పుష్పగిరి తిమ్మన
పుష్పగిరి తిమ్మన నెల్లూరు జిల్లాలోని మాడేగుంట అను గ్రామమునకు అధ్యక్షుడు. ఇతడు సామాన్య బ్రాహ్మణ కుటుంబమున పుట్టినాడు. రాజుగాడు, భూస్వామిగాడు, ధనికుడు కాడు, అసామాన్య కవిత్వధార కలవాడు, ఉదార హృదయుడు, చక్కని కవిత్వమును చెప్పి సమకాలికులయందు గణనకెక్కెను; భర్తృహరి శతకత్రయమును ఆంధ్రీకరించెను. సమిరకుమార విజయము అను కావ్యమును రచించెను. తిమ్మన తాను కవిత్వము చెప్పుటయే కాక కావ్యరచనాకుతూహలులైన కవులకు తోడ్పడి వారిచే గ్రంథములను రచింపించెను. కంకంటి కవుల కీతడు పట్టుకొమ్మ, పాపరాజవిరచితోత్తర రామాయణ విష్ణుమాయావిలాస నాటకములందే కాక నృసింహవికృత విష్ణుమాయావిలాసనాటకము నందును తిమ్మకవిలేఖిని పాల్గొనినది. తేకుమళ్ళ రంగసాయి తిమ్మన సహాయము పొందియే భాగవతము లోని 12 స్కంధములను ద్విపదగా రచించెను. ధరణిదేవుల రామమంత్రియు ఇతని తోడ్పాటును బడసియే దశావతార చరితను రచించెను. ఇతడు 17వ శతాబ్దము నాటి తెలుగు సారస్వతము అభివృద్ధికి తోడ్పడిన వారిలో ప్రముఖుడు అని చెప్పుదురు.
తిమ్మన ఉత్తర రామాయణ కర్త కంకంటి పాపరాజు మిత్రుడు. పాపరాజు సా.శ. 1790 ప్రాంతముల నుండిన వాడని చరిత్రకారుల నిశ్చయము. కనుక నీ తిమ్మకవియు పదునెన్మిదవ శతాబ్దాంతము వాడె యగును. ఈ తిమ్మకవి హనుమందుని జనన గాథ యే కాక నామహనీయుని గూర్చి లోకమున వ్యాపించి యున్న యితి వృత్తముల నన్నింటిని క్రోడీకరించి సమీర కుమార విజయము మను పేర నొక కావ్యము రచించియున్నాడు. అందాదిని తన్నుద్దేశించి
“ | శ్రీ హనూమత్పాద సేవా గతాధ్యాత్మ తత్త్వ కవిత్వ మహత్త్వ విదుఁ డ, నాశ్వలాయన సూత్రహారి విశ్వామిత్ర గోత్రాబ్ది చంద్రుఁ డఁ గుశలమతిని అప పుష్పగిరి యప్పనార్యున కౌబళాంబకును సుపుత్త్రుండ బ్రహ్మ వేత్త యైన వేంకట కృష్ణ యాగ్రణీకిని వేంకటాఖ్యకవీంద్రున కవరజుండ శ్రీ హనూమత్పాద సేవా గతాధ్యాత్మ తత్త్వ కవిత్వ మహత్త్వ విదుఁ డ, సరస గుణయుతుండ వరకవిఁ విమ్మనా, హ్వయుఁడ నేను జనన మంది మనుట కెల్ల ఫలము కల్గఁ గృతి యొక్కటి రచింప, నూహ సేయుచున్న నొక్కనాఁ డు |
” |
అని పలికి యున్నాడు. ఇతడు భర్తృహరి శతకములలో నీతి శతకమొకటి మాత్రమే యాంధ్రీకరించినట్లు తేలుచున్నది. ఈ కవి సంస్కృతాంధ్రములలో సమాన పండిత్యము కలవాడైనను పాపరాజు కంటే నితని కవిత్వమున రసోదయము తక్కువ. లక్ష్మణ కవి పద్యముల కన్నను కొంత లొచ్చుగనె యుండును. ఈయని నివాస స్థలము నెల్లూరి మండలమని యా మండల చరిత్రమును బట్టి తెలియుచున్నది.
ఉదాహరణ పద్యములు
మార్చు“ | ఇసుకఁ బ్రయత్నత న్బిడిచి హెచ్చుగఁ దైలము గ్రాచవచ్చుఁ బె ల్లెనఁ గెడుడప్పి స్రుక్కి మృగతృష్ణ జలంబులు గ్రోలవచ్చు నల్ దెసలుఁ జరించి యొక్కపుడు దే దొరకున్ శశ పున్విషాణము న్బొసఁ గదు దుర్వివేకి యగు మూర్ఖుని చిత్తము ద్రిప్ప నేరికిన్ |
” |
“ | అల కమలాసనుఁడు మది నల్క వహించినేని యంచపై లలిత సరోజినీ వన విలాస నివాసము మాన్చుఁ గాక; దా బతియుఁ డ నంచు దానిదగు పాలును నీరును నేర్పరించునే ర్పులఁ గల సుప్రసిద్ధయసమున్హరియుంచుటకు న్సమర్థుఁ డే? |
” |