ 20న జన్మించాడు.[1] వైద్యశాస్త్రంలో డీగ్రీ పూర్తిచేశాడు. స్థానికంగా మంచి డాక్టరుగా పేరు పొందాడు. రాజకీయాలలో చేరిన పిదప వైద్యవృత్తికి స్వస్తి చెప్పాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై మద్దతు పలికాడు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే 1969 తెలంగాన ఉద్యమం కొరకు పోరాడినాడు.

రాజకీయ జీవితం

మార్చు

శంకర్రావు తొలిసారిగా 1983లో షాద్‍నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనాడు. 1989లో రెండోసారి అదే స్థానం నుంచి ఎన్నికకాగా 1994లో తెలుగుదేశం పార్టీకి చెందిన బక్కని నర్సిములు చేతిలో పరాజయం పొందాడు. 1999లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీచేసి మూడవసారి శాసనసభలో ప్రవేశించాడు. 2004లో కూడా షాద్‌నగర్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యేగా పోటీచేసి బక్కని నర్సింలుపై విజయం సాధించాడు. వైఎస్సార్ మంత్రివర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఈ నియోజకవర్గం జనరల్‌కు మారడంతో 2009లో శంకర్రావు సికింద్రాబాదు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన జి.శాయన్నపై 4 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు.[2] కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలోనూ, కిరణ్ కుమార్ రెడ్డిలోనూ నీటిపారుదల శాఖ, జౌళి శాఖ మంత్రిగా పనిచేశాడు.[3]

వ్యక్తిగత జీవితం

మార్చు

శంకరరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి పెద్ద కూతురు విశ్వశాంతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమారై ఉన్నారు.

సంచనల వ్యాఖ్యలు

మార్చు

మంత్రివర్గంలో ఉంటూ తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రిపైనా, అవినీతి విషయంలో తోటి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకట రమణలపై 2011 సెప్టెంబరు 26న విమర్శలు చేసి సంచలనం సృష్టించాడు.[4] అవినీతి పరులైన మంత్రులను తొలిగించనిచో తాను మంత్రిపదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించాడు.[5] తోటిమంత్రులపై శంకర్రావు చేసిన వ్యాఖ్యలను హైకోర్టు సుమోటాగా స్వీకరించి సిబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అంతకు క్రితం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై అక్రమ ఆస్తుల విషయంలో హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై ఇంకనూ సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక, తేది 02-12-20010
  2. ఈనాడు దినపత్రిక, హైదరాబాదు జిల్లా టాబ్లాయిడ్, తేది 17-5-2009
  3. Zee News Telugu (18 November 2018). "తెలంగాణ తల్లి రూపంలో సోనియా విగ్రహాన్ని ప్రతిష్టించిన నేత.. కాంగ్రెస్‌కు గుడ్ బై". Archived from the original on 18 జూలై 2021. Retrieved 18 July 2021.
  4. నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది 27-09-2011
  5. సాక్షి దినపత్రిక, తేది 27-09-211