పొట్లూరి సుప్రీత

పొట్లూరి సుప్రీత ఒక చెక్ క్రీడాకారుణి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా ముసునూరు మండలంలోని కాట్రేనిపాడు గ్రామానికి చెందిన పొట్లూరి గణేష్, కవిత దంపతులు ఒక మామూలు రైతు కుటుంబానికి చెందిన వారు. వీరి కుమార్తె సుప్రీత, 2008లో ముస్తాబాద స్పొర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ అకాడమీలో శిక్షణ తీసుకొనడం ప్రారంభించింది. తొలినాళ్ళలో కాట్రేనిపాడు గ్రామం నుండి వచ్చి చదరంగం సాధన చేసేది.

పొట్లూరి సుప్రీత


అవార్డులు

మార్చు

2010లో విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి, అండర్-9 చదరంగం పోటీలలో జిల్లా జట్టుకి ప్రాతినిధ్యం వహించి ప్రథమస్థానం సంపాదించి, స్వర్ణపతకం కైవసం చేసుకున్నది.

2011లో, తన పది సంవత్సరాల వయసులో, రాష్ట్ర చదరంగం పోటీలలో అండర్-11,13,15,17,19 విభాగాలలో రాణించింది. అదే సంవత్సరంలో నిర్వహించిన ఐదు జాతీయస్థాయి పోటీలలో, రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.

2012లో ఢిల్లీలో నిర్వహించిన ఆసియా పాఠశాల స్థాయి చదరంగం పోటీలలో అండర్-11 విభాగంలో పాల్గొని, స్టాండర్ద్స్ లో పసిడి, బ్లిట్జ్ లో రజతపతకం కైవసం చేసుకున్నది. [1]

2013లో ఇరాన్ దేశంలో నిర్వహించిన అసియా ర్యాపిడ్ ఛెస్ ఛాంపియన్ షిప్ పోటీలలో, అండర్-12 విభాగంలో పాల్గొని, రజతపతకం సాధించి, దుబాయ్ లో నిర్వహించిన ప్రపంచ ఛెస్ పోటీలలో అండర్-12 విభాగంలో పాల్గొనడానికి అర్హత సాధించి, అ పోటీలలో పాల్గొని, బ్లిట్జ్ లో ప్రథమస్థానానికి టై ఏర్పడి పసిడిపతకం సాధించింది.

2014లో తైవాన్ దేశంలో నిర్వహించిన ఆసియా పాఠశాలల చదరంగం పోటీలలో, అండర్-13 విభాగంలో పాల్గొని, స్వర్ణపతకం సాధించడంతో, ప్రపంచ చదరంగ సమాఖ్య ఈమెకు, ఉమన్ ఫిడే మాస్టర్ టైటిల్ ను ప్రదానం చేసింది. 2014లోనే ఈమె తన పదమూడు సంవత్సరాల వయసులో, పూనే నగరంలో నిర్వహించిన ప్రపంచ జూనియర్ ప్రపంచ చదరంగం పోటీలలో, అండర్- 20 విభాగంలో తలపడి, అత్యధికంగా 210 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించి, అత్యధిక పాయింట్లు సాధించిన క్రీడాకారిణిగా రికార్డులకెక్కినది.

2015లో దక్షిణ కొరియాలో నిర్వహించిన ప్రపంచ యూత్ మైండ్ గేంస్ ర్యాపిడ్ ఛెస్ పోటీలలో, స్వర్ణపతకం సాధించింది.

2016, జనవరి-3 నుండి 7 వరకు, మహారాష్ట్రలోని నాగపూరు నగరంలో నిర్వహించిన అఖిల భారత పాఠశాలల చదరంగం పోటీలలో ఈమె బాలికల అండర్-17 విభాగంలో పాల్గొని, ఏడు రౌండ్లలో 5.5 పాయింట్లు సాధించి ప్రథమస్థానంలో నిలిచింది. ఈ విజయం సాధించిన ఈమె, 2016, జులైలో ఇరాన్ దేశంలో నిర్వహించు ఆసియా స్కూల్ గేంస్ పోటీలలోనూ, 2016, నవంబరు-2016 లో నిర్వహించు ప్రపంచ స్కూల్ గేంస్ పోటీలలోనూ పాల్గొనడానికి అర్హత సాధించింది. [2]

2016, ఏప్రిల్-9న మంగోలియా దేశంలో నిర్వహించిన ఆసియా యూత్ బ్లిట్జ్ ఛెస్ ఛాంపియన్ షిప్పు పోటీలలో, ఈమె పాల్గొని కాంస్యపతకం సాధించింది. ఇది ఆమె చదరంగ క్రీడాప్రస్థానంలో సప్తమ అంతర్జాతీయ పతకం. [3]

మూలాలు

మార్చు

[1] ఈనాడు కృష్ణా; 2013, జనవరి-23; 14వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2016, జనవరి-18; 13వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2016, ఏప్రిల్-13; 10వపేజీ.

  1. [https://www.thehindu.com/news/cities/Vijayawada/asian-blitz-bronze-for-supreetha/article8457000.ece 2.
  2. https://www.thehindu.com/news/cities/Vijayawada/asian-blitz-bronze-for-supreetha/article8457000.ece]
  3. https://ratings.fide.com/profile/25053094
  4. https://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2016-04-19/City-girl-grabs-bronze-at-Asian-chess-championship/222540