ఆర్‌ఎల్‌వి-టిడి

(పునర్వినియోగ వాహక నౌక నుండి దారిమార్పు చెందింది)

ఆర్ఎల్‌వి-టిడి అంటే పునర్వినియోగ వాహక నౌక-సాంకేతికత ప్రదర్శకం ("Reusable Launch Vehicle-Technology Demonstration Program, RLV-TD") అని అర్ధం. ఇది ఒక ప్రయోగాత్మక పరీక్ష.

ఆర్‌ఎల్‌వి-టిడి

HS9 బూస్టరుకు అమర్చిన ఆర్‌ఎల్‌వి-టిడి (స్థాయి ప్రతిరూపము)
విధి సాంకేతిక ప్రదర్శన వాహనం
తయారీదారు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ
దేశము  భారతదేశం
పరిమాణము
ఎత్తు ~16 మీ[1]
వ్యాసము 1 మీ [1]
ద్రవ్యరాశి 12 టన్నులు [2]
దశలు 2[1]
ప్రయోగ చరిత్ర
స్థితి ప్రోటోటైపుల పరీక్ష జరుగుతోంది[3]
ప్రయోగ స్థలాలు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
తొలి ప్రయోగం 2016 మే 23, 0400 UTC[4][5][6][7]

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాను తయారు చేసిన ఉపగ్రహాలను, లేదా ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి వాహక నౌకలను ఉపయోగిస్తోంది. ఈ నౌకలు పునర్వినియోగానికి ఉపయోగపడేవి కావు. అనగా ఒకసారి ప్రయోగించిన అదే వాహక నౌకను తిరిగి ఉపయోగించలేరు. తదుపరి ప్రయోగం కోసం నౌకను పూర్తిగా కొత్తగా తయారు చెయ్యాలి. వాహక నౌకను మళ్ళీ మళ్ళీ ప్రయోగించే విధంగా రూపొందిస్తే, ఉపగ్రహ ప్రయోగ ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు.

ఈ ఉద్దేశంతో ఇస్రో పునర్వినియోగ వాహక నౌక రూపకల్పన, తయారీ, ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇస్రో రెండు దశల వాహక నౌక ప్రోటోటైప్‌ను రూపొందించి, 2016 మే 23 న ప్రయోగించింది. ఈ ప్రయోగం ద్వారా తలపెట్టిన పరీక్ష విజయవంతమైంది.

పునర్వినియోగ వాహక నౌక

మార్చు

ప్రయోగం మొదటదశలో రెక్కలు కలిగిన పునర్వినియోగ వాహనాన్ని ఒక రాకెట్‌కు అమర్చి అంతరిక్షంలోకి పంపిస్తారు. ఈ పునర్వినియోగ వాహకనౌక యొక్క ముందు భాగంలో పేలోడ్ ఉంటుంది. ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన తరువాత నౌక భూమికి తిరిగి వస్తుంది.

అభివృద్ధి

మార్చు

స్క్రామ్‌జెట్ ఇంజను అభివృద్ధి, పరీక్ష

మార్చు

పునర్వినియోగ వాహన ప్రయోగంలో స్క్రామ్‌జెట్ ఇంజనుది ప్రధాన పాత్ర. సూపర్‌సోనిక్ వేగాల వద్ద పనిచేసే ఈ ఇంజను అభివృద్ధి, పరీక్షల దశలో ఉంది. 2006 లో వరుస భూస్థాయి ప్రయోగాలలో స్థిరమైన సూపర్ సోనిక్ దహనాన్ని 7 సెకన్ల పాటు మండించి విజయవంతంగా పరీక్షించారు.

2010 మార్చి 3 న ఇస్రో, తమ కొత్త సౌండింగు రాకెట్‌ను ఫ్లైట్ టెస్ట్ చేసింది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెహికిల్ (ATV-D01) అనే ఈ సౌండింగు రాకెట్ యొక్క వ్యాసం 0.56 మీటర్లు, పొడవు ~10 మీటర్లు. దీనికి ఒక డమ్మ్మీ స్క్రామ్‌జెట్ ఇంజన్ను తగిలించి ప్రయోగించారు.[8]

2016 ఆగస్టు 28 న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెహికిల్ యొక్క రెండవ ప్రయోగం విజయవంతంగా జరిగింది. ఈ ప్రయోగంలో స్క్రామ్‌జెట్ ఇంజన్ను 5 సెకండ్ల పాటు పనిచేయించారు.

ఆర్‌ఎల్‌వి-టిడి అభివృద్ధి

మార్చు

Reusable Launch Vehicle-Technology Demonstrator (RLV-TD) ప్రణాళిక ప్రభుత్వ అనుమతి పొందిందని, త్వరలో దాన్ని రూపకల్పన చేసి ప్రయోగింపబోతున్నట్లు 2012 జనవరిలో ఇస్రో ప్రకటించింది. RLV-TD యొక్క ప్రోటోటైప్‌ రూపకల్పన ఇండియాలోని నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీలో తయారు చేసారు. RLV-TD వాహనం తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాదు లో ఉన్న ప్రైవేటు సంస్థ సిఐఎం టెక్నాలజీస్ సంస్థలో నిర్మింపబడింది. ఈ వాహనం భూ వాతావరణంలో ప్రవేశించేటపుడు జనించే ఉష్ణం నుండి రక్షణకై ఉపరితలం మీద ఉష్ణ నిరోధక ఫలకాలను విక్రం సారాభాయి స్పేస్ సెంటరు ఇంజనీర్లు, తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ లో అమర్చారు. ప్రోటోటైప్ వాహనం బరువు 1.5 టన్నులు. ఇది 70 కి.మీ ఎత్తు వరకు ఎగుర గలుగుతుంది. ఈ వాహక నౌకను ఘన ఇంధనం కల్గిన (HS9 బూస్టరు),1 మీటరు వ్యాసం ఉన్న రాకెట్ ద్వారా భూ వాతావరణం ఆవల ప్రక్షేపిస్తారు. ఇక్కడ ఈ వాహన నౌక రాకెట్ నుండి విడిపోయి తిరిగి హైపర్ సోనిక్ రెజీమ్ ద్వారా భూ వాతావరణంలో ప్రవేశించి, బంగాళాఖాతం లో దిగుతుంది. ఈ ప్రోటోటైప్ RLV-TD వాహనం దిగుటకు ప్రస్తుతం భూమిపై 5 కి.మీ.పొడవైన రన్‌వే లేనందున, దీనిని బంగాళాఖాతంలో దిగే ఏర్పాట్లు చేసారు.

6.5 మీటర్ల పొడవు,1.75 టన్నుల బరువు ఉన్న మొదటి పరీక్షాత్మక వాహనం ఆర్‌ఎల్‌వి-టిడి నిర్మాణానికి 95 కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. తిరువనంతపురంలోని విక్రం సారాభాయి అంతరిక్ష కేంద్రంలోని 600 మంది శాస్త్రవేత్తలు 5 సంవత్సరాలు నిరంతరం కృషిచేసి ఈ వాహనాన్ని తయారుచేసారు. మరో రెండు ఇలాంటి ప్రొటోటైపు వాహనాలను రాబోవు కాలంలో ప్రయోగించేందుకు ఇస్రో సంసిద్దమైతున్నది. ఈ వాహనాన్ని 9 టన్నుల బరువు ఉన్న రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు. పూర్తిగా రూపుదిద్దుకొన్నాక ఆర్‌ఎల్‌వి పొడవు 40 మీటర్ల వరకు ఉంటుంది.

ఆర్‌ఎల్‌వి-టిడి పరీక్షా ప్రయోగాలు

మార్చు

తలపెట్టిన పరీక్షా ప్రయోగాలు

మార్చు

మొత్తం నాలుగు ఆర్ఎల్‌వి-టిడి పరీక్షా ప్రయోగాలను ఇస్రో తలపెట్టింది.

ఆర్‌ఎల్‌వి-టిడి మొదటి పరీక్షా ప్రయోగం

మార్చు

ఇస్రో తలపెట్టిన నాలుగు ఆర్ఎల్‌వి-టిడి పరీక్షా ప్రయోగాలలో ఇది మొదటిది దీన్ని హైపర్‌సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ (HEX) అని అంటారు. వాహనం భూవాతావరణాంలోకి ప్రవేశించి, హైపర్‌సోనిక్ వేగంతో ప్రయాణించేటపుడు దానికి ఎదురయ్యే పరిస్థితులలో వాహనం పనితీరును పరిశీలించడం ఈ పరీక్ష లక్ష్యం. 6.5 మీటర్లపొడవు, 1.75 టన్నుల బరువున్న ఆర్‌ఎల్‌వి-టిడి పరీక్షాత్మక ప్రయోగ వాహనాన్ని ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుండి, 2016 మే 23 న ఉదయం 7 గంటలకు ప్రయోగించారు. ఘన ఇంధనం కల్గిన బూస్టరు రాకెట్ పైభాగాన ఈ ఆర్‌ఎల్‌వి-టిడి ని అమర్చారు. ముందుగా అనుకున్న విధంగా 50 కిమీ ఎత్తుకు చేరుకున్న తరువాత రాకెట్, ఆర్‌ఎల్‌విని ప్రక్షేపించింది. ఆ తరువాత మరో 20 కి.మీ ఎత్తుకు వెళ్ళిన తరువాత (మొత్తం 70 కి.మీఎత్తు), ఆర్‌ఎల్‌వి భూమి వైపు తన ప్రయాణాన్ని కొనసాగించింది. తిరిగి భూవాతావరణంలో ప్రవేశించి, శ్రీహరికోటకు 500 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో చెన్నై-అండమాన్ మధ్యలో దిగింది.[9] విక్రం సారాభాయి అంతరిక్ష కేంద్రం, తిరువనంతపురం మాజీ డైరక్టరు ఎం.సి.ధాతన్ చెప్పిన ప్రకారం.ఈ ప్రయోగం విజయవంతమైంది. స్పేస్ షటిల్ సురక్షితంగా సముద్రంలో దిగి, తేలియాడింది.[10] ఈ ప్రయోగం చివర్లో సముద్రంలో దిగిన వాహనాన్ని స్వాధీనపరచుకొనే ఎర్పాట్లు చెయ్యలేదు[11]

పూర్తి స్వదేశీ విజ్ఞానంతో, సాంకేతిక నైపుణ్యంతో తయారు చేసిన ఆర్‌ఎల్‌విని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఇంకా 10-15 సంవత్సరాలు పట్టవచ్చు.[12]

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి విడియో లింకులు

మార్చు

మూలాలు వనరులు

మార్చు
  1. 1.0 1.1 1.2 ""Modeling &Control of Launch Vehicles"" (PDF). www.sc.iitb.ac.in. Archived from the original (PDF) on 2015-12-24. Retrieved 2016-05-19.
  2. "Tuesday, December 22, Isro's small steps towards developing its own reusable rocket [Reusable Launch Vehicle (RLV)] program". LIVE MINT, IN. 2015. Retrieved 2015-12-23.
  3. ""Navigation satellite system by March"".
  4. ""ISRO's RLV-TD Mission Launch Likely in May"". Archived from the original on 2016-05-14. Retrieved 2016-05-19.
  5. ""ISRO Aims To Conquer Skies With Its Own Reusable Vehicle"". Archived from the original on 2016-05-14. Retrieved 2016-05-19.
  6. "Isro to test launch India's first spaceplane on May 23". Archived from the original on 2016-05-13. Retrieved 2016-05-19.
  7. "Isro to test launch India's first spaceplane on May 23".
  8. "What is the current status of ISRO's RLV?". quora.com. Retrieved 2016-05-20.
  9. "RLV-TD, India's first reusable space shuttle, launched from Sriharikota". indianexpress.com. Archived from the original on 2016-05-23. Retrieved 2016-05-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  10. "India successfully launches reusable launch vehicle RLV-TD". www.thehindu.com. Archived from the original on 2016-05-23. Retrieved 2016-05-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  11. "Swadeshi Space Shuttle Tests, ISRO's 'Mission Accomplished': 10 Facts". ndtv.com. Archived from the original on 2016-05-23. Retrieved 2016-05-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  12. "India launches 'Swadeshi' space shuttle from Sriharikota". deccanchronicle.com. Archived from the original on 2016-05-23. Retrieved 2016-05-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)