పురుగుమందు
పురుగుమందులు : వ్యవసాయదారులు సస్యరక్షణలో భాగంగా పంటలకు క్రిమికీటకాలు సోకి నష్టాన్ని కలిగించకుండా కొన్ని మందులు వాడుతారు. వాటిని పురుగుమందులు (Insecticides) అంటారు.[1]
పురుగుమందులు కొనేటపుడు, ఉపయోగించేటపుడు రైతులు చేయవలసినవి, చేయకూడనివి
మార్చు- కొనుగోలు చేసేటపుడు చేయవలసినవి
- సరైన లైసెన్సు ఉన్న అధీకృత డీలర్ వద్దనుంచి మాత్రమే పురుగుమందులు/జైవిక పురుగుమందులు కొనుగోలు చేయాలి.
- ఒక నిర్ణీత ప్రదేశంలో ఒక్కసారి సరిపడ పురుగుమందు ఎంత కావాలో అంతే మోతాదులో కొనుగోలు చేసుకోవాలి.
- పురుగుమందుల డబ్బాలు/సంచులపై అనుమతుల సమాచారం ముద్రించిన లేబుల్ ను గమనించాలి.
- లేబుల్ మీద బ్యాచ్ నంబరు, నమోదు నంబరు, తయారీ తేదీ, కాల పరిమితి వివరాలను గమనించాలి.
- డబ్బాలలో చక్కగా ప్యాక్ చేసిన పురుగుమందులనే తీసుకోవాలి.
- కొనుగోలు చేసేటపుడు చేయకూడనివి
- లైసెన్సు లేని వ్యక్తులనుంచి లేదా అనధీక్రుత డీలర్ల నుంచి పురుగుమందులు కొనకూడదు.
- మొత్తం పంటకాలానికి సరిపోయేపురుగుమందును ఒకేసారి కొనకూడదు.
- అనుమతితో కూడిన లేబుల్ లేని పురుగుమందును కొనకూడదు.
- కాలం చెల్లిన పురుగుమందులను ఎప్పుడూ కొనకూడదు.
- డబ్బాలు పగిలి కారుతున్న, మూత తీసిఉన్నా, కొద్దిగా వాడి ఉన్నా ఆ పురుగుమందును వాడకూడదు.
- నిల్వ చేసే సమయంలో చేయవలసినవి
- పురుగుమందులను ఇంటి ఆవరణకు దూరంగా ఉంచాలి
- పురుగుమందులను కొన్నప్పడు ఉన్న డబ్బాల్లోనే భద్రపరచండి.
- పురుగుమందులను/కలుపు సంహారకాలను వేర్వేరుగా భద్రపరచాలి.
- పురుగుమందులను భద్రపరిచేచోట హెచ్చరికలు పెట్టండి
- పిల్లలు, కోళ్ళు, పశువులకు పురుగుమందులను అందుబాటులో లేకుండా చూడాలి.
- నిల్వ ఉంచే స్థలము ఎండ, వానలకు గురి కాకుండా కాపాడుకోవాలి
- నిల్వ చేసే సమయంలో చేయకూడనివి
- పురుగుమందులను ఇంటిలో ఎప్పుడూ ఉంచకూడదు.
- పురుగుమందులను కొన్నప్పటి డబ్బాలనుంచి వేరే డబ్బాల్లోకి మందును మార్చకూడదు.
- పురుగుమందులను, కలుపు సంహారకాలతో కలిపి భద్రపరచకూడదు.
- పురుగుమందులు నిల్వ చేసిన చోటుకు పిల్లలను వెళ్లనీకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- పురుగుమందులకు ఎండ, వాననీరు తగలకుండా చూసుకోవాలి.
- ఉపయోగించే సమయంలో చేయవలసినవి;
- రవాణా సమయంలో పురుగుమందులను విడిగా ఉంచవలెను
- పురుగులమందులు వాడే ప్రదేశానికి జాగ్రత్తగా తీసుకెళ్లడం అవసరం.
- ఉపయోగించే సమయంలో చేయకూడనివి
- పురుగుమందులను ఆహారం/పశువుల మేత/ఇతరఆహార పదార్ధాలతోకలిపి రవాణా చేయకూడదు
- పురుగుమందులను తల/భుజాలు/వీపు మీద ఎప్పుడూ మోసుకెళ్ళకూడదు
- ద్రావకాలను తయారుచేసే సమయంలో చేయవలసినవి
- ఎల్లప్పుడూ మంచి నీటినే వాడాలి
- మొత్తం శరీరాన్ని కప్పే విధంగా చేతి తొడుగులు, ముఖానికి తొడుగు, టోపీ, ఏప్రాన్, ప్యాంటు మొదలైనవాటిని విధిగా వాడాలి
- ద్రావకం చింది ముక్కు, కళ్ళు, చెవులు, చేతులపైన పడకుండా కాపాడుకోవాలి
- పురుగుమందుల డబ్బా మీది సూచనలను శ్రధ్ధగా చదవాలి.
- ద్రావకాన్ని అవసరమైనంతవరకు తయారచేసుకుని 24 గం || లోపు వాడాలి.
- గుళికల పురుగుమందును కూడా అలాగే వాడాలి
- పురుగుమందు ద్రావకాలను ట్యాంకులో పోసేటపుడు బయటకు చిమ్మకుండా జాగ్రత్త పడాలి
- సూచించిన పరిమాణంలోనే పురుగుమందులు వాడాలి
- ఆరోగ్యానికి భంగం కలిగించే ఏ పనులూ చేయకూడదు.
- ద్రావకాలను తయారుచేసే సమయంలో చేయకూడనివి
- బురదనీటినిగానీ, మురికినీటినిగానీ వాడకూడదు
- శరీరానికి రక్షణ తొడుగులను ధరించకుండా పిచికారి ద్రావకాలను తయారుచేయ కూడదు, స్ప్రే చేయకూడదు.
- పురుగుమందులు/ద్రావకాలు మీ శరీరభాగాలపైన పడకుండా జాగ్రత్త పడాలి.
- లేబుల్ మీద...వాడకం సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన ఇచ్చిన సమాచారాన్ని చదవడం మానకూడదు
- మిగిలిపోయిన ద్రావకాన్ని తయారుచేసిన 24గంటల తర్వాత ఎప్పుడూ వాడకూడదు
- గుళికలను నీటితో కలపకూడదు
- పురుగుమందు చల్లే ట్యాంకు వాసన చూడకూడదు
- పరిమితిని మించిన పరిమాణం వాడి మొక్క ఆరోగ్యం, పర్యావరణానికి హాని చేయకూడదు
- పురుగుమందులు వాడు సమయంలో తినడం, తాగడం, పొగ తాగడం, లాంటి పనులు చేయకూడదు
- పురుగు మందుల వాడకానికి ఉపయోగించు పరికరాల ఎంపిక సమయంలో చేయవలసినవి
- మంచి పరికరాలనే ఎంచుకోండి.
- సరైన పరిమాణమున్న నాజిల్ ఎంచుకోవాలి.
- పురుగుమందులకు, క్రిమసంహారకాలకు వేర్వేరు పిచికారులను వాడాలి
- పురుగు మందుల వాడకానికి ఉపయోగించు పరికరాల ఎంపిక సమయంలో చేయకూడనివి
- చిల్లులు, లోపాలు ఉన్న పరికరాలను వాడకూడదు
- సిఫార్సు చేయబడని/లోపభూయిష్టమైన నాజిల్ ఎంచుకోకూడదు. మూసుకుపోయిన నాజిల్ ను నోటితో ఊదడంగానీ, శుభ్రపరచడంగానీ చేయకూడదు
- పురుగుమందులకు, క్రిమసంహారకాలకు ఒకే పిచికారి వాడకూడదు
- ద్రావకాల పిచికారి సమయంలో చేయవలసినవి
- సూచించబడిన పరిమాణాన్ని, నీటిని మాత్రమే వాడాలి
- చల్లగా, ప్రశాంతంగా ఉన్నరోజునే పురుగుమందును ఉపయోగించాలి
- సాధారణంగా పొడిగా ఉన్న రోజుననే పురుగుమందు వాడవలెను
- ప్రతి పురుగుమందు ఉపయోగానికి వేర్వేరు పిచికారిలను వాడవలెను
- గాలి వీచే దిశలోనే పురుగుమందు పిచికారి చేయవలెను
- మందు వాడకం పూర్తయిన తర్వాత పిచికారిలను, బాల్చీలను డిటర్జెంట్/సోప్ లతో మంచినీటితో కడగవలెను
- పిచికారి పూర్తయిన వెంటనే పొలంలోకి పశువులనుగానీ, కూలీలను గానీ అనుమతించకూడదు
- ద్రావకాల పిచికారి సమయంలో చేయకూడనివి
- సూచించినదానికంటే ఎక్కువ పరిమాణాన్ని, ఎక్కువ గాఢతతో కూడిన ద్రావకాలను వాడకూడదు
- ఎండ బాగా కాస్తున్నరోజునగానీ, బాగా గాలులు వీస్తున్న రోజునగానీ ద్రావకము పిచికారి చేయకూడదు
- వర్షాలు రావడానికి ముందుగానీ, వర్షాలు కురిసిన వెంటనేగానీ వాడకూడదు
- పాలలా చిక్కగా ఉండే ద్రావకాలను బ్యాటరీతో నడిచే యూఎల్వీ పిచికారిని ఉపయోగించకూడదు
- గాలి వీచే దిశకు వ్యతిరేకంగా పిచికారి చేయకూడదు
- పురుగుమందులు కలపడానికి ఉపయోగించిన డబ్బాలను, బాల్చీలను ఎంత శుభ్రంగా కడిగినాగానీ ఇంట్లో అవసరాల కోసం వాడకూడదు
- మందులు చల్లిన వెంటనే రక్షణ దుస్తులు ధరించకుండా పొలంలోకి వెళ్ళకూడదు
- పిచికారి పూర్తయిన తర్వాత చేయవలసినవి
- మిగిలిపోయిన ద్రావకాలను బీడు భూములు వంటి సురక్షిత ప్రదేశంలో పారబోయవలెను
- వాడేసిన పురుగుమందుల డబ్బాలను ముక్కలుగా చేసి ఊరికి దూరంగా భూమిలో పాతేయండి.
- తినడానికి/పొగతాగడానికి ముందు చేతులను, ముఖాన్ని శుభ్రమైన నీరు, సోపుతో కడుక్కోవాలి
- విషప్రభావమేమైన కనబడితే ప్రథమ చికిత్స చేసి రోగిని వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళండి. వాడేసిన పురుగుమందు డబ్బా కూడా వైద్యునికి చూపించాలి
- పిచికారి పూర్తయిన తర్వాత చేయకూడనివి
- మిగిలిపోయిన ద్రావకాలను మురుగు కాలువలలో, చెరువుల్లోగానీ, నీటి కాలవల్లోగానీ పోయకూడదు
- ఉపయోగించబడిన పురుగుమందు డబ్బాలను తిరిగి వాడరాదు
- బట్టలు ఉతుక్కోకుండా, స్నానం చేయకుండా తినడంగానీ, పొగతాగడం గానీ చేయకూడదు
- విషప్రభావమేమైనా కనబడితే వైద్యుడిదగ్గరకు తీసుకెళ్ళటం మానకండి.అశ్రద్ధ, నిర్లక్ష్యం వలన ప్రాణం పోయే అవకాశముంది.