పీడిక రాజన్నదొర
పీడిక రాజన్నదొర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]రాజన్న దొర పీడిక 19 సెప్టెంబర్ 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీకి చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2][3] ఆయన 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితుడై, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి[4] సచివాలయంలోని రెండవ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ఏప్రిల్ 21న మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[5]
పీడిక రాజన్నదొర | |||
ఉప ముఖ్యమంత్రి
గిరిజన సంక్షేమశాఖ మంత్రి | |||
పదవీ కాలం 2022 ఏప్రిల్ 11 – 2024 | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 - 2024 | |||
నియోజకవర్గం | సాలూరు | ||
---|---|---|---|
ముందు | రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1971 సన్యాసిరాజుపురం మరిపివలస, మక్కువ మండలం, పార్వతీపురం మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జననం, విద్యాభాస్యం
మార్చుపీడిక రాజన్నదొర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం, సన్యాసిరాజుపురం మరిపివలస గ్రామంలో 1971లో జన్మించాడు. ఆయన 1992లో ఆంధ్రా యూనివర్సిటీ నుండి పీజీ పూర్తి చేశాడు. అనంతరం కొంతకాలం ఆంధ్రప్రదేశ్ కో- ఆపరేటివ్ కార్పొరేషన్ బ్యాంక్ మేనేజర్ గా పని చేశాడు.[6]
రాజకీయ జీవితం
మార్చుపీడిక రాజన్నదొర 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించాడు.
- శాసనసభకు పోటీ
సంవత్సరం | నియోజకవర్గం పేరు | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ఓడిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | మెజారిటీ | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|---|
2004 | సాలూరు ఎస్టీ రిజర్వ్‌డ్ | రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్ | టీడీపీ | 45982 | పీడిక రాజన్నదొర | కాంగ్రెస్ పార్టీ | 48580 | 2598 | ఓటమి |
2009 | సాలూరు | పీడిక రాజన్నదొర | కాంగ్రెస్ పార్టీ | 49517 | గుమ్మడి సంధ్యా రాణి | టీడీపీ | 47861 | 1656 | గెలుపు |
2014 | సాలూరు | పీడిక రాజన్నదొర | వైసీపీ | 63755 | రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్ | టీడీపీ | 58758 | 4997 | గెలుపు |
2019 | సాలూరు | పీడిక రాజన్నదొర | వైసీపీ | 78430 | రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్ | టీడీపీ | 58401 | 20029 | గెలుపు[7] |
మూలాలు
మార్చు- ↑ Sakshi (2019). "Salur Constituency Winner List in AP Elections 2019 | Salur Constituency MLA Election Results 2019". Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
- ↑ Sakshi (19 September 2019). "ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్‌గా పీడిక రాజన్నదొర". Sakshi. Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
- ↑ Andrajyothy (9 July 2021). "మా గ్రామాలు ఏపీలో విలీనం చేయండి ఎమ్మెల్యే రాజన్నదొరకు ఒడిశా గిరిజనుల వినతి". a. Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
- ↑ Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
- ↑ Sakshi (21 April 2022). "గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రాజన్న దొర బాధ్యతలు". Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
- ↑ Andhra Jyothy (11 April 2022). "అనుభవానికి గుర్తింపు!" (in ఇంగ్లీష్). Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
- ↑ Sakshi (2019). "Salur Constituency Winner List in AP Elections 2019 | Salur Constituency Election Results 2019". Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.