శాయపురం

భారతదేశంలోని గ్రామం
(సాయిపురం నుండి దారిమార్పు చెందింది)

శాయపురం (Sayapuram), కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలానికి చెందిన గ్రామం.

శాయపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం వుయ్యూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 881
 - పురుషులు 438
 - స్త్రీలు 443
 - గృహాల సంఖ్య 262
పిన్ కోడ్ 521256
ఎస్.టి.డి కోడ్ 08676
శివాలయం
విష్ణాలయం
పంచాయితీ ఆఫీసు

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

ఈ గ్రామంనకు ఈ నామము షాహిపురం నుండి వచ్చింది. ఈ ఊరి పెద్దల, వృద్దుల కథనం ప్రకారము 16 శతాబ్దమునందు ఈ గ్రామం ఏర్పడినది అని, ఆ రోజులలో ఈ ప్రాంతము పరిపాలించుచున్న నవాబు హిందూ దివాను ఇచ్చటికి వచ్చి చెరువు వద్ద విశ్రాంతి తీసుకున్నాడు అని. ఆ చెరువునీటి రుచి ఇష్టపడి. అక్కడ ఒక శివాలయము, ఒక విష్ణు ఆలయం కట్టదల్చుకొని అక్కడ మసీదు కడుతున్నట్లు చెప్పి నిధులు తీసుకొని ఆలయములు కట్టించాడు అని (ఈ కథనముననుసరించి ఇక్కడ విష్ణాలయము, శివాలయములు కలవు).అక్కడికి కొంత దూరంలో మసీదు కూడా కట్టించి తరువాత ఈ ప్రాంతమునకు షాహిపురమని పేరు పెట్టినట్లుగా చెపుతారు. కాలక్రమంలో షాహిపురం శాయపురంగా మారినదిగా ఆ గ్రామ పెద్దలు వివరించారు.

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 11 మీటర్ల ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీప ంలో చినఓగిరాల, అకునూరు, కుందేరు, పెదఓగిరాల, యాకమూరు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

తోట్లవల్లూరు, కంకిపాడు, పమిడిముక్కల, పెదపారుపూడి

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

ఈ గ్రామంనకు ఇప్పటికి కూడా సరయిన ప్రయాణ సదుపాయములు లేవు. విజయవాడ నుండి బస్సులో నాగాయలంక, అవనిగడ్డ మార్గములో బస్సు ఎక్కి, గోపువానిపాలెం స్టాపులో దిగాలి. అక్కడినుంచి ఆటోలో శాయపురానికి వెళ్ళవచ్చు. రైల్వేస్టేషన్: విజయవాడ 29 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

ఈ గ్రామంలో ఒక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో రేడియో పాఠాలు విని నేర్చుకొనే సదుపాయం కలుగజేశారు. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, శాయపురం

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

ఈ గ్రామ పంచాయతీ కార్యాలయాబ్నికి చాలా సంవత్సరాల క్రితమే ఒక భవనాన్ని నిర్మించారు. ఆ భవనం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. నూతన భవనం నిర్మించవలసిన అవసరం ఎంతయినా ఉంది. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, చెరకు.

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 881 - పురుషుల సంఖ్య 438 - స్త్రీల సంఖ్య 443 - గృహాల సంఖ్య 262;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 829.[2] ఇందులో పురుషుల సంఖ్య 421, స్త్రీల సంఖ్య 408, గ్రామంలో నివాస గృహాలు 225 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 333 హెక్టారులు.

గ్రామానికి సంబంధించిన మరికొన్ని చిత్రాల మాలికసవరించు

;జన జీవనం

మూలాలుసవరించు

  1. "శాయపురం". Retrieved 23 June 2016.
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-07.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2016, మే-19; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=శాయపురం&oldid=2864657" నుండి వెలికితీశారు