పుత్రకామేష్టి

(పుత్రకామేష్టి యాగం నుండి దారిమార్పు చెందింది)

పుత్రకామేష్టి లేదా పుత్రకామేష్టి యాగం రామాయణంలో దశరథుడు జరిపిస్తాడు. దీని మూలంగా ఆ పుణ్యదంపతులకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు జన్మిస్తారు.

పుత్రకామేష్టి యజ్ఞాన్ని దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షి నిర్వహిస్తుండగా, ఆఖరి రోజున యజ్ఞ పురుషుడు ప్రత్యక్ష్యమై పాయసపు పాత్రను దశరథునికి ఇస్తాడు.

పుత్రకామేష్టి యజ్ఞం సనాతన ధర్మం లో కొడుకు పుట్టడానికి చేసే ఒక ప్రత్యేక యజ్ఞము. ఇది ఒక కామ్య-కర్మ.

రామాయణము లో, వశిష్ఠ మహర్షి చెప్పగా దశరథ మహారాజు ఋష్యశృంగ ముని ఆర్ధ్వర్యంలో ఈ యాగాన్ని చేసారు.ఋష్యశృంగ ముని యజుర్ వేదంలో శ్రేష్ఠుడు. అందులోనే ఈ యజ్ఞానికి సంబంధించిన క్రతువు ఉంది. యజ్ఞం  ముగిసిన తరువాత  అగ్ని దేవుడు ప్రత్యక్షమై  ఒక పాయసపు పాత్రను  దశరథ మహారాజుకి ఇస్తాడు.  ఆ పాత్రలో ఉన్నపాయసాన్ని తన  ముగ్గురి భార్యలకు పంచగా వాళ్ళకి శ్రీరాముడు, లక్ష్మణుడు,  భరతుడు,  శతృఘ్నుడు జన్మించారు.

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు

విశ్వామిత్రుడు తండ్రి కుశనాభుడు పుత్రకామేష్టి యాగ ఫలితంగా జన్మిస్తాడు.