రాజౌరీ జిల్లా
జమ్మూ కాశ్మీరు రాష్ట్రం లోని 20 జిల్లాలలో రాజౌరీ జిల్లా ఒకటి. జిల్లా పశ్చిమ సరిహద్దులో భారత్ పాక్ సరిహద్దు, ఉత్తర సరిహద్దులో పూంచ్ (జమ్మూ కాశ్మీరు) దక్షిణ సరిహద్దులో నౌషెరా, చాంబు ఉన్నాయి. రాజౌరీ జిల్లాలో 6 తెహ్సిల్స్ (బారోలు) ఉన్నాయి: ఈ భూభాగం అత్యంత సారవంతం, పర్వమయం అయింది. ఈ ప్రాంతంలో మొక్కజొన్న, వరి పంటలు ప్రధానపంటలుగా ఉన్నాయి. పిర్‌పింజల్ పర్వతాలలో జన్మించిన తవి నదీ జలాలు ఈ జిల్లా వాసుల నీటి అవసరాలకు ఆధారభూతంగా ఉంది. ఉర్దు, ఆంగ్లం బోధనామాధ్యమాలుగా ఉన్నాయి. గుజ్రి, పహరి, డోగ్రి వంటి భాషలు వాడుకలో ఉన్నాయి. బకర్వలా గిరిజనులు, గుజ్జర్ ప్రజలలో గుజ్రి భాష వాడుకలో ఉంది. బక్రీవాలాలు గొర్రెలు, మేకల మందలు, గుర్రాలను మేపడం వృత్తిగా అవలంబించిన వారు అంటేకాక వారికి స్వల్పంగా వ్యవసాయభూమి కూడా ఉంటుంది. పశువుల మందలు మాత్రమే సంపదగా కలిగినవారిని నోమడ్స్ అంటారు. మతపరంగా వేరై ఉన్నప్పటికీ వారంతా ఐకమత్యంగా మెలుగుతుంటారు. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా ప్రజలలో 60% ముస్లిములు, 37% హిందువులు, 2% సిక్కులు, ఇతరులు ఉన్నారు.
రాజౌరీ జిల్లా | |
---|---|
Coordinates (రాజౌరీ): 33°15′N 74°15′E / 33.25°N 74.25°E | |
దేశం | India |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు |
విభాగం | జమ్మూ |
ప్రధాన కార్యాలయం | రాజౌరీ |
తహసీల్సు | 1.రాజౌరి, 2.మంజకోటే, 3.దర్హాల్, 4.క్విలా దర్హాల్, 5.తానా మండి, 6.కోట్రంకా, 7.ఖావాస్, 8.తర్యత్, 9.కలకోట్, 10.బెరి పట్టన్, 11.సుందర్బని, 12.నోషెరా, 13.సియోట్ |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 4 |
విస్తీర్ణం | |
• Total | 2,630 కి.మీ2 (1,020 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 6,42,415 |
• జనసాంద్రత | 240/కి.మీ2 (630/చ. మై.) |
• Urban | 8.1% |
జనాభా | |
• అక్షరాస్యత | 68.17% |
• లింగ నిష్పత్తి | 860 |
Time zone | UTC+05:30 |
Vehicle registration | JK-11 |
Website | http://rajouri.nic.in/ https://rajouri.in/ |
చరిత్ర
మార్చురాజౌరీ పూర్వంలో రాజపుర అని పిలువబడేది. మహాభారత కాలంలో దీనికి ప్రాధాన్యత ఉండేది.[1] ఇదుకు చైనాయాత్రికుడు హూయంత్సాంగ్ వద్ద కొంత ఆధారాలు ఉన్నాయి.[2] రాజౌరీ, పూంచ్, అభిసర కాంభోజరాజ్య ఆధీనంలో ఉంటూ ఉండేది.[3] పురాణ కాలంలో ఈ ప్రాంతం రాజపురం కాంభోజ రాజ్యంలో భాగమై ఉండేది. కామ-రాజపురం - గత్వ-కాంభోజ-నిర్జితస్వ..[4]
నిర్వహణ
మార్చు- పుల్వామా జిల్లాలో 7 తెహ్సిల్స్ ఉన్నాయి: రాజౌరీ, డర్హల్, సునర్బని, కోటెరంక, నౌషెరా, తన్నమండి, కలకోట్.
- జిల్లాలో 9 బ్లాకులు ఉన్నాయి: రాజౌరీ, డర్హల్, సునర్బని, డూంగి, నౌషెహ్రా, కలకోట్, మంజకోటె, తన్నమండ్, బుధ.[5] ఒక్కో బ్లాకులో పలు పంచాయితీలు ఉన్నాయి.
రాజకీయాలు
మార్చురాజౌరీ జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: నౌషెరా, డర్హల్, రాజౌరీ, కాలకోట్.[6]
2001 లో గణాంకాలు
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 642,415, [7] |
ఇది దాదాపు. | సోలోమన్ ద్వీపాలు దేశ జనసంఖ్యకు సమానం.[8] |
అమెరికాలోని. | వర్మోంట్ నగర జనసంఖ్యకు సమం.[9] |
640 భారతదేశ జిల్లాలలో. | 518 వ స్థానంలో ఉంది.[7] |
1చ.కి.మీ జనసాంద్రత. | 235 [7] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 28.14%.[7] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 863: 1000 [7] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 68.54%.[7] |
జాతియ సరాసరి (72%) కంటే. |
సరిహద్దులు
మార్చుమూలాలు
మార్చు- ↑ MBH 7.4.5; 7/91/39-40.
- ↑ Watters, Yuan Chawang, Vol I, p 284.
- ↑ See: Political History of Ancient India, 1996, pp 133, 219/220, Dr H. C. Raychaudhury, Dr B. N. Mukerjee; A History of India, pp 269-71, N. R. Ray, N. K. Sinha.
- ↑ Mahabharata 7.4.5.
- ↑ Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
- ↑ "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 22 అక్టోబరు 2008. Retrieved 28 August 2008.
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 7.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011.
Solomon Islands 571,890 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011.
Vermont 625,741