పెట్రోలియం ఈథర్(42–62℃)

(పెట్రోలియం ఈథరు నుండి దారిమార్పు చెందింది)


పెట్రోలియం ఈథర్ అనునది ముడి పెట్రోలియాన్ని అంశిభూతస్వేదన క్రియకు(fractional distillation)కు లోనుకావించి ఉత్పత్తి చేయుదురు. పెట్రోలియం ఈథర్ సంతృప్త హైడ్రోకార్బన్ లమిశ్రమం. అనగా ఇందులో అలిపాటిక్ సమూహానికి చెందిన హైడ్రోకార్బనులు ఉన్నాయి. పెట్రోలియం ఈథర్ లో C₅, C₆ హైడ్రోకార్బన్ లు ఉండును.ఈ హైడ్రోకార్బన్ ల మరుగు/బాష్పీభవన ఉష్ణోగ్రత 35‒80 ℃ మధ్యవివిధ శ్రేణులలో ఉండును.అనగా 30-40℃, 42-60℃, 50‒70℃, 60-80℃ ఇలా వివిధ బాష్పీభవన స్థానలను కల్గి లభించును.బాష్ఫీభవన స్థానాలలో తేడా ఉన్నప్పటికిఈ ద్రావణులు C₅, C₆ హైడ్రోకార్బన్ లు కల్గి ఉన్నవీటిని పెట్రోలియం ఈథర్లు అని వ్యవహారిస్తారు. పెట్రోలియం ఈథర్ ను సాధారణంగా ప్రయోగ/పరిశోధన శాలలో ద్రావణిగా విరివిగా ఉపయోగిస్తారు. ఇక్కడ ఇథర్ అను పదాన్ని, ఈ ద్రావణం తేలికైనది, త్వరగా ఆవిరి అగు (వోలటైల్)స్వభావం కలదని తెలుపుటకై ఉపపదంగా చేర్చడమైనది.

పెట్రోలియం ఈథర్[1][2][3]
పేర్లు
ఇతర పేర్లు
Light ligroin; "Skelly B"
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [8032-32-4]
ధర్మములు
మోలార్ ద్రవ్యరాశి 82.2 g/mol
స్వరూపం Volatile, clear, colorless and non-fluorescent liquid
సాంద్రత 0.653 g/mL
ద్రవీభవన స్థానం < −73 ℃
బాష్పీభవన స్థానం 42–62 ℃
insoluble
ద్రావణీయత in Ethanol soluble
బాష్ప పీడనం 31 kPa (20 ℃)
వక్రీభవన గుణకం (nD) 1.370
స్నిగ్ధత 0.46 mPa·s (25 ℃)
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS02: Flammable GHS07: Exclamation mark GHS08: Health hazard GHS09: Environmental hazard
జి.హెచ్.ఎస్.సంకేత పదం DANGER
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H225, H304, H315, H336, H411
GHS precautionary statements P210, P243, P273, P301+310, P303+361+353, P301+330+331, P403+235
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R11 R38 మూస:R51/53 R65 R67
జ్వలన స్థానం {{{value}}}
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత
246.11 ℃
విస్ఫోటక పరిమితులు 1.4–5.9 %
Threshold Limit Value 300 ppm (1370 mg/m3) 8 h TWA (TWA)
Lethal dose or concentration (LD, LC):
3400 ppm (rat, 4 h)
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
100 ppm (400 mg/m3) 8 h TWA
REL (Recommended)
100 ppm (400 mg/m3) 10 h TWA
IDLH (Immediate danger)
1000 ppm
సంబంధిత సమ్మేళనాలు
సంబంధిత సమ్మేళనాలు
Ligroin, Petroleum benzine, Petroleum spirit, Stoddard solvent, VM&P Naphtha, White spirit
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
Infobox references

భౌతిక లక్షణాలు

మార్చు

పెట్రోలియం ఈథర్ లోని C5, C6 హైడ్రోకార్బన్ ల నిష్పత్తిని బట్టి అయా పెట్రోలియం ఈథర్ ల సాంద్రత, ద్రవీభవన స్థానం, బాష్పీ భవనస్థానం, బాష్పవత్తిడి, వంటి పదార్థ భౌతిక విలువలు మారుచుండును. దిగువన 42–62℃మధ్య బాష్పీభవన స్థానం ఉన్న పెట్రోలియం ఈథర్ గుణాలను వివరించడం జరిగింది.

భౌతిక స్థితి

మార్చు

పెట్రోలియం ఇథర్(42–62 ℃) రంగులేని,ప్రకాశవంతం కాని, పారదర్శకమైన,తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారుస్వభావం కల్గిన ద్రావణి. పెట్రోలియం ఇథర్(42–62℃) అణుభారం 82.2 గ్రాములు/మోల్

సాంద్రత

మార్చు

పెట్రోలియం ఈథర్(42–62℃)యొక్క సాంద్రత,25℃ వద్ద 0.653 గ్రాములు/సెం.మీ3.

ద్రవీభవన ఉష్ణోగ్రత

మార్చు

పెట్రోలియం ఈథర్ (42–62℃)యొక్క ద్రవీభవన స్థానం < −73℃.[4]

బాష్పీభవన ఉష్ణోగ్రత

మార్చు

పెట్రోలియం ఈథర్ (42–62 ℃)యొక్క బాష్పీభవన స్థానం 42–62℃

పెట్రోలియం ఈథర్ నీటిలో కరుగదు.ఇథనాల్/ఇథైల్ ఆల్కహాల్లో కరుగును

వక్రీభవన సూచిక

మార్చు

పెట్రోలియం ఈథర్ యొక్కవక్రీభవన సూచిక 1.370

స్నిగ్థత/స్నిగ్ధత

మార్చు

పెట్రోలియం ఈథర్ యొక్క స్నిగ్ధత 0.46 mPa•s (25 ℃వద్ద)

ఇతరలక్షణాలు

మార్చు

ప్రయోగశాలలో ఉపయోగించటకై అమ్ము తక్కువ సాంద్రత కల్గి(తేలికైన),తక్కువ ఉష్ణోగ్రతలో ఆవిరిగా మారు ద్రవ హైడ్రోకార్బనులను(ఇలాంటి వాటిని volatile liquid hydrocarbonఅందురు)కుడా పెట్రోలియం ఈథర్ అని అంటారు.పెట్రోలియం ఈథరులు అధిక ప్రమాణంలో ఆల్కేన్ సమూహానికి/గ్రూప్ కు చెందిన C₅ and C₆హైడ్రో కార్బన్ ద్రవాలను,తక్కువ మోతాదులో ఆరోమాటిక్ రసాయన ద్రావణులను కల్గి ఉండును. పెట్రోలియం ఈథర్ లోని ఆరోమాటిక్ లను తగ్గించుటకై, పెట్రోలియం ఈథర్ ను డిసల్ఫరైజింగ్, అవసరమైతే అసంతృప్త హైడ్రోకార్బన్ లను తగ్గించుటకై ఉదజనికరణము చేయుదురు.పెట్రోలియం ఈథర్ ద్రావణులను, వాటి బాష్పీ భవన ఉష్ణోగ్రత లను మరోఉపపదంగా చేర్చి అమ్మకం చేసారు. బాష్పీభవన ఉష్ణోగ్రతల స్థాయి/రేంజి 30‒50℃, 40‒60℃, 50‒70℃, 60‒80℃,గా సాధారణంగా ఉండును. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పెట్రోలియం ఈథర్ ద్రావణుల బాష్పీ భవన ఉష్ణోగ్రత స్థాయి100‒140 ℃ ఉన్నవాటిని కూడా పెట్రోలియం స్పిరిట్ కు బదులుగా పెట్రోలియం ఈథర్ ద్రావణులుగానే పరిగణిస్తారు.

ఆంశీభూత స్వేదన ప్రక్రియ ద్వారా పెట్రోలియం ఈథరులను వేరు చేయునపుడు, ఒక పెట్రోలియం ఈథరు బాష్పీభవన ఉష్ణోగ్రతకు మరో పెట్రోలియం ఈథరు బాష్పీభవన ఉష్ణోగ్రతకు వ్యత్యాసం 20℃ మించి ఉండరాదు. అంతకు మించి ఉన్నచో వీటిని రి క్రిష్టలైజేసన్ చేయునపుడు, వోలటైల్ రూపంలో అధిక ప్రమాణంలో ద్రావణాన్ని నష్ట పోయే అవకాశం ఉంది.

పెట్రోలియం ఈథరు లను ఉత్పత్తి చేయునపుడు వాటిలోని అసంతృప్తహైడ్రోకార్బనులను తొలగించుటకై మొదట రెండు,మూడు సార్లు పెట్రోలియం ఈథరు ఘన పరిమాణంలో 10% గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో బాగా కుదిపి(shaking),ఆతరువాత వరుసగా గాఢ పొటాషియం పర్మాంగనేట్ ద్రావాణాన్ని (10% సల్ఫ్యూరిక్ ఆమ్లంతో)దాన్ని రంగు మారనంత వరకు పలుదపాలుగా కలిపి షేక్ చేస్తారు.ఆతరువాత ద్రావణాన్ని బాగా నీటితో వాష్ చేస్తారు.తరువాత అనార్ద్ర/నిర్జల కాల్సియం క్లోరైడ్తో పొడి పరచి,తిరిగి స్వేదనక్రియకు లోను కావించి పెట్రోలియం ఈథరులను తయారుచేయుదురు.

భద్రత

మార్చు

పెట్రోలియం ఈథరులు తేలికగా ఉండటం వలన,త్వరగా తక్కువ ఉష్ణోగ్రతలోఆవిరిగా మారు లక్షణము, తక్కువ ఫ్లాష్‌పాయింట్ కల్గి ఉన్నందున ఈ పెట్రోలియం ఈథరులవలన అగ్నిప్రమాదం కల్గు అవకాశం అధికం. పెట్రోలియం ఇథరులు తక్కువ బాష్పీ భవన ఉష్ణోగ్రత కల్గి ఉన్నందున త్వరగా మండును. పెట్రోలియం ఇథరు వలన ఏర్పడు మంటలను ఫోమ్,కార్బన్ డయాక్సైడ్,డ్రై కెమికల్ పౌడర్, కార్బన్ టెట్రాక్లోరైడ్ రకపు అగ్నిమాపక పరికారాల వలన నివారింపవచ్చును.

అరోగ్యం పై ప్రభావం

మార్చు

పెట్రోలియం ఈథర్ ఆవిరులను పీల్చడం వలన,మరియుచర్మాని తాకడం వలన పెట్రోలియం ఈథర్ ప్రభావానికి లోనవ్వడం జరుగును. పెట్రోలియం ఈథర్ ఆవిరులను అధికంగా పీల్చడంద్వారా ప్రభావానికి లోనయినపుడు కేంద్ర నాడీవ్యవస్థ పై దాని ప్రభావం చూపించును.దాని ఫలితంగా తలనొప్పి,తలతిప్పటం,మగతగాఉండటం, సమన్వయరాహిత్యం (incoordination) వంటి లక్షణాలు కన్పించును. ఆరోమాటిక్ పదార్థాలను కలిగిన పెట్రోలియం ఈథర్ ఆవిరుల వలన ఎక్కువ విష ప్రభావం ఉంది. ఎన్-హెక్సేన్ వలనస్వతంత్ర నాడీమండలము (peripheral nerves) లోనాడీ తంత్రుల నాశనం జరుగును.చర్మాని తాకటం వలన చర్మఅలర్జీ కలుగును.

నోటిద్వారా లోపలి వెళ్ళిన మ్యూకస్ పొరల ఇరిటేసన్ జరుగును.వాంతులు రావడం,కేంద్రీయ నాది వ్యవస్థ డిప్రేసన్ కు లోనవ్వడం వంటివి జరుగును. Aspiration కారణంగా సైనోసిస్(Cyanosis), టాకీకార్డియ (tachycardia), టాకీనియా (tachypnea)లు రావోచ్చును.10 మి.లీ కన్న తక్కువ ప్రమాణంలో నోటిద్వారా లోపలి వెళ్ళినను ప్రాణంతకమైనవిష ప్రభావం చూపును. కొన్ని అరుదైన సందర్భాలలో 60 మి.లీ పరిమాణం వరకు కడుపులోకి వెళ్లినప్పటికీ ప్రాణాపాయంనుండి బయట పడిన సంఘటనలు ఉన్నాయి.

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. Dieter Stoye (2007), "Solvents", Ullmann's Encyclopedia of Industrial Chemistry (7th ed.), Wiley, p. 41
  2. N. Irving Sax, ed. (1957), "Petroleum Spirits", Dangerous Properties of Industrial Materials, Reinhold, p. 996–997
  3. Patricia J Beattie (2005), "Petroleum Ether", Encyclopedia of Toxicology, vol. 3 (2nd ed.), Elsevier, pp. 375–376
  4. "PETROLEUM ETHER". lobachemie.com. Retrieved 2016-04-08.