పైడిపాటి సుబ్బరామశాస్త్రి

పైడిపాటి సుబ్బరామశాస్త్రి లలితగేయాల రచయితగా సుప్రసిద్ధుడు. ఇతడు వ్రాసిన "నా దేశం, నా దేశం - భారతదేశం నా దేశం", "త్రిలింగ దేశం మనదేనోయ్‌ తెలుంగులంటే మనమేనోయ్‌" అనే గేయాలు జాతీయోద్యమంలో విశేషమైన ప్రాచుర్యాన్ని పొందాయి.[1]

జీవిత విశేషాలు

మార్చు

ఆయన కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలం, సాయిపురం గ్రామంలో 1918లో జన్మించాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి సభ్యుడిగా ఉన్నాడు. ఇతనికి కవిసామ్రాట్ అనే బిరుదు లభించింది. ఆయన స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని గరిమెళ్ల సత్యనారాయణ వంటి వారితో కలసి జాతీయ భావాలను తన కవిత్వం ద్వారా పెంపొందించారు.[2]

రచనలు

మార్చు
  1. నీలం (కథాసంపుటం)
  2. మేనరికం (కథాసంపుటం)
  3. అభిషేకము (రామలింగేశ్వర స్తవము)
  4. మగదిక్కు (నవల)
  5. మహారుద్రము
  6. అనిరుద్ధ చరిత్రము
  7. నృత్యభారతి (గేయాలు) [3]
  8. జాతీయభారతి (గేయాలు)
  9. జయభారతి (గేయాలు)
  10. మధురభారతి (గేయాలు)
  11. విక్రమభారతి
  12. దిశమ్‌
  13. తుణీరం
  14. మధుర సంక్రాంతి (గేయాలు)
  15. బాలభారతి (గేయాలు)
  16. వఱద కృష్ణమ్మ (గేయాలు)
  17. ఆంధ్ర భారతి (పద్యములు)
  18. ఉషాసుందరి (నాటకము)
  19. అమరవాణీ ప్రసారములు
  20. అంకితం (నాటకము)
  21. శతపత్రము[4] (పద్యములు)
  22. దివ్వటీలు (పద్యములు)

ఇతడు తన 89వ యేట ఆగస్టు 19, 2006న విజయవాడ, మారుతీనగర్‌లో తన స్వగృహంలో మరణించాడు[5].

మూలాలు

మార్చు
  1. "తమిళ తంబికి వణక్కం ( ప్రొ" ముదిగొండ శివప్రసాద్ ‌)". Archived from the original on 2016-01-22. Retrieved 2015-08-26.
  2. "The Spectrum Of Modern Telugu Literature-అమరేంద్ర". Archived from the original on 2016-03-04. Retrieved 2015-08-26.
  3. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో గ్రంథ ప్రతి
  4. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో శతపత్రము ప్రతి
  5. Writer passes away

ఇతర లింకులు

మార్చు