పుట్టింగళ్ దేవాలయ అగ్నిప్రమాదం
ఏప్రిల్ 10 2016 న భారత కాలమానం ప్రకారం 03:30 గంటలకు కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాకు చెందిన పరవూర్ లో నెలకొనియున్న పుట్టింగళ్ దేవాలయంలో బాణాసంచా వేడుకలలో జరిగిన బాణాసంచా విస్ఫోటనం జరిగి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 107 మంది ప్రజలు మరణించారు.[1] ప్రమాద తాకిడికి, అగ్నిప్రమాదం మూలంగా 350కి పైగా గాయపడ్డారు.[2] ఆ దేవాలయం, ఆ ప్రదేశాంలో గల సుమారు 150 గృహాలు ప్రేలుడు మూలంగా నష్టపోయినవి.[3] స్థానిక నివేదిక ప్రకారం[4], ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, [2] ఈ ప్రేలుడు బాణసంచా కాల్చడం వలన వెలువడిన నిప్పురవ్వలు [2] కాంక్రీటు భవనంలో నిల్వచేయబడిన కాల్చని బాణసంచా పై పడి మొత్తం బాణ సంచాకు నిప్పు అంటుకొని పెను ప్రేలుడు సంభవించింది.[2][4][5] ఈ దేవాలయ సిబ్బంది కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి బాణ సంచా పోటీల కొరకు ముందస్తు అనుమతి తీసుకోలేదు.[6] ఈ బాణ సంచా ఉత్సవం ఏడు రోజులు జరుగుతుంది. హిందూ దేవత భద్రకాళి యొక్క ఉత్సవం యొక్క ఆఖరి రోజున జరిగే ఈ బాణసంచా పోటీలకు సుమారు 15,000 మంది యాత్రికులు సందర్శించారు.[7]
Date | 10 ఏప్రిల్ 2016 |
---|---|
Time | 03:30 భారత ప్రామాణిక సమయం (22:00 UTC on April 9) |
Location | పరవూర్ (కొల్లాం), కొల్లాంజిల్లా, కేరళ భారతదేశం |
Coordinates | 8°48′45″N 76°39′52″E / 8.8126°N 76.6644°E |
Deaths | 107[1] |
Non-fatal injuries | 350 |
ఈ ఉదంతం జరిగిన తరువాత ఏప్రిల్ 13న కేరళ హైకోర్టు రాష్ట్రంలో వివిధ దేవాలయాల వద్ద ధ్వనిని ఉత్పత్తి చేసే బాణసంచాను సూర్యాస్తమయం తరువాత కాల్చుటను నిషేధించింది.[8]
దక్షిణ భారతదేశంలో జరిగిన అతి పెద్ద అగ్ని ప్రమాదాలలో ఇది రెండవది. దీనికంటే ముందు తమిళనాడు లోని శివకాశి ఫాక్టరీలో జరిగిన ప్రేలుళ్ళు సెప్టెంబరు 5 2012 న జరిగింది. ఇది అతి పెద్ద ప్రేలుడు.[9] ఈ పుణ్యక్షేత్రం ఎఝవ తెగచే ప్రాతినిద్యం వహించబడుతున్న ఒక ప్రైవేటు ట్రస్టు చే నిర్వహింపబడుతుంది.[10]
పుట్టింగల్ దేవీ ఆలయంలో ఎక్కువ భాగం చెక్కతో నిర్మించారు. ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది ఒకే చోట ఉండడంతో ప్రాణ నష్టం పెరిగిందని అధికారులు చెప్పారు. భరణి నక్షత్రంలో మీనా భరిణి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించే క్రమంలోనే ఈ అగ్నిప్రమాదం జరిగింది. పుట్టింగల్ దేవీ ఆలయం ఉత్సవానికి ప్రతి ఏడాది చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి సుమారు 50 వేల మంది భక్తులు వస్తారు. ఈసారి కూడా భక్తులు భారీ సంఖ్యలోనే వచ్చారు.[11]
నేపథ్యం
మార్చుదక్షిణ భారతదేశంలో తరచూ జరిగిన హిందూ దేవతల ఉత్సవాలలో బాణసంచా కాల్చుట జరుగుతున్నది. జాతీయ పోటీలను కేరళ రాష్ట్రమంతటా నిర్వహిస్తారు. 1952లో 62 మంది ప్రజలు శబరిమల దేవాలయం వద్ద జరిగిన బాణసంచా పేలుళ్ళలో మరణించారు.[12]
ఏప్రిల్ 10 2016 న పుట్టింగళ్ దేవాలయం వద్ద జరిగిన ఉత్సవంలో రెండు వర్గాల దైవారాధకులు వేల సంఖ్యలో బాణసంచా పోటీలో పాల్గొన్నారు.[12] దేవాలయ అధికారులు ఈ ఉత్సవం కొరకు జిల్లా అధికారుల నుండి మౌఖిక అనుమతులు ఉన్నాయని పోలీసులకు తెలియజేసారు.[12] ఏప్రిల్ 12 న అధికారులు రక్షణ చర్యలకోసం ఈ ఉత్సవాన్ని అనుమతినీయలేదు కానీ ప్రజల ఒత్తిడి పెరగడం మూలంగా ఉత్సవం జరిగింది.[13]
అగ్ని ప్రమాదం
మార్చుఈ అగ్నిప్రమాదం సుమారు భారత ప్రామాణిక ప్రకారం 03:30 కు జరిగింది. దేవాలయంలో తరువాత వచ్చు విష్ణు ఉత్సవాలకొరకు కొంత బాణసంచాను దేవాలయంలో ఒక భవనంలో నిల్వ ఉంచారు.[14] బాణసంచా ఉత్సవంలో పైకెగసి పడిన నిప్పురవ్వలు ఈ భవనం పై పడటం వలన ఈ ప్రమాదం సంభవించింది.[15] ఈ ప్రమాదంలో భవనం మొత్తం ధ్వంసం అయినది.[16] ఈ ప్రేలుడు ఈ దేవాలయానికి సుమారు ఒక కిలోమీటరు పైగా దూరంలో గల ప్రజలకు అనుభవం కలిగింది.[2][16]
రికవరీ
మార్చుఈ ప్రమాదం కొరకు భారత నావికాదళం ఒక "డార్నియర్ డో 228" రవాణా విమానం, రెండు హెలీకాప్టర్లను పంపింది. ఈ రవాణా వాహనాలలో కోచీలోని దక్షిణ నావీ కమాండ్ హెడ్ క్వార్టర్ నుండి వైద్య బృందాలను పంపింది.[17] ఈ రెస్క్యూ ఆపరేషన్ లో భారత వైమానిక దళం, భారత సైనిక దళం, భారతీయ కోస్టు గార్డులు పాల్గొన్నారు.
అత్యధిక బాధితులను తిరువనంతపురం మెడికల్ కళాశాలకు పంపారు.[18]
విచారణ
మార్చుకేరళ రాష్ట్ర హోం శాఖా మంత్రి రమేష్ చెన్నితల ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు.[16] పోలీసులు బాణసంచా కాంట్రాక్టర్లు, దేవాలయ యాజమాన్యంపై చర్యలు తీసుకొనుటకు పథకం వేసింది.[16] ఏప్రిల్ 11 2016 న దేవాలయంలో పనిచేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు విచారణ కోసం కస్టడీ లోనికి తీసుకున్నారు.[19] ఏప్రిల్ 11 రాత్రి, ఏప్రిల్ 12న పోలీసులు ఏడుగురు వ్యక్తులను అరెస్టూ చేసారు. ఈ వ్యక్తులలో దేవాలయ అధ్యక్షులు కూడా ఉన్నారు.[13]
ప్రతిచర్యలు
మార్చుప్రధాని నరేంద్ర మోడీ ఈ సంఘటన "హృదయ విదారకమైనది, మాటలకు అందని ఆశ్చర్యకరమైనది"గా ట్విట్టర్ లో అభివర్ణించారు.[20] ఆయన ఆరోజు మధ్నాహ్నం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓమెన్ చండీతో కలసి ఆ ప్రదేశానికి సందర్శించుటకు వెళ్ళారు.[21] కేరళ రాష్ట్ర హోం మంత్రి రమేష్ చెన్నితల ఈ ప్రమాద బాధితులను పరామర్శించారు.[16] 2016 కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను వాయిదా వేసారు.[16]
మోడీ మరణించినవారికి రెండు లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 50,000 లను పరిహారంగా ప్రకటించారు.[22] ముఖ్యమంత్రి ఒమన్ చాందీ మరణించిన వారి బంధువులకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
కేరళ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ "దేవాలయాలలో బాణసంచా నిల్వ చేయుటకు ఎప్పుడూ అనుమతి యివ్వకూడదు" అని ప్రకటించారు.[23]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Kollam temple fire: Death toll reaches 111, 40 badly wounded". Times of India. Retrieved 12 April 2016.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 Nair, C. Gouridasan; Pereira, Ignatius (10 April 2016). "Live–Kollam temple fire: 106 dead; PM Modi reaches site". The Hindu. Kollam. Retrieved 10 April 2016.
- ↑ "Indian court bans use of high-decibel crackers after temple fireworks blaze kills 110". Reuters. 12 April 2016.
- ↑ 4.0 4.1 "Over 80 dead in temple fire in South India after firecrackers cause 'massive blast'". rt.com. Russia Today. Archived from the original on 10 ఏప్రిల్ 2016. Retrieved 10 April 2016.
- ↑ Vidyadharan, Sovi. "Over 100 Dead, 350 Injured in Kerala Temple Firework Mishap". New Indian Express. Archived from the original on 11 ఏప్రిల్ 2016. Retrieved 12 April 2016.
- ↑ "'Competitive Fireworks' May Have Led To Kollam Temple Fire: 10 Developments". NDTV. Retrieved 2016-04-10.
- ↑ "As it happened: 110 dead in Kerala temple fire, Modi meets CM Chandy". HindustanTimes.com/. Retrieved 11 April 2016.
- ↑ "Kerala HC bans noise-making fireworks between sunrise and sunset". The Indian Express. 13 April 2016.
- ↑ "Sivakasi fire unit mishap: 36 killed; PM, Sonia express grief". Hindustan Times. 6 September 2012.
- ↑ G, Ananthakrishnan (11 April 2016). "Kollam temple fire: Fireworks send concrete missiles flying into homes". ABP News. Archived from the original on 14 ఏప్రిల్ 2016. Retrieved 12 April 2016.
- ↑ "కేరళ : పుట్టింగల్ దేవీ ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం : 110 మంది దుర్మరణం". Archived from the original on 2016-05-14. Retrieved 2016-05-06.
- ↑ 12.0 12.1 12.2 Qureshi, Imran; Padanna, Ashraf (11 April 2016). "Puttingal: India's 'temple of fireworks'". BBC News. Retrieved 13 April 2016.
- ↑ 13.0 13.1 "Puttingal temple fire: Seven officials detained by police". BBC News. 12 April 2016. Retrieved 13 April 2016.
- ↑ "Scores killed in India as fire breaks out at temple in Kollam". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). 9 April 2016. ISSN 0261-3077. Retrieved 10 April 2016.
- ↑ "Kerala fire tragedy: Temple ignores ban, fireworks show leaves over 100 dead, 400 injured". The Indian Express. 11 April 2016. Retrieved 11 April 2016.
- ↑ 16.0 16.1 16.2 16.3 16.4 16.5 "India Kerala: Temple fireworks blast kills at least 100". BBC News. Retrieved 10 April 2016.
- ↑ "Live updates: 102 die in fireworks blast at Puttingal temple in Kollam, Kerala". ManoramaOnline. Archived from the original on 10 ఏప్రిల్ 2016. Retrieved 10 April 2016.
- ↑ C. Maya (10 April 2016). "Kollam temple fire: Medical College hospital struggles to handle huge influx of victims". The Hindu. Thiruvananthapuram. Retrieved 10 April 2016.
- ↑ "Puttingal temple: Five detained over India fireworks blast". BBC News. 11 April 2016. Retrieved 11 April 2016.
- ↑ @narendramodi (10 April 2016). "Fire at temple in Kollam is heart-rending & shocking beyond words. My thoughts are with families of the deceased & prayers with the injured" (Tweet) – via Twitter.
- ↑ "Kerala Temple Fire 'Heartrending And Shocking', Will Visit Kollam Soon: PM Modi". NDTV. Retrieved 10 April 2016.
- ↑ "Kollam Temple Fire: PM Modi announces ex-gratia of Rs. 2 lakhs, to visit site". The Hindu. 10 April 2016. ISSN 0971-751X. Retrieved 10 April 2016.
- ↑ Vidhi Doshi. "Kerala temple fire leaves scores dead after stray firework sparks blasts". the Guardian. Retrieved 11 April 2016.