పీర్ పంజాల్ కనుమ

జమ్మూ కాశ్మీరు లోని కనుమ దారి

పీర్ పంజాల్ కనుమ ఒక పర్వత మార్గం, పర్యాటక కేంద్రం. ఇది జమ్మూ కాశ్మీర్ లోని పీర్ పంజాల్ శ్రేణి లో ఉంది. దీనిని పీర్ కీ గలీ (లేదా పీర్ గలీ) అని కూడా పిలుస్తారు. ఇది కాశ్మీర్ లోయను రాజౌరి, పూంచ్ జిల్లాలకు 'మొఘల్ రోడ్' ద్వారా కలుపుతుంది. మొఘల్ రహదారిపై 3,490 మీ. ఎత్తున ఉంది. కాశ్మీర్ లోయకు నైరుతి దిశలో ఉంది. [1] ఇక్కడ షేక్ అహ్మద్ కరీం మందిరం ఉంది. ఈ మార్గంలో వెళ్ళే ప్రయాణీకులకు ఇది మతాతీతమైన పవిత్ర స్థలం, విశ్రాంతి ప్రదేశం. ఈ మందిరం షోపియన్ జిల్లాలో ఉంది.

పీర్ పంజాల్ కనుమ
పీర్ కీ గలీ
Peer Ki Gali Mughal Road Poonch Srinagar.jpg
పీర్ పంజాల్ కనుమ
సముద్ర మట్టం
నుండి ఎత్తు
3,485 m (11,434 ft)
ఇక్కడ ఉన్న
రహదారి పేరు
మొగల్ రోడ్డు
ప్రదేశంజమ్మూ కాశ్మీర్, భారతదేశం
శ్రేణిపీర్ పంజాల్ శ్రేణి
Coordinates33°37′48″N 74°31′12″E / 33.629931°N 74.519968°E / 33.629931; 74.519968Coordinates: 33°37′48″N 74°31′12″E / 33.629931°N 74.519968°E / 33.629931; 74.519968
పీర్ పంజాల్ కనుమ is located in Jammu and Kashmir
పీర్ పంజాల్ కనుమ
జమ్మూ కాశ్మీరులో స్థానం

పేరుసవరించు

పీర్ పంజాల్ కనుమ పేరిట పీర్ పంజాల్ శ్రేణికి ఈ పేరు వచ్చింది. దీని అసలు పేరు పాంచాలదేవ. పాంచాల అనేది మహాభారతంలో పేర్కొన్న దేశం. ప్రస్తుత వాయవ్య ఉత్తర ప్రదేశ్ లోని ప్రాంతం. అయితే, మహాభారత ప్రాంతాలను పశ్చిమ పంజాబ్, దక్షిణ కాశ్మీర్లకు చెందినవిగా చూపించే సంప్రదాయాలు కూడా ఉన్నాయి. పండిత దినేశ్‌చంద్ర సిర్కార్ శక్తి -సంగమ తంత్రంలో వివరించిన భౌగోళిక విశ్లేషణ ప్రకారం కూడా ఇలాగే ఉంది.[2]

ఎత్తైన పర్వత మార్గాలను ఎప్పుడూ దేవతలుగానే పరిగణిస్తారని, వాటికి దేవతలతో సంబంధాన్ని ఆపాదిస్తారనీ ఎంఏ స్టెయిన్ పేర్కొన్నాడు. ఈ ప్రాంతం ఇస్లామీకరించబడిన తరువాత, దేవతకు ప్రత్యామ్నాయంగా ముస్లిం సాధువు పీర్ అనే భావనను వాడుతూ ఈ ఆచారాలు కొనసాగాయి. [3]

పీర్ పంజాల్ కనుమ పేరిటనే ఈ పర్వత శ్రేణికి (పీర్ పంజాల్ శ్రేణి ) అనే పేరు వచ్చింది. ఇటీవలి కాలంలో, "పంజాల్" అనే పదాన్ని పర్వత శ్రేణికి మాత్రమే ఉంచేసి, ఈ కనుమను కేవలం పీర్ కీ గలీ (పీర్ కనుమ) అని పిలుస్తున్నారు. [4] సాధువు నంద ఋషి, మరో సాధువు షేక్ అహ్మద్ కరీమ్‌ లకు ఈ కనుమతో ఆధ్యాత్మిక సంబంధం ఉంది. [5]

వివరణసవరించు

పీర్ పంజాల్ కనుమ

పీర్ పంజాల్ కనుమ పీర్ కీ గలీ అనే పేరున్న పశ్చిమ ప్రవేశ ద్వారానికి, తూర్పు చివరన ఉన్న అలియాబాద్ సరాయ్ అనే చారిత్రిక ప్రదేశానికీ మధ్య ఉంది. పీర్ పంజాల్ వాగు అనే వాగు ఈ లోయ గుండా వెళుతుంది, తూర్పుగా ప్రవహించే ఈ వాగు, షోపియన్ జిల్లాలో రాంబి అరా నదిగా మారుతుంది. కనుమ ద్వారా వెళ్ళే పాత మార్గం ఈ వాగుకు దక్షిణాన వెళ్ళేదని, అయితే దక్షిణాన హస్తివాంజ్ అని నిట్టనిలువైన కొండను దాటడం కష్టం కావడంతో మొగలులు ఈ మార్గాన్ని వాగుకు ఉత్తరం వైపుకు మార్చారనీ మొహిబుల్ బుల్ హసన్ పేర్కొన్నాడు. [6] 2005-2009 మధ్య నిర్మించిన ఆధునిక "మొఘల్ రోడ్డు" మొఘలులు ఉపయోగించిన మార్గానికి దగ్గరగా ఉంటుంది గానీ, సరిగ్గా అలాగే ఉండదు.

పీర్ కీ గలీకి పశ్చిమాన, కొండలు ఒక లోయలోకి చాలా నిటారుగా దిగుతాయి. ఇక్కడ మరొక వాగు ఉండి. ఇది ఉత్తరం నుండి ప్రవహించే పూంచ్ నదిలో కలుస్తుంది. లోయ చివరన బహ్రమ్‌గాలా (అసలు పేరు: భైరవ్‌గాల) అనే గ్రామం ఉంది. [3] సిక్కులు ఈ కనుమను బహ్రమ్‌గాలా పేరిట బహ్రమ్‌గాలా కనుమ అని అంటారు. తద్వారా బహ్రమ్‌గాలా గ్రామాన్ని కనుమకు పశ్చిమ హద్దుగా గుర్తించారు. [7]

ఆధునిక మొఘల్ రహదారి నిటారుగా ఉన్న కొండను దిగకుండా, ఉత్తరాన కొండ పక్కల నుండి వెళ్తుంది. ఇది బహ్రమ్‌గాలాకు పశ్చిమాన 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుఫ్లియాజ్ అనే పట్టణం వద్ద ముగుస్తుంది. అక్కడ నుండి జాతీయ రహదారి 144A, వాయవ్యంలో పూంచ్‌ను, దక్షిణాన రాజౌరిని కలుపుతుంది.

పీర్ కీ గలీ వద్ద, శీతాకాలంలో ఉష్ణోగ్రత -7 °C నుండి -9 °C వరకూ పడిపోతుంది.[8] ఇది మొఘల్ రోడ్‌లోనే ఎత్తైన ప్రదేశం. పీర్ కీ గలీ షోపియాన్ నుండి 40 కి.మీ., పూంచ్ నుండి 80 కి.మీ. ఉంటుంది. [5] [9]

చరిత్ర, ప్రాముఖ్యతసవరించు

చరిత్రకారుడు మొహిబుల్ బుల్ హసన్, కాశ్మీర్ లోయలోకి ప్రవేశించే ప్రధాన కనుమల్లో పీర్ పంజాల్ కనుమ ఒకటని, లోయ చరిత్రపై అది చాలా గొప్ప ప్రభావాన్ని చూపిందనీ అన్నాడు. [6] కాశ్మీర్ లోయలోని హీరాపురా (ఆధునిక హిర్పోరా) నుండి రాజౌరికు కనుమ ద్వారా వెళ్ళే రహదారి పూర్వకాలం నుండీ వాడుకలో ఉండేది. సుల్తాన్ల కాలంలో దీన్ని భీంబర్ వరకు పొడిగించినట్లు తెలుస్తోంది. [6]

కాశ్మీర్ లోయను జయించిన తరువాత, అక్బర్ చక్రవర్తి ఈ మార్గాన్ని లాహోర్ నుండి కాశ్మీర్ వరకు విస్తరించి దాన్ని 'రాచమార్గం' గా బలోపేతం చేశాడు. [6] ఆధునిక కాలంలో, ఈ మార్గాన్ని 'మొఘల్ రోడ్' అని అంటారు. [10]

సిక్కు చక్రవర్తి మహారాజా రంజిత్ సింగ్ 1814 లో దుర్రానీ- పాలనలో ఉన్న కాశ్మీర్ లోయపై దాడి చేశాడు. తన సైన్యాన్ని రెండు భాగాలుగా విభజించి, ఒక భాగాన్ని దివాన్ రామ్ దయాల్ నాయకత్వంలో పీర్ పంజాల్ కనుమ ద్వారాను, రెండోదానికి తానే నేతృత్వ్ం వహించి, తోసా మైదాన్ ద్వారానూ నడిపించాడు. రామ్ దయాల్ పీర్ పంజల్ కనుమ ద్వారా చొచ్చుకుపోయి, బారాముల్లాకు చేరుకుని అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే, తోసా మాడియన్ వద్ద దుర్రానీ రక్షణను రంజిత్ సింగ్ ఛేదించలేక, వెనక్కి మళ్ళాడు. [11] 1819 లో చేసిన రెండవ దాడిలో, సైన్యాన్నంతటినీ తోసా మైదాన్ ద్వారా పంపించి, దుర్రానీ సైన్యాన్ని జయించాడు. [12]

అలియాబాద్ సరాయ్సవరించు

 
ప్రస్తుత మొఘల్ రోడ్ నుండి వెనుక వైపుకు చూస్తే కనిపించే అలియాబాద్ సారాయ్ మార్గ స్థావరం.

అలియాబాద్ సారాయ్ పీర్ పంజాల్ కనుమ మార్గం లోని ఒక చారిత్రక విశ్రాంతి స్థలం. దీనిని 16 వ శతాబ్దం చివరిలో జహంగీర్ నిర్మించినట్లు చెబుతారు. మొగల్ రోడ్డు వెంబడి లాహోర్, శ్రీనగర్‌ల మధ్య నిర్మించిన 14 విశ్రాంతి స్థావరాల్లో ఇదొకటి. అలీ మర్దాన్ ఖాన్ అనే ఇరానియన్ ఇంజనీర్ స్థానిక అధిపతుల సహాయంతో దీన్ని నిర్మించాడు. ఈ వారసత్వ భవనాన్ని కాపాడ్డంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇటీవలి కాలంలో దీనిని స్థానిక గొర్రెల కాపరులు పశువుల చావడిగా వాడుతున్నారు. [13] [14]

ఒరిజినల్ మొఘల్ రోడ్డు అలియాబాద్ సరాయ్ విశ్రాంతి గృహం ముందునుంచి పోయేది. ప్రస్తుత రహదారి దాని వెనుక నుండి, ఇంకొంచెం ఎత్తున వెళ్టుంది.

పీర్లుసవరించు

 
షేక్ అహ్మద్ కరీం ధ్యానం చేసిన ప్రదేశం వద్ద ఉన్న మందిరం

నంద ఋషి పీర్ కీ గలీలో ఉండేవాడని స్థానికంగా భావిస్తారు. అయితే, వ్రాతపూర్వక రికార్డుల ప్రకారం, షేక్ అహ్మద్ కరీం అనే పీరు, జహంగీర్ చక్రవర్తి కాలంలో పీర్ కీ గలీలో నివసించి ధ్యానం చేశాడు. అతను హిందూ మతం నుండి ఇస్లాంకు మారినట్లు చెబుతారు. అతను పీర్ కీ గలీని పవిత్ర స్థలంగా భవించి, బాటసారులందరూ అక్కడ భక్తితో వ్యవహరించాలని చెప్పాడు. జహంగీర్ చక్రవర్తి అతడి నిబంధనలను పట్టించుకోలేదని రికార్డులు చెబుతున్నాయి. అయితే షాజహాన్ ఔరంగజేబులు వాటిని పాటించారు. [5]

పీర్ కీ గలీలో ఒక మందిరం ఉంది. ఇది పీర్ ధ్యానం చేసిన ప్రదేశాన్ని సూచిస్తుంది. అతని చేతి ముద్రతో ఉన్న ఒక రాయి దాని లోపల ఉందని విశ్వసిస్తారు. [5]

మూలాలుసవరించు

 1. "South Kashmir: Fresh snowfall at Pir ki Gali closes Mughal road". Kashmir Reader. 1 November 2018. Archived from the original on 23 ఏప్రిల్ 2019. Retrieved 24 ఫిబ్రవరి 2020. {{cite news}}: Check date values in: |access-date= and |archive-date= (help)
 2. Sircar, Dineschandra (1971), Studies in the Geography of Ancient and Medieval India, Motilal Banarsidass, pp. 204–205, ISBN 978-81-208-0690-0
 3. 3.0 3.1 Stein, Kalhana's Rajatarangini, Volume 2 (1900).
 4. "Snowfall hampers efforts to restore Mughal Road". India Today. 24 December 2017.
 5. 5.0 5.1 5.2 5.3 Irfan, Shams (15 July 2014). "History and Mystery of Peer ki Gali". Kashmir Life. Archived from the original on 24 ఫిబ్రవరి 2020. Retrieved 24 ఫిబ్రవరి 2020. {{cite news}}: Check date values in: |access-date= and |archive-date= (help)
 6. 6.0 6.1 6.2 6.3 Hasan, Kashmir under the Sultans (1959).
 7. Gupta, The Sikh Lion of Lahore (1991).
 8. "43 rescued from Zojila, Pir Ki Gali after 3 days". Daily Excelsior. 6 November 2018.
 9. "Peer ki Gali". J&K Tourism Development Corporation. Archived from the original on 29 జూన్ 2019. Retrieved 21 July 2019. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 10. Now, Mughal Road To Connect J&K, The Times of India, 14 July 2005.
 11. Gupta, The Sikh Lion of Lahore 1991, pp. 125–127.
 12. Gupta, The Sikh Lion of Lahore 1991, pp. 128–129.
 13. Tazeem Akhter, A Peek into the Aliabad Sarai, Kashmir Times, 14 October 2012.
 14. "District Census Handbook – Shupiyan" (PDF). Census of India. 2011.

వెలుపలి లంకెలుసవరించు