పెట్ల ఉమాశంకర్ గణేష్

పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో నర్సీపట్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

పెట్ల ఉమాశంకర్ గణేష్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం నర్సీపట్నం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 20 నవంబర్ 1974
కొత్తపల్లి
నర్సీపట్నం మండలం
విశాఖపట్నం జిల్లా
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి కళావతి
బంధువులు పూరీ జగన్నాధ్ (అన్నయ్య)[1]
సాయిరాం శంకర్ (తమ్ముడు)
సంతానం అవినాష్, ఆదర్శ్‌

జననం, విద్యాభాస్యం సవరించు

పెట్ల ఉమాశంకర్ గణేష్ 1974లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం మండలం, కొత్తపల్లిలో జన్మించాడు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుండి 2002లో బీఏ పూర్తి చేశాడు.[3]

రాజకీయ జీవితం సవరించు

పెట్ల ఉమాశంకర్ 1992లో టీడీపీలో చేరాడు. ఆయన 1995 నుంచి 2001 వరకు కొత్తపల్లి సర్పంచ్‌గా, 2009 నుంచి 2012 వరకు తాండవ ఆయకట్టు సంఘం చైర్మన్‌గా పనిచేసి 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఉమాశంకర్ గణేష్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు చేతిలో 2338 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2019లో టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు పై 23366 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4]

మూలాలు సవరించు

  1. Sakshi (26 May 2019). "'వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాను'". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (2019). "Narsipatnam Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ దళపతులు". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
  4. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.