భూవైజ్ఞానిక కాల రేఖ

భూమి చరిత్రను చెప్పే కాలరేఖ
(పీరియడ్ (భూవైజ్ఞానిక శాస్త్రం) నుండి దారిమార్పు చెందింది)

భూవైజ్ఞానిక కాల రేఖ, భూమి పొరల వయసును బట్టి కాలాన్ని నిర్ణయించే పద్ధతి. భూమి చరిత్రలో జరిగిన ఘటనల కాలాన్ని వివరించేందుకు జియాలజిస్టులు, పేలియోంటాలజిస్టులూ ఈ కాలరేఖను వాడుతారు. ఈ వ్యాసంలో చూపించిన కాలపట్టికలోని పేర్లు, కాలం, రంగులను ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ స్ట్రాటిగ్రాఫీ (ICS) వారు ఆమోదించినవి.

భూమి చరిత్రలో జరిగిన ముఖ్యమైన ఘటనలను ఈ భూవైజ్ఞానిక కాల గడియారం చూపిస్తుంది. శిలాజాల రికార్డులకు ముందున్న కాలాన్ని హేడియన్ ఇయాన్ చూపిస్తుంది; దాని పైసరిహద్దు 4.0 Ga (బిలియన్ సంవత్సరాల క్రితం).[1] ఇతర విభాగాలు జీవ పరిణామాలను చూపిస్తాయి.ఆర్కియన్, ప్రోటెరోజోయిక్ లు ఇయాన్లు. పేలియోజోయిక్, మెసోజోయిక్, సెనోజోయిక్ లు ఫానెరోజోయిక్ ఇయాన్‌లో భాగమైన ఎరాలు. ఈ స్కేలుపై మానవుడు ఉద్భవించిన 3 మిలియన్ సంవత్సరాల క్వాటర్నరీ పీరియడ్ మరీ చిన్నదిగా కనబడి కనబడకుండా ఉంటుంది.

పరిభాష

మార్చు

ఈ కాలనిర్ణయంలో ప్రాథమిక విభాగం ఇయాన్. హాడియన్, ఆర్కియన్, ప్రోటెరోజోయిక్, ఫానెరోజోయిక్ అనేవి ఇయాన్లు. వీటిలో మొదటి మూడింటినీ కలిపి ప్రికాంబ్రియన్ సూపర్‌ ఇయాన్ అనవచ్చు. ఇయాన్లను ఎరాలుగా, ఎరా ను పీరియడ్ లుగా, ఇపోక్ లుగా, ఏజ్ లుగా విభజించారు.

ఇయాన్‌లు, ఎరాలు, పీరియడ్లు, ఇపోక్‌లు, ఏజ్‌లలో ఏర్పడిన రాతి పొరలను వరుసగా ఇయానోదెం, ఎరాదెం, సిస్టమ్‌, సీరీస్, స్టేజ్ అని పిలుస్తారు.

కాలాన్ని మరింతగా వర్గీకరించేందుకు జియాలజిస్టులు "తొలి", "మధ్య", "చివరి" అనే విశేషణాలను, రాతి పొరలను వర్గీకరించేందుకు "దిగువ (కింది)", "మధ్య", "ఎగువ (పైని)" అనే విశేషణాలనూ వాడుతారు. ఉదాహరణకు ఎగువ జురాసిక్ సీరీస్ అనేది తొలి జురాసిక్ ఇపోక్ కాలాన్ని సూచిస్తుంది.[2]

తార్కికత

మార్చు

రేడియోమెట్రిక్ డేటింగ్ ప్రకారం భూమి వయసు 454 కోట్ల సంవత్సరాలని తెలుస్తోంది.[3][4] భూమి చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా చరిత్రను వివిధ కాలాలుగా వర్గీకరించారు. భూమి పొరల్లో చోటు చేసుకున్న మార్పులు అప్పట్లో ఏర్పడిన పెద్ద సంఘటనలను (మూకుమ్మడి వినాశనం వంటివి) సూచిస్తాయి. ఈ మార్పులను బట్టి కాలరేఖలో కాల విస్తృతులను (టైమ్ స్పాన్) నిర్ణయించారు. ఉదాహరణకు, క్రెటేషియస్, పేలియోజీన్ పీరియడ్ల సరిహద్దును క్రెటేషియస్-పేలియోజీన్ వినాశక ఘటన నిర్వచిస్తుంది. ఈ ఘటనలో ఎగరలేని డైనోసార్లతో పాటు అనేక జీవులు అంతరించాయి. అంతకంటే ప్రాచీన కాలవిస్తృతులను, అంటే విశ్వసనీయమైన శిలాజ ఆధారాలు లభించని కాలాలకు (ప్రోటెరోజోయిక్ ఇయాన్ కు ముందు), నిరపేక్షిక కాలం ప్రకారం నిర్వచించారు.

ఒకే కాలానికి చెందినప్పటికీ వివిధ ప్రదేశాల్లోని శిలాజాలు విభిన్నంగా ఉండటంతో ఆయా కాలాలకు వివిధ ప్రాంతాల్లో విభిన్నమైన పేర్లు పెట్టారు. ఉదాహరణకు ఉత్తర అమెరికాలో దిగువ కాంబ్రియన్‌ను వాకోబియన్ అని పిలవగా, అదే కాలాన్ని తూర్పు ఆఫ్రికా, సైబీరియాల్లో అలెక్సియన్, అడబానియన్, బోటోమియన్ అనే మూడు భాగాలుగా విభజించారు. వీటన్నిటినీ క్రోడీకరించి, సార్వత్రికంగా ఒకే పేరుతో నిర్వచించడం ICS వారి కీలకమైన పనుల్లో ఒకటి.[5]

కాల రేఖ చరిత్ర, విభాగాలు నామకరణం

మార్చు
 
సర్పిలాకారపు చిత్రంలో భూమి చరిత్ర

తొలి చరిత్ర

మార్చు

రాళ్లలో లభించే ఆల్చిప్పల శిలాజాలు, సముద్ర తీరాల్లో లభించే ఆల్చిప్పలను పోలి ఉండటాన్ని గమనించిన అరిస్టాటిల్ (సా.శ.పూ. 384-322), దీర్ఘకాలంలో భూమి, సముద్రాల స్థానాలు పరస్పరం మారుతూ ఉండేవని భావించాడు. లియోనార్డో డా విన్సీ (1452–1519) ఈ భావనతో ఏకీభవించాడు.[6]

ప్రాథమిక సూత్రాల ఏర్పాటు

మార్చు

17 వ శతాబ్దం చివర్లో నికోలస్ స్టెనో (1638–1686) భూవైజ్ఞానిక కాల రేఖను నిర్వచించే మూల సూత్రాలను తయారుచేసాడు. రాతి పొరలు ఒకదానిపై ఒకటి ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కొక్క పొర ఒక్కొక్క కాల ఖండాన్ని సూచిస్తూ ఉంటుంది అని అతడు సూత్రీకరించాడు. ప్రతి రాతి పొర, దాని పైదాని కంటే పాతదిగాను, దాని కింది దాని కంటే కొత్తదిగానూ ఉంటుందని కూడా అతడు చెప్పాడు. స్టెనో సూత్రాలు సరళంగానే ఉన్నప్పటికీ, వాటిని అనువర్తింపజేయడంలో సవాళ్ళు ఎదురయ్యాయి.

18 వ శతాబ్దంలో జియాలజిస్టులు కింది విషయాలను తెలుసుకున్నారు:

  1. రాతిపొరలు ఏర్పడ్డాక, కోసుకుపోవడం, వంపులు తిరగడం, తిరగబడిపోవడం వంటివి జరుగుతాయి
  2. ఒకే సమయంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పడిన పొరలు పూర్తిగా విభిన్నంగా కనిపిస్తాయి.
  3. ఏదైనా ఒక ప్రాంతంలోని రాతిపొరలు భూమి దీర్ఘ చరిత్రలో కొంత భాగాన్ని మాత్రమే సూచిస్తాయి.

కాల రేఖ రూపకల్పన

మార్చు

భూమిపై ఎక్కడైనా వర్తింపజేయగల భూవైజ్ఞానిక కాల రేఖ తయారీ కోసం గట్టి ప్రయత్నాలు 18 వ శతాబ్దపు తుది భాగంలో జరిగాయి. వెర్నర్ తదితరులు చేసిన తొలి ప్రయత్నాల్లో భూమి పైపొరల్లోని రాళ్ళను నాలుగు రకాలుగా విభజించారు: ప్రైమరీ (ప్రాథమిక), సెకండరీ (ద్వితీయ), టెర్షియరీ (తృతీయ), క్వాటర్నరీ (చతుర్థ).

ఈ సిద్ధాంతం ప్రకారం ఆయా రాళ్ళు భూమి చరిత్రలో ఆయా విభాగాలకు చెందినవి. దీనికనుగుణంగా టెర్షియరీ పీరియడ్ అని, టెర్షియరీ రాళ్ళు అనీ పిలవడం సాధ్యపడింది. వాస్తవానికి, "టెర్షియరీ" అనే వాడుక (ప్రస్తుతం పేలియోజీన్, నియోజీన్ అని పిలుస్తున్నారు) 20 వ శతాబ్దంలో కొన్నాళ్ళ వరకూ కూడా వ్యాప్తిలో ఉండేది. "క్వాటర్నరీ" అనే పేరు ఇప్పటికీ వాడుకలో ఉంది. ఇది వర్తమాన కాలాన్ని సూచిస్తుంది.

19 వ శతాబ్దపు తొలి నాళ్ళలో విలియం స్మిత్, జార్జెస్ కూవియర్, జీన్ డి ఒమాలియస్ డి హలోయ్, అలెగ్సాంద్ర్ బ్రోనియార్ట్ లు శిలాజాల లభ్యతను బట్టి భూపొరలను గుర్తించడం మొదలుపెట్టారు. ఈ పద్ధతి భూమి చరిత్రను మరింత కచ్చితంగా విభజించేందుకు దోహదం చేసింది. దేశాల, ఖండాల హద్దులకు అతీతంగా భూపొరల సంబంధాలను గమనించేందుకు ఇది ఉపయోగపడింది. రెండు వేరువేరు పొరల్లో ఒకే రకమైన శిలాజాలు ఉంటే, ఆ పొరలు ఒకదానికొకటి ఎంత దూరంలో ఉన్నప్పటికీ, అవి రెండూ ఒకే సమయంలో ఏర్పడి ఉండటానికి సంభావ్యత ఎక్కువగా ఉంటుంది. 1820, 1850 ల మధ్య ఐరోపాలో జరిగిన శిలాజ అధ్యయనాలతో తయారు చేసిన భూవైజ్ఞానిక పీరియడ్లు ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి.

విభాగాలు

మార్చు
  • ఇయాన్ అనేది భూవైజ్ఞానిక కాలమానంలో అతి పెద్ద కొలత. క్రోనోస్ట్రాటిగ్రాఫీలో ఇది ఇయోనీథెమ్‌కు సమానం.[7] నిర్దుష్టంగా విభజించిన 4 ఇయాన్లు ఉన్నాయి. అవి: హేడియన్, ఆర్కియన్, ప్రోటెరోజోయిక్, ఫానెరోజోయిక్ ఇయాన్లు[8]
  • ఎరా ఈ కాలమానంలో రెండవ అతి పెద్ద కొలత. క్రోనోస్ట్రాటిగ్రాఫీలో ఇది ఎరాథెమ్‌కు సమానం.[9][7] కాలమానంలో మొత్తం పది ఎరా లున్నాయి. అవి: ఇయోఆర్కియన్, పాలియోఆర్కియన్, మెసోఆర్కియన్, నియోఆర్కియన్, పాలియోప్రోటెరోజోయిక్, మెసోప్రోటెరోజోయిక్, నియోప్రోటెరోజోయిక్, పాలియోజోయిక్, మెసోజోయిక్, సెనోజోయిక్ ఎరాలు. హేడియన్ ఎరాలో ఇయాన్లేమీ లేవు.[8]
  • భూ వైజ్ఞానిక కాలమానంలో తరువాతి కొలత పీరియడ్. క్రోనోస్ట్రాటిగ్రాఫీలో ఇది సిస్టమ్‌కు సమానం.[9][7] మొత్తం 22 పీరియడ్‌లుండగా, వర్తమానంలో జరుగుతున్నది క్వాటర్నరీ ఎరా.[8] ఒక్క కార్బనోఫెరస్ పీరియడ్‌లో మాత్రం రెండు ఉపపీరియడ్ లున్నాయి.[9]
  • ఇపోక్ అనేది ఆ తరువాతి కొలత. క్రోనోస్ట్రాటిగ్రాఫీలో ఇది సీరీస్‌కు సమానం.[9][7] కాలమానంలో మొత్తం 37 ఎపోక్‌లున్నాయి. మరో 11 ఉప ఇపోక్‌లు కూడా ఉన్నాయి. ఇవ్వన్నీ నియోజీన్, క్వాటర్నరీ పీరియడ్‌ల లోనే ఉన్నాయి.[8] ఈ ఉప ఇపోక్‌ల వాడకాన్ని 2022 లో అధికారికంగా ఆమోదించారు.[10]
  • ఈ కాలమానంలో అత్యంత చిన్న కొలత ఏజ్. క్రోనోస్ట్రాటిగ్రాఫీలో ఇది స్టేజ్‌కు సమానం.[9][7] మొత్తం 96 అధికారికంగా వాడే ఏజ్‌లు ఉండగా, అనద్ఝికారికంగా వాడేవి మరో 5 ఉన్నాయి.[8]
  • క్రోన్ అనేది పై కాలవృక్షం లోని బ్గాగం కాదు గానీ, అధికారికంగా వాడే మరిక కొలత.[9]

పీరియడ్లు, ఎరాలు, ఇపోక్‌ల నామకరణం

మార్చు

కాలమానాన్ని తయారు చెయ్యడంపై తొలుత బ్రిటిషు శాస్త్రవేత్తలు ఎక్కువగా పనిచేసారు. అందుచేతనే ఇందులోని పేర్లు వారి ఆధిపత్యాన్ని సూచిస్తాయి. "కాంబ్రియన్" అనేది వేల్స్‌కు మరో పేరు. ఒర్డోవీసియన్, సిల్యూరియన్ అనేవి వేల్స్ జాతుల పేర్లు. వేల్స్ ప్రాంతంలో భూపొరల కాలాన్ని సూచిస్తూ ఈ పేర్లు పెట్టారు.: 113–114  ఇంగ్లాండులోని డెవన్ ప్రాంతాన్ని సూచిస్తూ డెవోనియన్ అనే పేరు పెట్టారు. రష్యాలోని పెర్మ్ ప్రాంతాన్ని సూచిస్తూ పెర్మియన్ అనే పేరు పెట్టారు. అయితే, ఇతర దేశాలను సూచిస్తూ కూడా కొన్ని పేర్లు పెట్టారు. వాయవ్య ఐరోపాలోను, జర్మనీలోనూ కనిపించే మూడు విభిన్న రాతిపొరలను ట్రయాస్ అంటారు. ఈ పేరుమీదుగా ట్రయాసిక్ అనే పేరు వచ్చింది. జురా పర్వతాల్లో విస్తృతంగా కనబడే సముద్ర సున్నపురాతి పొరల మీదుగా జురాసిక్ అనే పేరు పెట్టారు. అదే విధంగా పశ్చిమ ఐరోపాలో లభించే చాక్ పేరు మీదుగా క్రెటేషియస్ అనే పేరు వచ్చింది.[11]

పీరియడ్లను ఎరాలుగా కూర్చడంలోను, టెర్షియరీ, క్వాటర్నరీ పీరియడ్లను ఇపోక్‌లుగా విభజించడంలోను కూడా బ్రిటిషు శాస్త్రవేత్తలు పనిచేసారు. ఒక్కో ఎరాలో ఏర్పడిన శిలాజ రకాల ప్రకారం మొట్టమొదటి కాల రేఖను 1841 లో జాన్ ఫిలిప్స్ రూపొందించాడు. ఈ రేఖలో అతడు పేలియోజోయిక్ (ప్రాచీన జీవ సంబంధ) వంటి పదాలను ప్రామాణీకరించాడు. మెసోజోయిక్ (మధ్య జీవ సంబంధ) వంటి పదాలను ప్రవేశపెట్టాడు.[12]

కాలాల కొలతలు

మార్చు

క్రైస్తవ సృష్టివాదులు భూమి ఆరేడు వేల సంవత్సరాల కిందట పుట్టిందని బైబిలు చెబుతోందని ప్రతిపాదించగా, తొలితరం జియాలజిస్టులు కోట్ల సంవత్సరాల కిందటే పుట్టిందని చెప్పారు. మరి కొందరైతే భూమి వయసు అనంతమని చెప్పారు. 1896 లో కనుగొన్న రేడియో ధార్మికతను ఉపయోగించి, 20 వ శతాబ్దపు తొలి సగంలో రేడియోమెట్రిక్ దేటింగు పద్ధతిని అభివృద్ధి చేసేంతవరకు, భూమి, దాని రాతిపొరల వయసు విషయంలో అనేక వివాదాలు సాగాయి.

1913 లో బ్రిటిషు జియాలజిస్టు ఆర్థర్ హోమ్స్ అచ్చంగా తేదీలతో కూర్చి కాలరేఖను ప్రచురించాడు.[13] జియోక్రొనాలజీ శాస్త్ర విభాగం అభివృద్ధికి అతడు దోహదం చేసాడు. ప్రపంచ ప్రసిద్ధమైన పుస్తకం ది ఏజ్ ఆఫ్ ది ఎర్త్ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. దానిలో భూమి వయసు 160 కోట్ల సంవత్సరాలని అతడు అంచనా వేసాడు.[14]

భూవైజ్ఞానిక కాల పట్టిక

మార్చు

కాలరేఖ లోని వివిధ కాలావధుల విశేషాలను, ఆయా కాలావధుల్లో జరిగిన సంఘటనలనూ కింది పట్టికలో చూడవచ్చు. ఈ పట్టికలో అత్యంత ప్రాచీన కాలాన్ని అట్టడుగున, అత్యంత నవీన కాలాన్ని పైనా చూపించారు. ఒక్కో వరుస ఎత్తు, ఆ కాలపు అవధిని సూచించదు.

ఈ పట్టికను ICS వారి అధికారిక కాల రేఖను అనుసరించి తయారు చేసారు.

సూపర్‌ఇయాన్ ఇయాన్ ఎరా పీరియడ్[a] ఇపోక్ ఏజ్[b] ప్రముఖ ఘటనలు మొదలైనది (మిలియన్ సంవత్సరాల కిందట)[b]
n/a[c] ఫానెరోజోయిక్ సెనోజోయిక్[d] క్వాటర్నరీ హోలోసీన్

క్రోన్‌లు: సబ్‌అట్లాంటిక్ ·

సబ్‌బొరియల్ ·

అట్లాంటిక్ · బొరియల్ · ప్రిబొరియల్

క్వాటర్నరీ మంచుయుగం తగ్గి, ప్రస్తుత ఇంటర్‌గ్లేసియల్ మొదలైంది. సవానా నుండి సహారా ఎడారి ఏర్పడింది. మానవ నాగరికత ఉద్భవం, వ్యవసాయం మొదలు. రాతియుగ సంస్కృతి అంతరించి, కంచుయుగం (సా.శ.పూ. 3300), ఇనుపయుగం (సా.శ.పూ. 1200) ఉనికిలోకి వచ్చాయి. 1400 నుండి 1850 వరకు స్వల్పకాలిక మంచుయుగం ఏర్పడి ఉత్తరార్థగోళంలో శీతల కాలం ఏర్పడింది. పారిశ్రామిక విప్లవం కారణంగా వాతావరణంలోని కార్బన్ డయాక్సైడు పరిమాణం 280 పార్ట్స్ పర్ మిలియన్ వాల్యూమ్ (ppmv) నుండి ప్రస్తుత 400[17] ppmv స్థాయికి పెరిగాయి.[18][e] 0.0117[f]
ప్లైస్టోసీన్ చివరి (స్థానికంగా టారన్టియన్ · టైరీనియన్ · ఈమియన్ · సంగమోనియన్) ప్లైస్టోసీన్ మహాజీవుల ఉద్భవం, విస్తరణ, అంతరించిపోవడం. ఆధునిక మానవుని ఉద్భవం, పెరుగుదల. క్వాటర్నరీ మంచుయుగం కొనసాగింది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడు పరిమాణం 100, 300 ppmv ల మధ్య ఊగిసలాడింది[e]), మంచుగదిలాంటి భూమి పరిస్థితులు తీవ్రమయ్యాయి. దాదాపు 1.6 Ma. చివరి గ్లేసియల్ మాక్సిమమ్ (30000 సంవత్సరాల కిందట), చివరి గ్లేసియల్ పీరియడ్ (18000–15000 సంవత్సరాల కిందట). గతించిన అమంచుయుగ సంస్కృతుల కంటే, సాంకేతిక సంక్లిష్టత కలిగి ఉన్న మానవ రాతియుగ సంస్కృతుల ఆరంభం. మధ్యధరా ప్రాంతం, ఐరోపాల్లో రాతి గోడలపై గీసిన బొమ్మలు, బంకమట్టి శిల్పాలు (ఉదా: వీనస్ ఆఫ్ లెస్పుగ్). 75000 సంవత్సరాల కిందట టోబా మహా అగ్నిపర్వత విస్ఫోటనం. దీనివలన, అగ్నిపర్వత శీతాకాలం ఏర్పడి మానవజాతి అంతరించిపోయే ప్రమాదం అంచుకు చేరి ఉండవచ్చు. ఓల్డెస్ట్ డ్రయాస్, ఓల్డర్ డ్రయాస్/అల్లెరాయిడ్ యంగర్ డ్రయాస్ వాతావరణ ఘటనలతో ప్లైస్టోసీన్ ముగింపు. తరువాత వచ్చే హోలోసీన్ కు యంగర్ డ్రయాస్ హద్దు. 0.126
మధ్య (గతంలో అయోనియన్ అని పిలిచేవారు) 0.781
కలాబ్రియన్ 1.8*
జెలేసియన్ 2.58*
నియోజీన్ ప్లయోసీన్ పియసెంజియన్ ప్రస్తుత మంచుయుగం తీవ్రతరం అయింది. ప్రస్తుత క్వాటర్నరీ మంచుయుగం 2.58 Ma మొదలైంది. చల్లటి పొడి వాతావరణం, ఆస్ట్రలోపిథెసీన్స్, ప్రస్తుతం ఉనికిలో ఉన్న అనేక క్షీరదాల కుటుంబాలు, నత్తల వంటి జీవులు ఉద్భవించాయి. హోమో హాబిలిస్ ఉద్భవం. 3.6*
జాంక్లియన్ 5.333*
మయోసీన్ మెస్సినియన్ మంచుయుగాలతో కూడిన మధ్యస్థాయి మంచుగృహ వాతావరణం; ఉత్తరార్థగోళంలో ఓరోజెనీ (పర్వత శ్రేణుల ఉద్భవం). ఆధునిక క్షీరదాలు పక్షుల కుటుంబాల ఉనికి. గుర్రాలు, మాస్టోడాన్ (ఏనుగు వంటి పెద్ద జంతువు) ల విస్తృతి. పచ్చికలు సర్వత్రా వ్యాపించాయి. తొట్టతొలి కోతుల ఉద్భవం. న్యూజీల్యాండ్ లో కైకోరా ఓరోజెనీ ద్వారా దక్షిణ ఆల్ప్స్ జననం. ఈ పర్వతాలు ఇప్పటికీ ఏర్పడుతూనే ఉన్నాయి. ఐరోపలో ఆల్ప్స్ పర్వత శ్రేణుల పెరుగుదల నిదానించింది. ఐతే ఇప్పటికీ ఇవి పెరుగుతూనే ఉన్నాయి. కార్పాథియన్ ఓరోజెనీ ద్వారా మధ్య, తూర్పు ఐరోపాలో కార్పాథియన్ పర్వతాల ఉద్భవం. గ్రీసులో, ఈజియన్ సముద్రంలో హెలెనిక్ ఓరోజెనీ నిదానించింది. కానీ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మధ్య మయోసీన్ భంగం (డిస్రప్షన్) జరిగింది. విస్తృతంగా వ్యాపించిన అరణ్యాలు పెద్దయెత్తున కార్బన్ డయాక్సైడును మింగేసాయి. దీంతో వాతావరణంలోని కార్బన్ డయాక్సైడు స్థాయి 650 ppmv నుండి 100 ppmv కి పడిపోయింది.[e] 7.246*
టార్టోరియన్ 11.63*
సెర్రావాలియన్ 13.82*
లాంగియన్ 15.97
బుర్డిగాలియన్ 20.44
అక్విటానియన్ 23.03*
పేలియోజీన్ ఆలిగోసీన్ చట్టియన్ వెచ్చనైన, కానీ చల్లబడుతోన్న వాతావరణం మంచుగృహం వైపు ప్రస్థానం. అనేక జీవుల సత్వర ఉద్భవమూ, వ్యాప్తి - ముఖ్యంగా క్షీరదాలు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న పుషిపించే మొక్కల ఉద్భవం, విస్తరణ. 28.1
రూపేలియన్ 33.9*
ఇయోసీన్ ప్రియబోనియన్ మధ్యస్థమైన వాతావరణం. చల్లబడుతోంది. ఈ ఇపోక్‌లో ఆదిమ క్షీరదాలు (ఉదా: క్రియోడాంట్‌లు, కోండీలార్త్‌లు, ఉయింటాతెరెస్‌లుమొ.) విలసిల్లాయి. సరికొత్త క్షీరదాల కుటుంబాల ఉద్భవం. ఆదిమ తిమింగిలాల విస్తరణ. తొలి పచ్చిక. అంటార్కిటికా గ్లేసియేషన్, అక్కడ మంచుదుప్పటి (ఐస్‌క్యాప్) తయారు; అజోలా ఘటన మంచుయుగానికి దారితీసింది. పర్యవసానంగా ఏర్పడిన మంచుగృహ (ఐస్‌హౌస్) వాతావరణం ఇప్పటికీ ఉంది. సముద్ర గర్భంలోని నాచు కృశించి కార్బన్ డయాక్సైడును పెద్దయెత్తున మింగెయ్యడంతో,[e] వాతావరణంలో దాని పరిమాణం 3800 ppmv నుండి 650 ppmv కు పడిపోయింది - మంచుయుగానికి, పర్యవసానంగా మంచుగృహ పరిస్థితి రావడానికి ఇదే కారణం. లారమైడ్, సెవియర్ ఓరోజెనీల ద్వారా ఉత్తర అమెరికాలోని రాకీ పర్వతాల ఏర్పాటు ఆగిపోయింది. ఐరోపాలో ఆల్ప్స్ పర్వత శ్రేణుల పుట్టుక మొదలైంది. గ్రీసు, ఈజియన్ సముద్రంలో హెలెనిక్ ఓరోజెనీ మొదలైంది. 37.8
బార్టోనియన్ 41.2
ల్యుటీషియన్ 47.8*
వైప్రీసియన్ 56*
పేలియోసీన్ థానేటియన్ Climate tropical. Modern plants appear; Mammals diversify into a number of primitive lineages following the extinction of the non-avian dinosaurs. First large mammals (up to bear or small hippo size). Alpine orogeny in Europe and Asia begins. Indian Subcontinent collides with Asia 55 Ma, Himalayan Orogeny starts between 52 and 48 Ma. 59.2*
సెలండియన్ 61.6*
డానియన్ 66*
మెసోజోయిక్ క్రెటేషస్ చివరి మాస్ట్రిక్టియన్ Flowering plants proliferate, along with new types of insects. More modern teleost fish begin to appear. Ammonoidea, belemnites, rudist bivalves, echinoids and sponges all common. Many new types of dinosaurs (e.g. Tyrannosaurs, Titanosaurs, duck bills, and horned dinosaurs) evolve on land, as do Eusuchia (modern crocodilians); and mosasaurs and modern sharks appear in the sea. Primitive birds gradually replace pterosaurs. Monotremes, marsupials and placental mammals appear. Break up of Gondwana. Beginning of Laramide and Sevier Orogenies of the Rocky Mountains. atmospheric CO2 close to present-day levels. 72.1 ± 0.2*
కాంపానియన్ 83.6 ± 0.2
సాంటోనియన్ 86.3 ± 0.5*
కోనియాసియన్ 89.8 ± 0.3
ట్యురోనియన్ 93.9*
సెనోమానియన్ 100.5*
తొలి ఆల్బియన్ ~113
యాప్టియన్ ~125
బరేమియన్ ~129.4
హాటెరివియన్ ~132.9
వలాంగినియన్ ~139.8
బెరియాసియన్ ~145
జురాసిక్ చివరి టిథోనియన్ Gymnosperms (especially conifers, Bennettitales and cycads) and ferns common. Many types of dinosaurs, such as sauropods, carnosaurs, and stegosaurs. Mammals common but small. First birds and lizards. Ichthyosaurs and plesiosaurs diverse. Bivalves, Ammonites and belemnites abundant. Sea urchins very common, along with crinoids, starfish, sponges, and terebratulid and rhynchonellid brachiopods. Breakup of Pangaea into Gondwana and Laurasia. Nevadan orogeny in North America. Rangitata and Cimmerian orogenies taper off. Atmospheric CO2 levels 3–4 times the present day levels (1200–1500 ppmv, compared to today's 400 ppmv[e]). 152.1 ± 0.9
కిమ్మెరిడ్జియన్ 157.3 ± 1.0
ఆక్స్‌ఫోర్డియన్ 163.5 ± 1.0
మధ్య కాలోవియన్ 166.1 ± 1.2
బాతోనియన్ 168.3 ± 1.3*
బాజోసియన్ 170.3 ± 1.4*
ఆలేనియన్ 174.1 ± 1.0*
తొలి టోర్సియన్ 182.7 ± 0.7*
ప్లయెన్స్‌బాకియన్ 190.8 ± 1.0*
సినెమూరియన్ 199.3 ± 0.3*
హెట్టాంగియన్ 201.3 ± 0.2*
ట్రయాసిక్ చివరి ర్హేటియన్ Archosaurs dominant on land as dinosaurs, in the oceans as Ichthyosaurs and nothosaurs, and in the air as pterosaurs. Cynodonts become smaller and more mammal-like, while first mammals and crocodilia appear. Dicroidiumflora common on land. Many large aquatic temnospondyl amphibians. Ceratitic ammonoids extremely common. Modern corals and teleost fish appear, as do many modern insect clades. Andean Orogeny in South America. Cimmerian Orogeny in Asia. Rangitata Orogeny begins in New Zealand. Hunter-Bowen Orogeny in Northern Australia, Queensland and New South Wales ends, (c. 260–225 Ma) ~208.5
నోరియన్ ~227
కార్నియన్ ~237*
మధ్య లేడీనియన్ ~242*
అనీసియన్ 247.2
తొలి ఓలెనేకియన్ 251.2
ఇండువాన్ 251.902 ± 0.06*
పేలియోజోయిక్ పెర్మియన్ లోపింజియన్ చాంగ్‌సింగియన్ Landmasses unite into supercontinent Pangaea, creating the Appalachians. End of Permo-Carboniferous glaciation. Synapsid reptiles (pelycosaurs and therapsids) become plentiful, while parareptiles and temnospondyl amphibians remain common. In the mid-Permian, coal-age flora are replaced by cone-bearing gymnosperms (the first true seed plants) and by the first true mosses. Beetles and flies evolve. Marine life flourishes in warm shallow reefs; productid and spiriferid brachiopods, bivalves, forams, and ammonoids all abundant. Permian-Triassic extinction event occurs 251 Ma: 95% of life on Earth becomes extinct, including all trilobites, graptolites, and blastoids. Ouachita and Innuitian orogenies in North America. Uralian orogeny in Europe/Asia tapers off. Altaid orogeny in Asia. Hunter-Bowen Orogeny on Australian continent begins (c. 260–225 Ma), forming the MacDonnell Ranges. 254.14 ± 0.07*
వుచియాపింగియన్ 259.1 ± 0.4*
గ్వాడలూపియన్ కాపిటానియన్ 265.1 ± 0.4*
వోర్డియన్ 268.8 ± 0.5*
రోడియన్ 272.95 ± 0.5*
సిసురాలియన్ కుంగూరియన్ 283.5 ± 0.6
ఆర్టిన్స్కియన్ 290.1 ± 0.26
సక్మారియన్ 295 ± 0.18
అస్సీలియన్ 298.9 ± 0.15*
కార్బానిఫెరస్[g] పెన్సిల్వేనియన్ గ్ఝేలియన్ Winged insects radiate suddenly; some (esp. Protodonata and Palaeodictyoptera) are quite large. Amphibians common and diverse. First reptiles and coal forests (scale trees, ferns, club trees, giant horsetails, Cordaites, etc.). Highest-ever atmospheric oxygen levels. Goniatites, brachiopods, bryozoa, bivalves, and corals plentiful in the seas and oceans. Testate forams proliferate. Uralian orogeny in Europe and Asia. Variscan orogeny occurs towards middle and late Mississippian Periods. 303.7 ± 0.1
కాసిమోవియన్ 307 ± 0.1
మాస్కోవియన్ 315.2 ± 0.2
బాష్క్రియన్ 323.2 ± 0.4*
మిసిసిపియన్ సెర్పుకోవియన్ Large primitive trees, first land vertebrates, and amphibious sea-scorpions live amid coal-forming coastal swamps. Lobe-finned rhizodonts are dominant big fresh-water predators. In the oceans, early sharks are common and quite diverse; echinoderms (especially crinoids and blastoids) abundant. Corals, bryozoa, goniatites and brachiopods (Productida, Spiriferida, etc.) very common, but trilobites and nautiloids decline. Glaciation in East Gondwana. Tuhua Orogeny in New Zealand tapers off. 330.9 ± 0.2
విసేయన్ 346.7 ± 0.4*
టోర్నైసియన్ 358.9 ± 0.4*
డెవోనియన్ చివరి ఫామెన్నియన్ First clubmosses, horsetails and ferns appear, as do the first seed-bearing plants (progymnosperms), first trees (the progymnosperm Archaeopteris), and first (wingless) insects. Strophomenid and atrypid brachiopods, rugose and tabulate corals, and crinoids are all abundant in the oceans. Goniatite ammonoids are plentiful, while squid-like coleoids arise. Trilobites and armoured agnaths decline, while jawed fishes (placoderms, lobe-finned and ray-finned fish, and early sharks) rule the seas. First amphibians still aquatic. "Old Red Continent" of Euramerica. Beginning of Acadian Orogeny for Anti-Atlas Mountains of North Africa, and Appalachian Mountains of North America, also the Antler, Variscan, and Tuhua Orogeny in New Zealand. 372.2 ± 1.6*
ఫ్రాస్నియన్ 382.7 ± 1.6*
మధ్య గివేటియన్ 387.7 ± 0.8*
ఇఫీలియన్ 393.3 ± 1.2*
తొలి ఎమ్సియన్ 407.6 ± 2.6*
ప్రాగియన్ 410.8 ± 2.8*
లోచ్‌కోవియన్ 419.2 ± 3.2*
సిల్యూరియన్ ప్రిడోలి First vascular plants (the rhyniophytes and their relatives), first millipedes and arthropleurids on land. First jawed fishes, as well as many armoured jawless fish, populate the seas. Sea-scorpions reach large size. Tabulate and rugose corals, brachiopods (Pentamerida, Rhynchonellida, etc.), and crinoids all abundant. Trilobites and mollusks diverse; graptolites not as varied. Beginning of Caledonian Orogeny for hills in England, Ireland, Wales, Scotland, and the Scandinavian Mountains. Also continued into Devonian పీరియడ్ as the Acadian Orogeny, above. Taconic Orogeny tapers off. Lachlan Orogeny on Australian continent tapers off. 423 ± 2.3*
లుడ్లో లుడ్‌ఫోర్డియన్ 425.6 ± 0.9*
గోర్స్టియన్ 427.4 ± 0.5*
వెన్‌లాక్ హోమేరియన్ 430.5 ± 0.7*
షీన్‌వుడియన్ 433.4 ± 0.8*
లాండోవరీ టెలీచియన్ 438.5 ± 1.1*
ఏరోనియన్ 440.8 ± 1.2*
రుడ్డేనియన్ 443.8 ± 1.5*
ఓర్డోవీషియన్ చివరి హిర్నాంటియన్ Invertebrates diversify into many new types (e.g., long straight-shelled cephalopods). Early corals, articulate brachiopods (Orthida, Strophomenida, etc.), bivalves, nautiloids, trilobites, ostracods, bryozoa, many types of echinoderms (crinoids, cystoids, starfish, etc.), branched graptolites, and other taxa all common. Conodonts (early planktonic vertebrates) appear. First green plants and fungi on land. Ice age at end of period. 445.2 ± 1.4*
కేటియన్ 453 ± 0.7*
సాండ్‌బియన్ 458.4 ± 0.9*
మధ్య డారివిలియన్ 467.3 ± 1.1*
డాపింజియన్ 470 ± 1.4*
తొలి ఫ్లోయియన్
(గతంలో అరేనిగ్)
477.7 ± 1.4*
ట్రెమడోసియన్ 485.4 ± 1.9*
కాంబ్రియన్ ఫురోంజియన్ స్టేజ్ 10 Major diversification of life in the Cambrian Explosion. Numerous fossils; most modern animal phyla appear. First chordates appear, along with a number of extinct, problematic phyla. Reef-building Archaeocyatha abundant; then vanish. Trilobites, priapulid worms, sponges, inarticulate brachiopods (unhinged lampshells), and numerous other animals. Anomalocarids are giant predators, while many Ediacaran fauna die out. Prokaryotes, protists (e.g., forams), fungi and algae continue to present day. Gondwana emerges. Petermann Orogeny on the Australian continent tapers off (550–535 Ma). Ross Orogeny in Antarctica. Adelaide Geosyncline (Delamerian Orogeny), majority of orogenic activity from 514–500 Ma. Lachlan Orogeny on Australian continent, c. 540–440 Ma. Atmospheric CO2 content roughly 15 times present-day (Holocene) levels (6000 ppmv compared to today's 400 ppmv)[e] ~489.5
జియాంగ్‌షానియన్ ~494*
పైబియన్ ~497*
సీరీస్ 3 గుఝాంగియన్ ~500.5*
డ్రూమియన్ ~504.5*
స్టేజ్ 5 ~509
సీరీస్ 2 స్టేజ్ 4 ~514
స్టేజ్ 3 ~521
టెర్రెనూవియన్ స్టేజ్ 2 ~529
ఫార్చూనియన్ ~541 ± 1.0*
ప్రికాంబ్రియన్[h] ప్రోటెరోజోయిక్[i] నియోప్రోటెరోజోయిక్[i] ఎడియాకరన్ Good fossils of the first multi-celled animals. Ediacaran biota flourish worldwide in seas. Simple trace fossils of possible worm-like Trichophycus, etc. First sponges and trilobitomorphs. Enigmatic forms include many soft-jellied creatures shaped like bags, disks, or quilts (like Dickinsonia). Taconic Orogeny in North America. Aravalli Range orogeny in Indian Subcontinent. Beginning of Petermann Orogeny on Australian continent. Beardmore Orogeny in Antarctica, 633–620 Ma. ~635*
క్రయోజెనియన్ Possible "Snowball Earth" period. Fossils still rare. Rodinia landmass begins to break up. Late Ruker / Nimrod Orogeny in Antarctica tapers off. ~720[j]
టోనియన్ Rodinia supercontinent persists. Sveconorwegian orogeny ends. Trace fossils of simple multi-celled eukaryotes. First radiation of dinoflagellate-like acritarchs. Grenville Orogeny tapers off in North America. Pan-African orogeny in Africa. Lake Ruker / Nimrod Orogeny in Antarctica, 1,000 ± 150 Ma. Edmundian Orogeny (c. 920 – 850 Ma), Gascoyne Complex, Western Australia. Adelaide Geosyncline laid down on Australian continent, beginning of Adelaide Geosyncline (Delamerian Orogeny) in Australia. 1000[j]
మెసోప్రోటెరోజోయిక్[i] స్టీనియన్ Narrow highly metamorphic belts due to orogeny as Rodinia forms. Sveconorwegian orogeny starts. Late Ruker / Nimrod Orogeny in Antarctica possibly begins. Musgrave Orogeny (c. 1,080 Ma), Musgrave Block, Central Australia. 1200[j]
ఎక్టేసియన్ Platform covers continue to expand. Green algae colonies in the seas. Grenville Orogeny in North America. 1400[j]
కాలిమ్మియన్ Platform covers expand. Barramundi Orogeny, McArthur Basin, Northern Australia, and Isan Orogeny, c.1,600 Ma, Mount Isa Block, Queensland 1600[j]
పేలియోప్రోటెరోజోయిక్[i] స్టాథరియన్ తొట్టతొలి ఏకకణ జీవుల ఉద్భవం: న్యూక్లియై కలిగిన ప్రోటిస్టులు. కొలంబియా ఆదిమ కాలపు తొలి మహాఖండం. ఆస్ట్రేలియా ఖండంలోని కింబియన్ ఓరోజెనీ ముగిసింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని యిల్గామ్ క్రేటన్లో యాపుంగ్‌కు ఓరోజెనీ, గ్యాస్కోయిన్ కాంప్లెక్సులో మంగరూన్ ఓరోజెనీ 1,680–1,620 Ma. కరారన్ ఓరోజెనీ (1,650 Ma), గాలర్ క్రేటన్ దక్షిణ ఆస్ట్రేలియా. 1800[j]
ఓరోసీరియన్ వాతావరణం ఆక్సిజనీకరణమైంది. వ్రెడెఫోర్ట్, సడ్బరీ బేసిన్లలో గ్రహశకలాల ఘాతాలు. అనేక పర్వతశ్రేణుల పుట్టుక. ఉత్తర అమెరికాలో పెనోకియన్, ట్రాంస్-హడ్సోనియన్ ఓరోజెనీలు. అంటార్కిటికాలో రూకర్ ఓరోజెనీ, 2,000–1,700 Ma. గ్లెన్‌బర్గ్ ఓరోజెనీ, గ్లెన్‌బర్గ్ టెర్రేన్, ఆస్ట్రేలియన్ ఖండం c. 2,005–1,920 Ma. కింబియన్ ఓరోజెనీ, ఆస్ట్రేలియాలో గాలర్ క్రేటన్ మొదలైంది. 2050[j]
రైయేసియన్ బుష్‌వెల్డ్ ఇగ్నేషియస్ కాంప్లెక్స్ ఏర్పడింది. హ్యురోనియన్ గ్లేసియేషన్. 2300[j]
సైడీరియన్ ఆక్సిజన్ మహావైపరీత్యం: ఇనుప పొరల ఏర్పడటం మొదలు. ఆస్ట్రేలియా ఖండంలో స్లీఫోర్డ్ ఓరోజెనీ, గాలర్ క్రేటన్ 2,440–2,420 Ma. 2500[j]
ఆర్కియన్[i] నియోఆర్కియన్[i] నవీన క్రేటన్ల స్థిరీకరణ; మాంటిల్ తిరగబడ్డ ఘటన జరిగి ఉండవచ్చు. ఇన్సెల్ ఓరోజెనీ (పర్వతశ్రేణుల పుట్టుక) 2,650 ± 150 Ma. ఒంటారియో, క్విబెక్ ప్రాంతాలున్నచోట అబిటిబీ గ్రీన్‌స్టోన్ ఏర్పడడం మొదలై, 2,600 Ma.నాటికి స్థిరీకరణ చెందింది. 2800[j]
మెసోఆర్కియన్[i] తొలి స్ట్రొమాటోలైట్స్ (బహుశా కలోనియల్ సయనోబాక్టీరియా). తొట్టతొలి మైక్రోశిలాజాలు. అంటార్కిటికాలో హంబోల్ట్ ఓరోజెనీ. బ్లేక్ నది మెగాకాల్డెరా కాంప్లెక్స్ ఏర్పడటం మొదలై, సుమారు 2,696 Ma నాటికి పూర్తైంది. 3200[j]
పేలియోఆర్కియన్[i] ఆక్సిజన్ ఉత్పత్తి చేసే తొట్టతొలి బాక్టీరియా. అత్యంత పురాతన కచ్చితమైన మైక్రో శిలాజాలు. ఈ కాలంలో అత్యంత పురాతన క్రేటన్లు (కెనడియన్ షీల్డ్, పిల్బారా క్రేటన్ వంటివి) ఏర్పడి ఉండవచ్చు.[k] అంటార్కిటికా లోని రేనర్ ఓరోజెనీ. 3600[j]
ఇయోఆర్కియన్[i] తొట్టతొలి ఏకకణ జీవి (బహుశా బాక్టీరియా, ఆర్కీయాలు). అత్యంత పురాతన మైక్రోశిలాజాలు. మలి మహాఘాతాలు ముగిసిన తరువాత (4,000 Ma. ) ఏర్పడిన తొలి జీవరూపాలు, స్వయం పునరుత్పత్తి చేసుకునే తొలి RNA మాలిక్యూల్‌లు. అంటార్కిటికాలో నేపియర్ ఓరోజెనీ 4,000 ± 200 Ma. ~4000
హేడియన్[i][l] తొలి ఇంబ్రియన్ (నియోహేడియన్) (అనధికారిక)[i][m] ఆదిమ జీవానికి చెందిన పరోక్ష కిరణజన్యుసంయోగ క్రియకు (ఉదా: కెరోజెన్) ఋజువులు. ఈ ఎరాలోనే సౌరవ్యవస్థ అంతర్గతంగా జరిగిన మలి మహాఘాతాలు మొదలయ్యాయి.గురు గ్రహం, శని గ్రహాల కక్ష్యల అనునాదాల కారణంగా నెప్ట్యూన్ గ్రహం కుయిపర్ బెల్టు లోకి తరలిపోవడాన ఈ మహాఘాతాలు జరిగి ఉండవచ్చు. అత్యంత పురాతన శిల (4,031 నుండి 3,580 Ma).[20] 4130
నెక్టారియన్

(మెసో హేడియన్) (అనధికారిక)[i][m]

బహుశా తొలిసారిగా టెక్టానిక్ ప్లేట్ల ఉనికి. ఘాతాల ఫలితంగా చంద్రునిపై నెక్టారిస్ బేసిన్, గ్రేటర్ ల్యూనార్ బేసిన్ల పుట్టుక. వీటి పేరు మీదుగానే ఈ కాల ఖండికకు నెక్టారియన్ అనే పేరు పెట్టారు. తొట్టతొలి జీవపు ఉనికి. (అసాధారణ స్థాయిలో తేలిక కార్బన్ ఐసోటోపుల ఉనికి కారణంగా జీవం ఈ కాలంలో పుట్టి ఉంటుందని భావిస్తున్నారు.) 4280
బేసిన్ గ్రూప్స్

(పేలియోహేడియన్) (అనధికారిక)[i][m]

తొలి మహాఘాతాల దశ ముగింపు. అత్యంత పురాతన ఖనిజం (జిర్కాన్, 4,404 ± 8 Ma). గ్రహశకలాలు, తోకచుక్కలూ భూమికి నీటిని తేవడం.[21] 4533[22]
క్రిప్టిక్

(ఇయోహేడియన్) (అనధికారిక)[i][m]

బహుశా ఒక మహా ఘాతం ఫలితంగా చంద్రుని పుట్టుక (4,533 నుండి 4,527 Ma). భూమి పుట్టుక (4,570 నుండి 4,567.17 Ma). తొలి మహాఘాతాల దశ ప్రారంభం. సూర్యుని పుట్టుక (4,680 నుండి 4,630 Ma) . 4600

ప్రతిపాదిత ప్రికాంబ్రియన్ కాలరేఖ

మార్చు

2012 లో ICS వారు ప్రచురించిన పుస్తకంలో ప్రికాంబ్రియన్ కాల రేఖలో భుమి పుట్టుక, మహా ఆక్సిజనీకరణ ఘటన వంటి వాటిని పొందుపరచేలా అనేక మార్పులను ప్రతిపాదించారు.[23] ఆ ప్రతిపాదన కింది విధంగా ఉంది:

  • హేడియన్ ఇయాన్ – 4600–4031 మి.సం.క్రి. (మిలియన్ సంవత్సరాల క్రితం)
    • ఖయాటియన్ ఎరా – 4600–4404 మి.సం.క్రి. – భూమి పుట్టుకను సూచించే పౌరాణిక పేరైన ఖావోస్ పేరు మీదుగా [24][25]
    • జాక్ హిల్సియన్ లేదా జిర్కోనియన్ ఎరా – 4404–4031 మి.సం.క్రి. – అత్యంత పురాతనమైన ఖనిజం, జిర్కాన్ ఉనికి ఉన్న జాక్ హిల్స్ గ్రీన్‌స్టోన్ బెల్టు పేర్ల మీదుగా
  • ఆర్కియన్ ఇయాన్ – 4031–2420 మి.సం.క్రి.
    • పేలియోఆర్కియన్ ఎరా – 4031–3490 మి.సం.క్రి.
      • అకాస్టన్ పీరియడ్ – 4031–3810 మి.సం.క్రి. – అకాస్టా నీస్ పేరు మీదుగా
      • ఈసువన్ పీరియడ్ – 3810–3490 మి.సం.క్రి. – ఈసువా గ్రీన్‌స్టోన్ బెల్ట్ పేరు మీదుగా
    • మెసోఆర్కియన్ ఎరా – 3490–2780 మి.సం.క్రి.
      • వాల్‌బారన్ పీరియడ్ – 3490–3020 మి.సం.క్రి. – కాప్‌వాల్ (దక్షిణ ఆఫ్రికా) పిల్‌బారా (పశ్చిమ ఆస్ట్రేలియా) అనే రెండు పేర్లను కలిపి చెప్పిన పద సమ్మేళనం (పోర్ట్‌మాంటూ)
      • పొంగోలన్ పీరియడ్ – 3020–2780 మి.సం.క్రి. – పొంగోలా సూపర్‌గ్రూపు పేరు మీదుగా
    • నియోఆర్కియన్ ఎరా – 2780–2420 మి.సం.క్రి.
      • మెథానియన్ పీరియడ్ – 2780–2630 మి.సం.క్రి. – మెథ్నోట్రోఫిక్ పోకర్యోట్‌లు విస్తారంగా ఉన్నాయని సూచించే పదం
      • సైడీరియన్ పీరియడ్ – 2630–2420 మి.సం.క్రి. – ఈ కాలంలో విస్తృతంగా ఏర్పడిన ఇనుప పొరల పేరు మీదుగా
  • ప్రోటెరోజోయిక్ ఇయాన్ – 2420–541 మి.సం.క్రి.
    • పేలియోప్రోటెరోజోయిక్ ఎరా – 2420–1780 మి.సం.క్రి.
      • ఆక్సిజీనియన్ పీరియడ్ – 2420–2250 మి.సం.క్రి. – వాతావరణంలో ఆక్సిజన్ ఏర్పడడానికి తొలి సూచనగా ఈ పేరు పెట్టారు.
      • జాటూలియన్ or యూకర్యియన్ పీరియడ్ – 2250–2060 మి.సం.క్రి. – ఈ కలంలో ఏర్పడిన లోమగుండీ-జాటూలి δ13C ఐసోటోపు ఘటనకు, ప్రతిపాదిత [26][27] యూకర్యోట్‌ల తొలి ఉనికికీ సూచనగా ఈ పేరు
      • కొలంబియన్ పీరియడ్ – 2060–1780 మి.సం.క్రి. – కొలంబియా మహా ఖండం పేరు మీదుగా
    • మెసోప్రోటెరోజోయిక్ ఎరా – 1780–850 మి.సం.క్రి.
      • రోడీనియన్ పీరియడ్ – 1780–850 మి.సం.క్రి. – మహాఖండం రోడీనియా పేరు మీదుగా
    • నియోప్రోటెరోజోయిక్ ఎరా – 850–541 మి.సం.క్రి.
      • క్రయోజెనియన్ పీరియడ్ – 850–630 మి.సం.క్రి. – అనేక గ్లేసియేషన్లు ఏర్పడినందుకు సూచనగా
      • ఎడియాకరన్ పీరియడ్ – 630–541 మి.సం.క్రి.

స్కేలుకు అనుగుణంగా:

AcastanIsuanVaalbaranPongolanMethanianSiderianOxygenianEukaryianColumbianRodinianCryogenianEdiacaranChaotianZirconianPaleoarcheanMesoarcheanNeoarcheanPaleoproterozoicMesoproterozoicNeoproterozoicHadeanArcheanProterozoicPrecambrian

ప్రస్తుత అధికారిక కాలరేఖకు అనుసరించి. స్కేలుకు అనుగుణంగా కాదు:

SiderianRhyacianOrosirianStatherianCalymmianEctasianStenianTonianCryogenianEdiacaranEoarcheanPaleoarcheanMesoarcheanNeoarcheanPaleoproterozoicMesoproterozoicNeoproterozoicHadeanArcheanProterozoicPrecambrian

ఇవి కూడా చూడండి

మార్చు

నోట్స్

మార్చు
  1. Paleontologists often refer to faunal stages rather than geologic (geological) periods. The stage nomenclature is quite complex. For a time-ordered list of faunal stages, see [15].
  2. 2.0 2.1 Dates are slightly uncertain with differences of a few percent between various sources being common. This is largely due to uncertainties in radiometric dating and the problem that deposits suitable for radiometric dating seldom occur exactly at the places in the geologic column where they would be most useful. The dates and errors quoted above are according to the International Commission on Stratigraphy 2015 time scale except the Hadean eon. Where errors are not quoted, errors are less than the precision of the age given.

    * indicates boundaries where a Global Boundary Stratotype Section and Point has been internationally agreed upon.
  3. References to the "Post-Cambrian Supereon" are not universally accepted, and therefore must be considered unofficial.
  4. Historically, the Cenozoic has been divided up into the Quaternary and Tertiary sub-eras, as well as the Neogene and Paleogene periods. The 2009 version of the ICS time chart[16] recognizes a slightly extended Quaternary as well as the Paleogene and a truncated Neogene, the Tertiary having been demoted to informal status.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 For more information on this, see Atmosphere of Earth#Evolution of Earth's atmosphere, Carbon dioxide in the Earth's atmosphere, and Climate change. Specific graphs of reconstructed CO2 levels over the past ~550, 65, and 5 million years can be seen at File:Phanerozoic Carbon Dioxide.png, File:65 Myr Climate Change.png, File:Five Myr Climate Change.png, respectively.
  6. The start time for the Holocene epoch is here given as 11,700 years ago. For further discussion of the dating of this epoch, see Holocene.
  7. In North America, the Carboniferous is subdivided into Mississippian and Pennsylvanian Periods.
  8. The Precambrian is also known as Cryptozoic.
  9. 9.00 9.01 9.02 9.03 9.04 9.05 9.06 9.07 9.08 9.09 9.10 9.11 9.12 9.13 The Proterozoic, Archean and Hadean are often collectively referred to as the Precambrian Time or sometimes, also the Cryptozoic.
  10. 10.00 10.01 10.02 10.03 10.04 10.05 10.06 10.07 10.08 10.09 10.10 10.11 Defined by absolute age (Global Standard Stratigraphic Age).
  11. The age of the oldest measurable craton, or continental crust, is dated to 3,600–3,800 Ma.
  12. Though commonly used, the Hadean is not a formal eon[19] and no lower bound for the Archean and Eoarchean have been agreed upon. The Hadean has also sometimes been called the Priscoan or the Azoic. Sometimes, the Hadean can be found to be subdivided according to the lunar geologic timescale. These eras include the Cryptic and Basin Groups (which are subdivisions of the Pre-Nectarian era), Nectarian, and Early Imbrian units.
  13. 13.0 13.1 13.2 13.3 These unit names were taken from the lunar geologic timescale and refer to geologic events that did not occur on Earth. Their use for Earth geology is unofficial. Note that their start times do not dovetail perfectly with the later, terrestrially defined boundaries.

మూలాలు

మార్చు
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ICS_chart అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. International Commission on Stratigraphy. "Chronostratigraphic Units". Retrieved 14 December 2009.
  3. "Age of the Earth". U.S. Geological Survey. 1997. Retrieved 2006-01-10.
  4. Dalrymple, G. Brent (2001). "The age of the Earth in the twentieth century: a problem (mostly) solved". Special Publications, Geological Society of London. 190 (1): 205–221. Bibcode:2001GSLSP.190..205D. doi:10.1144/GSL.SP.2001.190.01.14.
  5. "Statutes of the International Commission on Stratigraphy". Retrieved 26 November 2009.
  6. Janke, Paul R. "Correlating Earth's History".
  7. 7.0 7.1 7.2 7.3 7.4 Michael Allaby (2020). A dictionary of geology and earth sciences (Fifth ed.). Oxford. ISBN 978-0-19-187490-1. OCLC 1137380460.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  8. 8.0 8.1 8.2 8.3 8.4 Cohen, K.M.; Finney, S.C.; Gibbard, P.L.; Fan, J.-X. (2013-09-01). "The ICS International Chronostratigraphic Chart". Episodes (in ఇంగ్లీష్). 36 (3) (updated ed.): 199–204. doi:10.18814/epiiugs/2013/v36i3/002. ISSN 0705-3797. S2CID 51819600.
  9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 "Chapter 9. Chronostratigraphic Units". stratigraphy.org. International Commission on Stratigraphy. Retrieved 2022-04-02.
  10. Aubry, Marie-Pierre; Piller, Werner E.; Gibbard, Philip L.; Harper, David A. T.; Finney, Stanley C. (2022-03-01). "Ratification of subseries/subepochs as formal rank/units in international chronostratigraphy". Episodes (in ఇంగ్లీష్). 45 (1): 97–99. doi:10.18814/epiiugs/2021/021016. ISSN 0705-3797. S2CID 240772165.
  11. Great Soviet Encyclopedia (in Russian) (3rd ed.). Moscow: Sovetskaya Enciklopediya. 1974. pp. vol. 16, p. 50.{{cite encyclopedia}}: CS1 maint: unrecognized language (link)
  12. Rudwick, Martin (2008). Worlds Before Adam: The Reconstruction of Geohistory in the Age of Reform. pp. 539–545.
  13. "Geologic Time Scale".
  14. "How the discovery of geologic time changed our view of the world". Bristol University.
  15. "The Paleobiology Database". Archived from the original on 2006-02-11. Retrieved 2018-06-14.
  16. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 29 డిసెంబరు 2009. Retrieved 14 జూన్ 2018.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  17. "NASA Scientists React to 400 ppm Carbon Milestone". NASA. Retrieved 15 January 2014.
  18. Royer, Dana L. (2006). "CO2-forced climate thresholds during the Phanerozoic" (PDF). Geochimica et Cosmochimica Acta. 70 (23): 5665–75. Bibcode:2006GeCoA..70.5665R. doi:10.1016/j.gca.2005.11.031. Archived from the original (PDF) on 2019-09-27. Retrieved 2018-06-14.
  19. Ogg, J.G.; Ogg, G.; Gradstein, F.M. (2016). A Concise Geologic Time Scale: 2016. Elsevier. p. 20. ISBN 978-0-444-63771-0.
  20. Bowring, Samuel A.; Williams, Ian S. (1999). "Priscoan (4.00–4.03 Ga) orthogneisses from northwestern Canada". Contributions to Mineralogy and Petrology. 134 (1): 3. Bibcode:1999CoMP..134....3B. doi:10.1007/s004100050465. The oldest rock on Earth is the Acasta Gneiss, and it dates to 4.03 Ga, located in the Northwest Territories of Canada.
  21. "Geology.wisc.edu" (PDF).
  22. "The Eons of Chaos and Hades" (PDF). Solid Earth. January 26, 2010.
  23. Van Kranendonk, Martin J. (2012). "16: A Chronostratigraphic Division of the Precambrian: Possibilities and Challenges". In Felix M. Gradstein; James G. Ogg; Mark D. Schmitz; abi M. Ogg (eds.). The geologic time scale 2012 (1st ed.). Amsterdam: Elsevier. pp. 359–365. ISBN 978-0-44-459425-9.
  24. Van Kranendonk, Martin J. (2012). "16: A Chronostratigraphic Division of the Precambrian: Possibilities and Challenges". In Felix M. Gradstein; James G. Ogg; Mark D. Schmitz; abi M. Ogg (eds.). The geologic time scale 2012 (1st ed.). Amsterdam: Elsevier. pp. 359–365. ISBN 978-0-44-459425-9.
  25. Goldblatt, C.; Zahnle, K. J.; Sleep, N. H.; Nisbet, E. G. (2010). "The Eons of Chaos and Hades" (PDF). Solid Earth. 1. Copernicus Publications on behalf of the European Geosciences Union: 1–3. Bibcode:2010SolE....1....1G. Archived from the original (PDF) on 2017-12-02. Retrieved 2018-06-14.
  26. El Albani, Abderrazak; Bengtson, Stefan; Canfield, Donald E.; Riboulleau, Armelle; Rollion Bard, Claire; Macchiarelli, Roberto; et al. (2014). "The 2.1 Ga Old Francevillian Biota: Biogenicity, Taphonomy and Biodiversity". PLoS ONE. 9 (6): e99438. Bibcode:2014PLoSO...999438E. doi:10.1371/journal.pone.0099438. PMC 4070892. PMID 24963687.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  27. El Albani, Abderrazak; Bengtson, Stefan; Canfield, Donald E.; Bekker, Andrey; Macchiarelli, Roberto; Mazurier, Arnaud; Hammarlund, Emma U.; et al. (2010). "Large colonial organisms with coordinated growth in oxygenated environments 2.1 Gyr ago" (PDF). Nature. 466 (7302): 100–104. Bibcode:2010Natur.466..100A. doi:10.1038/nature09166. PMID 20596019.[permanent dead link]