రోజారమణి తెలుగు సినిమా నటి. భక్త ప్రహ్లాదలో బేబి రోజారమణిగా చాలా మంచి పేరు సంపాదించింది. ఆ సినిమాలో నటనకుగాను జాతీయ ఉత్తమ బాలనటిగా పురస్కారం పొందింది. 1970, 1980 వ దశకాల్లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినిమాలలో కథానాయికగా నటించింది. సుమారు 400 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది. ఆమె బ్లూ క్రాస్ లో సభ్యురాలిగా చేరి సమాజ సేవ చేస్తోంది. మాస్టర్ తరుణ్ అనే పేరుతో బాలనటుడిగా నటించి తరువాత యువ కథానాయకుడిగా స్థిరపడిన తరుణ్ రోజారమణి కొడుకు.[2]

రోజా రమణి
Roja Ramani
జననం (1959-09-16) 1959 సెప్టెంబరు 16 (వయసు 64)[1]
ఇతర పేర్లుచెంబరుతి శోభన
వృత్తినటి, డబ్బింగ్ కళాకారిణి
జీవిత భాగస్వామిచక్రపాణి
పిల్లలుతరుణ్ కుమార్ , అమూల్య

జీవిత విశేషాలు మార్చు

రోజారమణి మద్రాసులో జన్మించింది. ఆమె తండ్రి ఒక విలేఖరి. ఆమెకు ఇద్దరు సోదరులున్నారు.[3] ఆమె ఒడియా నటుడైన చక్రపాణిని వివాహం చేసుకున్నది. ఆయన ప్రస్తుతం ఈటీవీ ఒడియా చానల్‌లో దర్శకుడు, నిర్మాత. వారి కుమారుడు ప్రముఖ తెలుగు నటుడు తరుణ్. కూతురు అమూల్య సైకాలజీ గ్రాడ్యుయేట్.

 
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో సత్కారం అందుకున్న రోజా రమణి

కెరీర్ మార్చు

ఆమె 5 సంవత్సరాల వయసులో భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాదుడిగా నటించింది. ఏవీయం నిర్మించిన ఈ సినిమా మొట్టమొదటి పూర్తి నిడివి ఈస్ట్ మన్ కలర్ సినిమా. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. బాలనటిగా సుమారు 70 సినిమాల్లో నటించిన తర్వాత 13 ఏళ్ళ వయసులోనే చంబరతి అనే మలయాళ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇదే సినిమా తెలుగులో కూడా రోజా రమణి కథానాయికగా కన్నె వయసు అనే సినిమా గా, తమిళంలో పరువ కాలంగా పునర్నిర్మించారు.

తరువాత అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఒడియా భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 400 సినిమాల్లో సుహాసిని, మీనా, రాధిక, రమ్యకృష్ణ, రోజా, విజయశాంతి, శిల్పాశెట్టి, దివ్యభారతి, నగ్మా, కుష్బూ లాంటి నటీమణులకు గాత్రం అందించింది.

నటించిన సినిమాలు మార్చు

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. NTV Telugu (16 September 2021). "మ‌ర‌పురాని రోజార‌మ‌ణి". Retrieved 12 April 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. EENADU (22 July 2021). "ఎస్వీఆర్‌ ఇలా అయిపోయారేంటి అనుకున్నా! - alithosaradaga". Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
  3. http://www.rediff.com/movies/2000/dec/07ramani.htm
"https://te.wikipedia.org/w/index.php?title=రోజారమణి&oldid=3940179" నుండి వెలికితీశారు