పి. ఎన్. హక్సర్
పరమేశ్వర్ నారాయణ్ హక్సర్ (1913 సెప్టెంబరు 4-1998 నవంబరు 25) ఒక భారత ప్రభుత్వాధికారి, దౌత్యవేత్త. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా రెండేళ్ళ పాటు ఆమె ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు బాగా ప్రసిద్ధి చెందాడు. ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండగా సరైన అనుభవం లేని తన ప్రధాన మంత్రి ఇందిర ఆ స్థితి నుంచి ఆమె దాదాపు నిరంకుశమైన, సంపూర్ణ అధికారం పొందే స్థాయికి ఎదగడం వెనుక ప్రధాన వ్యూహకర్తగానూ, విధాన సలహాదారుగానూ హక్సర్ నిలిచాడు. ఈ పదవి తర్వాత అతను ప్రణాళికా సంఘానికి డిప్యూటీ ఛైర్మన్‌గానూ, తరువాత న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి ఛాన్సలర్‌గానూ నియమితుడయ్యాడు.
పి. ఎన్. హక్సర్ | |
---|---|
ప్లానింగ్ కమిషన్ డిప్యూట్ ఛైర్మన్ | |
In office 1975 జనవరి 4 – 1977 మే 31 | |
ప్రధాన మంత్రి | ఇందిరా గాంధీ |
భారత ప్రధానికి ప్రధాన కార్యదర్శి (మొదటి కార్యదర్శి) | |
In office 1971 డిసెంబరు 6 – 1973 ఫిబ్రవరి 28 | |
ప్రధాన మంత్రి | ఇందిరా గాంధీ |
అంతకు ముందు వారు | పదవి ఏర్పాటయింది |
తరువాత వారు | వి. శంకర్ |
రెండవ భారత ప్రధాని కార్యదర్శి | |
In office 1967 – 1971 డిసెంబరు 5 | |
అంతకు ముందు వారు | లక్ష్మీ కాంత్ ఝా |
తరువాత వారు | పదవి తాత్కాలికంగా రద్దయింది |
వ్యక్తిగత వివరాలు | |
జననం | పరమేశ్వర్ నారాయణ్ హక్సర్ 1913 సెప్టెంబరు 4 గుజ్రన్‌వాలా, పంజాబ్ ప్రావిన్సు, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం పంజాబ్, పాకిస్తాన్) |
మరణం | 1998 నవంబరు 25 న్యూఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం | (వయసు 85)
జీవిత భాగస్వామి | ఊర్మిళా సప్రూ |
సంతానం | నందితా హక్సర్, అనామికా హక్సర్ |
హక్సర్ ప్రభుత్వ పాలసీల్లో కేంద్రీకరణకు, సామ్యవాదానికి మద్దతుదారు. హక్సర్ ఒక కాశ్మరీ పండిట్. అప్పట్లో "కాశ్మీరీ మాఫియా" అని పేరొందిన ఇందిరాగాంధీ సన్నిహితులైన, అంతర్గత ప్రభుత్వాధికారుల కూటమిలో ఇతను భాగం కావడమే కాక వారిలో ఇతను ఇందిరకు అత్యంత సన్నిహితుడు.
దీనికి ముందు, హక్సర్ ఇండియన్ ఫారిన్ సర్వీస్లో భాగంగా దౌత్యవేత్తగా పనిచేశాడు. అతను ఆస్ట్రియాలోనూ, నైజీరియాలోనూ భారత రాయబారిగా పనిచేశాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుహక్సర్ 1913లో గుజ్రన్‌వాలా (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది)లో కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించాడు. మొదట ఇంట్లో సంస్కృతం చదువుకున్నాడు. ఆపైన ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పొందాడు. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నాడు. హక్సర్ విమర్శకులు అతను సోవియట్ భావజాలానికి చాలా దగ్గరగా ఆలోచించేవాడని చెప్తారు.[1]
అలహాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉండగా అతను మాయో హాల్లో నివసించేవాడు. అప్పట్లో మోతీలాల్ నెహ్రూ నివాసమైన ఆనంద్ భవన్‌ని తరచుగా సందర్శించేవాడు.[2] హక్సర్ కళా చరిత్రను విపరీతంగా అధ్యయనం చేసేవాడు, అతను చిత్రకళ గురించిన గొప్ప అవగాహన, సాధికారత కలిగినవాడు.[2] లండన్‌లో విద్యార్థిగా విరామ సమయంలో ఉన్నప్పుడు అతను ఫాబియన్ సోషలిజం పట్ల తీవ్రంగా ప్రభావితుడయ్యాడు. తరువాత మార్క్సిస్టులతో పరిచయం, సంబంధం ఏర్పరుచుకున్నాడు.[1][2]
తన జీవితంలోని చివరి దశలో, హక్సర్ ఢిల్లీ సైన్స్ ఫోరం, మానవ హక్కుల సంస్థలతో అనుబంధం ఏర్పరుచుకున్నాడు, నియో-లిబరల్ విధానాలను, లౌకికవాదాన్ని వ్యతిరేకించే ఆలోచనా విధానంతో అతని తుదినాళ్ళ జీవితం ముడిపడివుండేది. తన జీవితంలోని చివరి పదేళ్ళపాటు అతను కంటిచూపును కోల్పోయాడు. అతని కష్టతరమైన ఆ పదేళ్ళ జీవితంలో కాస్త ఆహ్లాదాన్ని కలిగించిన ఒకే ఒక సంగతి వారం వారం చేయించుకునే మర్దన మాత్రమే. హక్సర్ 1998 నవంబరు 25న 85 సంవత్సరాల వయసులో మరణించాడు.[3]
కెరీర్
మార్చుకెరీర్ మొదట్లో
మార్చు1947లో ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఎంపిక కావడానికి ముందే అలహాబాద్‌లో ప్రముఖ న్యాయవాదిగా హక్సర్ తనదైన ముద్ర వేశారు. అలహాబాద్ నుండి వచ్చిన తోటి కాశ్మీరీ అయిన జవహర్లాల్ నెహ్రూతో అతను స్వతంత్ర భారతదేశపు తొలి ప్రధాని కాకముందు సన్నిహితంగా ఉండేవాడు.[4] లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడు హక్సర్ లండన్‌లో ఇండియా లీగ్‌లో వి. కె. కృష్ణ మీనన్ జూనియర్ సహోద్యోగిగా పనిచేశాడు.
విమర్శకులు అతను అహంకారి అనీ, అప్పుడప్పుడు ప్రతీకారపూరితంగా ఉండేవాడనీ, సోవియట్ భావజాలానికి చాలా ఇబ్బందికరమైనంత దగ్గరగా ఉండేవాడనీ, మాస్కో చేతిలో స్వేచ్ఛగా, ఇష్టపూర్వకంగా సాధనం అయ్యాడనీ చెబుతూంటారు.
సివిల్ సర్వీస్ అధికారిగా
మార్చుహక్సర్ 1947లో భారత విదేశీ సేవల అధికారిగా ఎంపికయ్యాడు. అతను నైజీరియా, ఆస్ట్రియాలో భారత రాయబారిగా పనిచేశాడు.[5] 1960లలో అతను లండన్‌లో డిప్యూటీ హై కమిషనర్‌గా కూడా పనిచేశాడు.[1] భారత విదేశాంగ సేవలో ఇరవై సంవత్సరాలు పనిచేసిన తరువాత, అతను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి సహాయకుడిగా నియమితుడయ్యాడు.[4] 1967లో అతను అంతవరకూ పనిచేస్తున్న ఎల్. కె. ఝా స్థానంలో భారత ప్రధానమంత్రికి కార్యదర్శిగా నియమించబడ్డాడు, 1971లో భారత ప్రధానమంత్రికి ప్రధాన కార్యదర్శి పదవి కొత్తగా సృష్టించి, ఆ పదవి ఇతనికి ఇస్తూ పదోన్నతి కల్పించారు. తద్వారా ప్రధానమంత్రి కార్యాలయంలో అత్యంత శక్తివంతమైన సీనియర్ సివిల్ సర్వెంట్ అయ్యాడు. మొత్తంగా భారతదేశపు అత్యంత శక్తివంతమైన సివిల్ సర్వెంట్‌గా అతను ఆరు సంవత్సరాలు పనిచేశారు.
బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో హక్సర్ రాసిన 'స్ట్రే థాట్స్ మెమోరాండం' విడుదలై, చివరికి మొరార్జీ దేశాయ్ వంటి ఆమె రాజకీయ ప్రత్యర్థులను పదవుల్లోంచి గెంటివేయడానికి కారణమైంది.[6] ఇందిరా గాంధీకి ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకునేదాకా భారత ప్రభుత్వ అంతర్గత, విదేశాంగ విధానాల రూపకల్పనలో హక్సర్ గణనీయమైన ప్రభావాన్ని చూపాడు.[4] బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటానికి ఇందిరాగాంధీ మద్దతు ఇవ్వడం వెనుకా, ఆ విషయంలో నిర్ణయం తీసుకున్న సమయం వెనుకా కూడా హక్సర్ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఇందిర ప్రైవేట్ కార్యాలయం నుండి హక్సర్ నేరుగా సైన్యంలోని అత్యున్నత అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేశాడు.[7]
పెద్దగా విద్యావంతుడు, ప్రభావశీలి కాదన్న అభిప్రాయంతో ఇందిర చిన్న కుమారుడు సంజయ్ గాంధీని హక్సర్ అసహ్యించుకునేవాడు. మరోవైపు, సంజయ్ గాంధీనే ఇందిర తన రాజకీయ వారసుడిగా చేయాలని చూడడమూ, సంజయ్ కూడా ఈ ఆకాంక్షతోనే రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు. దీనిపై హక్సర్ అయిష్టాన్ని వ్యక్తంచేస్తూ ఉండడంతో ఇందరకు, అతనికి మధ్య విభేదాలు పొడసూపి, దూరమయ్యారు. న్యూఢిల్లీలోని హక్సర్ కుటుంబానికి చెందిన పండిట్ బ్రదర్స్ దుకాణం మీద పోలీసులు రైడ్ చేయడం, దానివెనుక సంజయ్ ఉన్నాడని భావించడం వంటివి ఈ విభేదాలు మరింత పెంచాయి. 1980ల్లో ఇందిర అధికారంలోకి తిరిగిరాగానే హక్సర్‌ని తన పూర్వపు పదవిలోకి రమ్మని కోరగా అతను నిరాకరించాడు.
ఇందిరాగాంధీ పరిపాలనా కాలంలో జరిగిన బ్యాంకులు, బీమా సంస్థలు, విదేశీ యాజమాన్యంలోని చమురు కంపెనీలను జాతీయం చేయడం, 1971 ఇండో-సోవియట్ ఒప్పందం, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారతదేశం మద్దతు వంటి పాలసీల వెనుక వ్యూహకర్తగా హక్సర్ ప్రసిద్ధి చెందాడు. పాకిస్తాన్‌తో జరిగిన సిమ్లా ఒప్పందం వెనుక, భారతదేశపు విదేశీ గూఢచారి సంస్థ రీసర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) ఏర్పాటు వెనుక కూడా అతని కృషి ఉంది.[3]
పురస్కారాలు, గౌరవాలు
మార్చుపద్మశ్రీ నిరాకరణ
మార్చు1973లో సివిల్ సర్వీసెస్ నుండి పదవీ విరమణ చేసిన తరువాత, ఇందిరా గాంధీ "భారతదేశానికి అతను చేసిన అనేక విశిష్ట సేవలకు" అన్న కారణంతో హక్సార్‌కు భారత ప్రభుత్వం అందించే రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను ప్రకటించింది. అయితే, గోవింద్ నారాయణ్కు రాసిన లేఖలో ఆయన ఈ గౌరవాన్ని తిరస్కరించాడు. "చేసిన పనికి అవార్డును అంగీకరించడం నాకు వివరించలేని అసౌకర్యాన్ని కలిగిస్తుంది" అని తన తిరస్కరణకు కారణాన్ని పేర్కొన్నాడు.[8]
పుస్తకాలు
మార్చుహక్సర్ ఈ కింది పుస్తకాలు రాశాడు[9][10]:
- ప్రీమోనిషన్స్ (1979)
- రిఫ్లెక్షన్స్ ఆన్ అవర్ టైమ్స్ (1982)
- వన్ మోర్ లైఫ్ (1990)
- జెనిసిస్ ఆఫ్ ఇండో-పాకిస్తాన్ కాన్‌ఫ్లిక్ట్ ఆన్ కాశ్మీర్
- హక్సర్ మెమోరియల్ వాల్యూమ్-1 కాంటెంప్లికేషన్స్ ఆన్ ది హ్యూమన్ కండిషన్
- హక్సర్ మెమోరియల్ వాల్యూమ్-2 కాంట్రిబ్యూషన్ ఇన్ రిమెంబరెన్స్
- హక్సర్ మెమోరియల్ వాల్యూమ్-3 ఛాలెంజ్ ఫర్ నేషన్ బిల్డింగ్ ఇన్ ఎ వర్ల్డ్ ఇన్ టర్మాయిల్
- నెహ్రూస్ విజన్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ న్యూక్లియర్ ఏజ్
- స్టడీస్ ఆన్ ఇండో-సోవియట్ రిలేషన్స్
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Singh, Kuldeep (2 December 1998). "Obituary: P.N. Haksar". www.independent.co.uk. Archived from the original on 24 May 2022. Retrieved 24 July 2012. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "independent" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 2.0 2.1 2.2 Mitra, Ashok (12 December 1998). "The P.N. Haksar Story". rediff.com. Retrieved 24 July 2012.
- ↑ 3.0 3.1 Praful Bidwai. "The last of the Nehruvians". Frontline. 19 December 1998.
- ↑ 4.0 4.1 4.2 Vohra, N.N. "100 People who shaped India". indiatoday.com. Archived from the original on 24 September 2015. Retrieved 24 July 2012. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "ITod" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Indian Embassy, Vienna, Austria". Indian Embassy, Govt of India. Archived from the original on 22 September 2013. Retrieved 18 August 2012.
- ↑ Austin, Granville (1999). Working a Democratic Constitution - A History of the Indian Experience. New Delhi: Oxford University Press. pp. 184–185. ISBN 019565610-5.
- ↑ Sarker, Monaem (11 November 2009). "Remembering P.N. Haksar: A true friend of Bangladesh". Retrieved 24 July 2012.
- ↑ "Haksar and the Padma Vibhushan". The Hindu. 13 January 2017. Retrieved 11 May 2018.
- ↑ "Goodreads Authors".
- ↑ "Online Shopping site in India: Shop Online for Mobiles, Books, Watches, Shoes and More - Amazon.in".