పేకముక్కను దళసరి కాగితమును ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తారు. సన్నని అట్ట వలె ఉండే ఈ కాగితంపై ప్లాస్టిక్ పూత ఉంటుంది. ఇంకా పత్తి-కాగితము, ప్లాస్టిక్ కాగితాలలో గట్టిగా ఉండేందుకు మరికొన్నింటిని మిశ్రమం చేసి వీటిని తయారు చేస్తారు. పేకాట ఆడేందుకు వీలుగా ఈ పేకముక్కలపై వ్యత్యాసాలను గుర్తించడానికి వివిధ నమూనాలు కలిగిన గుర్తులు ఉంటాయి. పేకాట ఆడేందుకు ఉపయోగించే ఒక కట్టను చీట్లప్యాకి అంటారు. ఒక కట్టలో ఉండే పేకముక్కలు ఒక వైపు అన్ని ఒకే విధంగాను మరొకవైపు ఒకదానికి ఒకటి విరుధంగాను ఉంటాయి. సాధారణంగా చేతితో పట్టుకుని ఆట ఆడేందుకు వీలుగా వీటిని అరచేతి పరిమాణంలో తయారు చేస్తారు. పేకముక్కలను ఆంగ్లంలో ప్లేయింగ్ కార్డ్స్ అంటారు. పేకముక్క యొక్క బహువచనం పేకముక్కలు. పేకముక్కలతో ఆడే ఆటను పేకాట లేక చీట్లాట అంటారు.

పేక ముక్కలు


కాలంతో పోలికలు

మార్చు

1. ఒక చీట్లప్యాకిలో 52 పేకముక్కలుంటాయి. సంవత్సరానికి ఉండే వారాలు 52.

2. పేకముక్కకు ఒకవైపు నల్లగాను లేక మరొక రంగుతో ఉండి మరొక వైపు తెల్లగా ఉంటుంది. ఒకరోజుకి ఒక రాత్రి ఒక పగలు.

3. పేకాటలో ఎక్కువగా రమ్మీ ఆడతారు. రమ్మీ ఆటలో ఒక్కొక్క వ్యక్తికి 13 పేకముక్కలను పంచుతారు. చంద్రమాసంలో దాదాపుగా 28 రోజులే ఉంటాయి. ఈ లెక్కన సంవత్సరానికి 365 రోజుల ప్రకారం 13 చంద్రమాసాలు వస్తాయి.

4. పేకముక్క రెండవ వైపున ఉన్న తెల్లని భాగంలో నలుపు, ఎరుపు రంగులతో గుర్తులను ముద్రిస్తారు. ఈ రెండు రంగులు ట్రోఫిక్స్ ను గుర్తుచేస్తాయి ఒకటి డ్రై సీజన్ (పొడి కాలం) రెండవది వెట్ సీజన్ (తడి కాలం). ఈ కాలాలను మనం తెలుగులో ఉత్తరాయణం, దక్షిణాయణంగా వ్యవహరిస్తాము.

5. పేకముక్కపై రెండవ వైపున ఉన్న తెల్లని భాగంలో స్పెడ్స్, హార్ట్స్, డైమండ్స్, క్లబ్స్ అని పిలవబడే నాలుగు రకాల సూట్ లను ఉపయోగిస్తారు. ఈ సూట్ లు నాలుగు క్యాలెండర్ సీజన్ల (Calendar seasons)ను గుర్తుచేస్తాయి. ఒకటి వసంతం (Spring), రెండు వేసవి (Summer), మూడు శరత్కాలం (Autumn), నాలుగు శీతాకాలము (Winter).

6. ప్రతి పేకముక్క నలుపు రంగు వైపున 365 చుక్కలు ఉంటాయి. ఈ చుక్కలు సంవత్సరానికి ఉండే 365 రోజులను గుర్తు చేస్తాయి.

7. పేకముక్క నలుపు రంగు వైపున కింది సగభాగం పై సగభాగంతో సమానంగా అద్దంలో చూపినట్లు ఉంటుంది. రాత్రి, పగలు వేరువేరు దిశలలో ఉన్నప్పటికి రాత్రి సమయం, పగటి సమయం సమానంగా ఉంటుందని పేకముక్క ముందరి వైవు ఉన్న కూర్పు తెలియజేస్తుంది.


52 పేక ముక్కలు
రకం ఆసు 2 3 4 5 6 7 8 9 10 జాకీ రాణి రాజు
ఇస్పేటు                          
ఆటిను                          
డైమను                          
కళావరు                          

ఇవి కూడా చూడండి

మార్చు

పేకాట


బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పేకముక్క&oldid=3275265" నుండి వెలికితీశారు