పుట్టపర్తి నగరపంచాయితీ

పుట్టపర్తి నగరపంచాయితీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురంజిల్లాకు చెందిన నగరపంచాయితీ.[1] ఈ నగర పంచాయతీ హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం లోని, పుట్టపర్తి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందినది.

పుట్టపర్తి నగరపంచాయితీ
పుట్టపర్తి
స్థాపన2021
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం

చరిత్ర మార్చు

ఈ నగర పంచాయతీ 2021 లో 20 వార్డులలో ఏర్పాటు చేశారు.[2]

భౌగోళికం మార్చు

పుట్టపర్తి నగరపంచాయితీ (14°9.91′N 77°48.70′E) అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది.ఇది సమీప పట్టణమైన ధర్మవరంకి 40 కి.మీ దూరంలో ఉంది. సముద్రమట్టానికి 475 మీటర్ల ఎత్తులో ఉంది.

జనాభా గణాంకాలు మార్చు

ఈ పురపాలక సంఘంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 15088 జనాభా ఉన్నరు. అందులో పురుషులు 7370, మహిళలు 7718 మంది ఉన్నారు.షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1896 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 587.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1579 ఉన్నారు.పుట్టపర్తి సగటు సెక్స్ నిష్పత్తి 1047, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 993 కంటే ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే పుట్టపర్తి గ్రామంలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. 2011 లో, ఆంధ్రప్రదేశ్ లోని 67.02 %తో పోలిస్తే పుట్టపర్తి అక్షరాస్యత 70.43 %. పుట్టపర్తిలో పురుషుల అక్షరాస్యత 78.12 %, ఉండగా స్త్రీల అక్షరాస్యత 63.20 %. కలిగి ఉన్నారు.[3]

పౌర పరిపాలన మార్చు

ఈ నగర పంచాయతి కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[4]

మూలాలు మార్చు

  1. "Municipal Corporation and Municipalities | Ananthapuramu District , Government of Andhra Pradesh | India". Archived from the original on 2021-10-10. Retrieved 2021-10-10.
  2. "DTCP". dtcp.ap.gov.in. Archived from the original on 2021-05-10. Retrieved 2021-10-10.
  3. "మున్సి'పోల్స్‌' ఫలితాలు: వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌". Sakshi. 2021-03-14. Retrieved 2021-10-11.
  4. "No polls in Penukonda, Pamidi municipalities". The Hindu. Special Correspondent. 2021-02-18. Retrieved 2021-10-10.{{cite news}}: CS1 maint: others (link)

వెలుపలి లంకెలు మార్చు