పెట్రో మాక్స్ 2019లో విడుదలైన తమిళ సినిమా. తెలుగులో 2017లో విడుదలైన ఆనందో బ్రహ్మ సినిమాను పెట్రో మాక్స్ పేరుతో తమిళంలో ఈగిల్స్ ఐ బ్యానర్ పై ఎ.కుమార్ నిర్మించిన ఈ సినిమాకు రోహిన్ వెంకటేశన్ దర్శకత్వం వహించాడు. తమన్నా, యోగి బాబు, కాళి వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను నటి కాజల్ అగర్వాల్ విడుదల చేసింది.[1]పెట్రో మాక్స్ సినిమా 11 అక్టోబర్ 2019న విడుదలైంది.

పెట్రోమాక్స్
దర్శకత్వంరోహిన్ వెంకటేశన్
రచనజి. ఆర్. సురేందర్ నాథ్
దీనిపై ఆధారితంఆనందో బ్రహ్మ
తారాగణంతమన్నా, యోగి బాబు, కాళి వెంకట్
ఛాయాగ్రహణండానీ రేమండ్
కూర్పులియో జాన్ పాల్
సంగీతంగిబ్రాన్
నిర్మాణ
సంస్థ
ఈగిల్స్ ఐ ప్రొడక్షన్
విడుదల తేదీ
11 అక్టోబర్ 2019
సినిమా నిడివి
130 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతమిళ్

కథ మార్చు

ఒక పెద్ద ఇంటిని అమ్మకానికి పెడితే అందులో దయ్యాలున్నాయన్న భయంతో ఎవరూ కొనడానికి ముందుకు రారు. అలాంటి స్థితిలో ఆర్థికంగా చాలా అవసరాలున్న కమీషన్ ఏజెంట్ కమిషన్ కోసం ఆశపడి ఆ ఇంట్లో మూడు నాలుగు రోజులుండి దయ్యాల్లాంటివేమీ లేవని నిరూపించాలనుకుంటాడు. తన లాగే ఆర్థిక అవసరాలున్న ఇంకో ముగ్గురిని తనకు తోడుగా ఆ ఇంట్లోకి తీసుకెళ్తాడు. మరి ఆ ఇంట్లో వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అక్కడ నిజంగానే దయ్యాలున్నాయా ఉంటే వాటిని ఈ నలుగురూ ఎలా ఎదుర్కొన్నారు. అసలు తమన్నా దెయ్యమా కాదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఈగిల్స్ ఐ
  • నిర్మాత: ఎ.కుమార్
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం:రోహిన్ వెంకటేశన్
  • సంగీతం: గిబ్రాన్
  • సినిమాటోగ్రఫీ: డానీ రేమండ్

మూలాలు మార్చు

  1. The Times of India (19 July 2019). "Here is the first look poster of Petromax - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 24 సెప్టెంబరు 2021. Retrieved 24 September 2021.
  2. The Hindu (11 October 2019). "'Petromax' movie review: A silly, outdated horror comedy" (in Indian English). Archived from the original on 21 అక్టోబరు 2019. Retrieved 24 September 2021.
  3. The News Minute (28 August 2019). "Vaibhav to play a cameo in Tamannaah's 'Petromax'" (in ఇంగ్లీష్). Archived from the original on 28 ఆగస్టు 2019. Retrieved 24 September 2021.