పునాదిరాళ్ళు

1979 సినిమా

పునాదిరాళ్ళు 1979లో గూడపాటి రాజ్‌కుమార్‌ దర్శకత్వంఓ విడుదలైన తెలుగు చలనచిత్రం. 5 నంది అవార్డులు అందుకున్న ఈ చిత్రం చిరంజీవి తొలిచిత్రం.

పునాదిరాళ్ళు
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం గూడపాటి రాజ్‌కుమార్‌
తారాగణం రోజారమణి,
నరసింహరాజు
సంగీతం ప్రేమ్‌జీ
నిర్మాణ సంస్థ ధర్మవిజయ పిక్చర్స్
భాష తెలుగు

ఒక పల్లెటూర్లో ఆ వూరి సర్పంచి రఘురామయ్య, కరణం, పటేలు, వెంకటయ్య అనే షావుకారు ఈ దుష్టచతుష్టయం గ్రామ ప్రజలను పీల్చుకుని తింటుంటారు. వారు చేసే అత్యాచారాలకు కొదువలేదు. శాంతి అనే యువతి వారి పశుత్వానికి బలవుతుంది. స్కూలు మాస్టరైన ఆ యువతి తండ్రి కూడా వారి అఘాయిత్యానికి గురవుతాడు. శాంతి పిచ్చిదానిలా నటిస్తూ, ఆ వూర్లోనే తిరుగుతూ వుంటుంది. పట్టణంలో చదువుకుని ఇంటికి వచ్చిన రఘురామయ్య కొడుకు రవికి కొద్ది రోజుల్లోనే వూళ్ళో జరిగే భాగోతం అంతా అర్థమౌతుంది. తన మిత్రులందరినీ తోడు తెచ్చుకుని నర్సుగా ఆ వూరికి వచ్చిన రాధ సహాయంతో దుర్మార్గపు ముఠాపై తిరగబడతాడు[1].

నటీనటులు

మార్చు

పాటల జాబితా

మార్చు
  • భారతదేశపు భావిపౌరులం ,
  • చిరు చిరు నవ్వుల
  • యాతవేసి పోసినా ఏరు

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. పి.ఎస్. (25 June 1979). "చిత్ర సమీక్ష - పునాదిరాళ్ళు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 84. Retrieved 25 December 2017.[permanent dead link]