పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, మరియు రచయిత. బద్రి ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2006వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన పోకిరి చిత్రం తెలుగు సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. కాని ఆ తరువాత 2009వ సంవత్సరంలో విడుదలైన మగధీర దానిని అధిగమించింది. 2009వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ కు ఉత్తమ మాటల రచయితగా నేనింతే చిత్రానికి గాను నంది పురస్కారము లభించింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ తదితర చిత్రాలు విజయవంతం అయ్యాయి.
పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా మరి పోకిరి మరియు పూరి టాకీస్ బ్యానర్ మీద హార్ట్ ఎటాక్ అనే చిత్రాన్ని నిర్మించాడు.
అలానే యువ దర్శకులని ప్రోత్సహించేదుకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిని నింపారు.
తెలుగు చిత్రాలతో పాటు హిందీ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో కలసి బుడ్డా హోగ తేరా బాప్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని సినిమారంగానికి పరిచయం చేస్తూ అప్పులాంటి విజయవంతమైన చిత్రాల్ని తీశారు.
పూరి జగన్నాథ్ | |
---|---|
![]() | |
జననం | కొత్తపల్లె | 1966 సెప్టెంబరు 28
జాతీయత | భారతీయుడు |
వృత్తి | దర్శకుడు, నిర్మాత, రచయిత, నటుడు |
విషయ సూచిక
చిత్రాలుసవరించు
తెలుగుసవరించు
- బద్రి (2000)
- బాచి (2001)
- ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం (2001)
- ఇడియట్ (2002)
- అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)
- శివమణి (2003)
- ఆంధ్రావాలా (2004)
- 143 (2004)
- సూపర్ (2005)
- పోకిరి (2006)
- దేశముదురు (2007)
- హలో ప్రేమిస్తారా (2007)
- చిరుత (2007)
- బుజ్జిగాడు (2008)
- నేనింతే (2009)
- ఏక్ నిరంజన్ (2009)
- గోలీమార్ (2010)
- నేను నా రాక్షసి (2011)
- బుద్దా హోగా తేరా బాప్ (2011)
- బిజినెస్ మేన్ (2011)
- దేవుడు చేసిన మనుషులు (2012)
- కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
- ఇద్దరమ్మాయిలతో (2013)
- హార్ట్ అటాక్ (2014)
- టెంపర్ (2015)
- జ్యోతిలక్ష్మీ (2015)
- ఇజం (2016)
- పైసా వసూల్ (2017)
- రోగ్ (2017)
- మెహబూబా (2018)
- ఇస్మార్ట్ శంకర్[1] (2019)
కన్నడసవరించు
- అప్పు (2002)
అవార్డులుసవరించు
- ఉత్తమ మాటల రచయిత - అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, 2003
- ఉత్తమ మాటల రచయిత - నేనింతే, 2009
మూలాలుసవరించు
- ↑ సాక్షి, సినిమా (18 July 2019). "'ఇస్మార్ట్ శంకర్' మూవీ రివ్యూ". మూలం నుండి 18 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 21 July 2019. Cite news requires
|newspaper=
(help)