పుణ్యస్త్రీ

సూపర్ మూవీ

పుణ్యస్త్రీ 1986 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని ప్రమోద ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై కె. బెనార్జీ నిర్మించాడు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, కార్తీక్, భవ్య ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1] ఇది అవల్ సుమంగలితన్ (1985) అనే తమిళ చిత్రానికి రీమేక్.[2]

పుణ్యస్త్రీ
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిరాజా పినిశెట్టి
నిర్మాణం కె. బెనర్జీ
కథ విసు
చిత్రానువాదం రవిరాజా పినిశెట్టి
తారాగణం కార్తీక్ ,
భవ్య,
రాజేంద్ర ప్రసాద్
సంగీతం కె. చక్రవర్తి
నృత్యాలు కె.ఎస్. హరి
సంభాషణలు తోటపల్లి సాయినాథ్
నిర్మాణ సంస్థ ప్రమోద ఆర్ట్ ఫిల్మ్స్
భాష తెలుగు

ఒక ఆలయానికి కాపలాదారు బాబూరావు (గొల్లపుడి మారుతీరావు). అతను పేదవాడు అయినప్పటికీ, భార్య పార్వతి (అన్నపూర్ణ), కుమార్తె లక్ష్మి (భవ్య), కుమారుడు బాలూ (అలీ) లతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూంటాడు. క్రైస్తవ కుటుంబం పీటర్ (రాజేంద్ర ప్రసాద్), అతని సోదరి స్టెల్లా (సంయుక్త) తో కలిసి నివసించే సివిల్ ఇంజనీరు భాస్కర్ (కార్తీక్) తో లక్ష్మికి సంబంధం మాట్లాడతాడు, బాబూ రావు. భాస్కర్ లక్ష్మిని వివాహం చేసుకుంటాడు. వారందరూ చాలా సంతోషంగా జీవించడం ప్రారంభిస్తారు.

భాస్కర్ తన అత్తగారి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా చూసుకుంటాడు. అకస్మాత్తుగా ఒక షాకింగ్ సంఘటన; భాస్కర్ తనకు బ్రెయిన్ క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. లక్ష్మి కూడా భాస్కర్‌తో పాటు చనిపోతుంది.

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు

పాటలు వేటూరి సుందరరామమూర్తి రాయగా చక్రవర్తి బాణీలు కట్టాడు. కోనేరు ఆడియో కంపెనీ సంగీతాన్ని విడుదల చేసింది.[3]

ఎస్. పాట గాయనీ గాయకులు నిడివి
1 "మౌనామా కోపమా" ఎస్పీ బాలు 3:48
2 "ముంజేతికి" ఎస్.జానకి 2:10
3 "గాడపు సరి గారపు" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:21
4 "పువ్వులలో" ఎస్పీ బాలు, ఎస్.జానకి 2:55

మూలాలు

మార్చు
  1. "Punyasthree (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-15. Retrieved 2020-08-05.
  2. "Punyasthree (Review)". The Cine Bay. Archived from the original on 2018-10-15. Retrieved 2020-08-05.
  3. "Punyasthree (Songs)". Cineradham. Archived from the original on 2017-08-18. Retrieved 2020-08-05.