ముసునూరు

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, ముసునూరు మండలం లోని గ్రామం

నెల్లూరు జిల్లా, కావలి మండలంలోని ఇదేపేరున్న మరొక గ్రామం కోసం ముసునూరు (కావలి మండలం) చూడండి.

ముసునూరు
—  రెవిన్యూ గ్రామం  —
India - Andhra Pradesh - Krishna.svg
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°50′34″N 80°57′44″E / 16.842662°N 80.962257°E / 16.842662; 80.962257
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ముసునూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ రేగుల గోపాలకృష్ణ
జనాభా (2011)
 - మొత్తం 6,095
 - పురుషులు 28,941
 - స్త్రీలు 28,256
 - గృహాల సంఖ్య 15,205
పిన్ కోడ్ 521207
ఎస్.టి.డి కోడ్ 08656


ముసునూరు
—  మండలం  —
కృష్ణా జిల్లా పటములో ముసునూరు మండలం స్థానం
కృష్ణా జిల్లా పటములో ముసునూరు మండలం స్థానం
ముసునూరు is located in Andhra Pradesh
ముసునూరు
ముసునూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో ముసునూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°50′34″N 80°57′44″E / 16.842662°N 80.962257°E / 16.842662; 80.962257{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం ముసునూరు
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 55,036
 - పురుషులు 27,996
 - స్త్రీలు 27,040
అక్షరాస్యత (2001)
 - మొత్తం 57.55%
 - పురుషులు 61.97%
 - స్త్రీలు 52.98%
పిన్‌కోడ్ 521207

ముసునూరు కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన నూజివీడు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1495 ఇళ్లతో, 6095 జనాభాతో 2206 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2883, ఆడవారి సంఖ్య 3212. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1885 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 70. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589040[1].పిన్ కోడ్ : 521207, ఎస్.టి.డి.కోడ్ :08656.

గ్రామ చరిత్రసవరించు

ముసునూరి కమ్మరాజులు ఈ గ్రామం నకు చెందినవారు. కాకతీయ సామ్రాజ్యం తరువాత మహమ్మదీయులను తరిమి తెలుగు నేలను పాలించారు.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

[2] ముసునూరు మండలానికి, జిల్లా ముఖ్యపట్టణము మచిలీపట్నమునకు 85 కి.మీ దూరం

గ్రామ భౌగోళికంసవరించు

సముద్రమట్టానికి 16 మీ.ఎత్తు. టైం జోను : IST (UTC+5:30)

సమీప గ్రామాలుసవరించు

యెల్లాపురం 5 కి.మీ, చెక్కపల్లి 5 కి.మీ, వలసపల్లి 5 కి.మీ, కాట్రేనిపాడు 6 కి.మీ, గుళ్ళపూడి 6 కి.మీ

సమీప మండలాలుసవరించు

నూజివీడు, లింగపాలెం, పెదవేగి, చాట్రాయి

సమాచార, రవాణా సౌకర్యాలుసవరించు

ముసునూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. ధర్మాజీగూడెం, విజయరాయి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 55కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నూజివీడులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఏలూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు నూజివీడులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నూజివీడులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.

 1. దేవినేని మాణిక్యం,దాసరి వెంకటసుబ్బయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ముసునూరు
 2. బాలికల గురుకుల పాఠశాల:- ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న పి.వి.ఎన్.ఎస్.రమ్యశ్రీ అను విద్యార్థిని, అండర్-17 విభాగంలో, జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనది. జనవరి/2015 లో అనంతపురంలో నిర్వహించే జాతీయస్థాయి కబడ్డీ పోటీలలో ఈమె పాల్గొంటుంది.
 3. ఎ.పి.రెసిడెన్షియల్ స్కూల్.
 4. భారతి విద్యానికేతన్.
 5. ఎస్.ఎస్.ఎన్. ఇంగ్లీషు మీడియం ప్రాథమికోన్నత పాఠశాల, ముసునూరు

వైద్య సౌకర్యంసవరించు

ప్రభుత్వ వైద్య సౌకర్యంసవరించు

ముసునూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యంసవరించు

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగుసవరించు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంసవరించు

బ్యాంకులుసవరించు

ది కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలుసవరించు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

భూగర్భజలాలే ముఖ్యమైన నీటివనరు. నాగార్జున సాగర్ కాలువ ఒకటి ఈ గ్రామం వ్యవసాయానికి నిర్మించారు గాని దానిద్వారా నీరు సరిగా అందడంలేదు. నగరాల చెరువు, పెద్ద చెరువు, చిన్న చెరువు, నెలపాటి కుంట, ముత్తనబోయిన కుంట.

తాగు నీరుసవరించు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యంసవరించు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ రేగుల గోపాలకృష్ణ సర్పంచిగా 850 ఓట్లఆధిక్యంతో గెలుపొందారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ ప్రసన్న లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంసవరించు

శ్రీ వేంకటాచలస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణం, 2015,మార్చ్-4వ తేదీ, బుధవారంనాడు, అంగరంగవైభవంగా నిర్వహించారు. కళ్యాణానికి ముందు ఎదురుకోలు ఉత్సవం అందరినీ ఆకట్టుకున్నది. పెళ్ళికుమారుడైన వెంకటాచలస్వామివారి తరఫున దేవినేని వంశీయులు, పెళ్ళి కుమార్తె శ్రీదేవి అమ్మవారి తరఫున చలసాని, రేగుల, అట్లూరి వంశీయులు చేరి, ఒకరినొకరు సరసాలు ఆడుకుంటూ పెళ్ళికుమారుడిని, కల్యాణమండపానికి ఆహ్వానం పలికే ఘట్టం ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నది. గ్రామస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా తిలకించారు. అనంతరం ప్రధాన అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గురువారం ఉదయం, ప్రత్యేకపూజల అనంతరం, విష్ణుసహస్రనామ పారాయణం, అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. ముసునూరు కోలాటసమాజం వారు, కోలాటం నిర్వహించారు. స్వామివారిని ట్రాక్టరుపై గ్రామంలోని అన్ని వీధులలోనూ ఊరేగించారు. [6]

శ్రీ కోదండరామాలయం ఆలయంసవరించు

స్థానిక పడమటి వీధిలోని ఈ ఆలయంలో 2017,మార్చ్-18వతేదీ శనివారంనాడు స్వామివారికి వార్షిక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అభిషేకాలు అనంతరం స్వామివారి కళ్యాణ వేడుకలు నిర్వహించారు. సాయంత్రం కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఈ వేడుకలకై, 17వతేదీ శుక్రవారంనాడు, అలయాన్ని రంరంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. శుక్రవారం నుండియే ఆలయంలో భక్తుల సందడి ప్రారంభమైనది. [7]

శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయంసవరించు

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంసవరించు

స్థానిక బి.సి.కాలనీలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 800 కిలోల బరువైన శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా, 2014, ఆగస్టు-20 బుధవారం నాడు, స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. 21వ తేదీ గురువారం నాడు ఉదయం 9-15 గంటలకు, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, కన్నులపండువగా నిర్వహించారు. [4] & [5]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంసవరించు

విద్యుత్తుసవరించు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 9 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగంసవరించు

ముసునూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 209 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 148 హెక్టార్లు
 • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 15 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 27 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 330 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 328 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1147 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 538 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 937 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలుసవరించు

ముసునూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • బావులు/బోరు బావులు: 937 హెక్టార్లు

ఉత్పత్తిసవరించు

ముసునూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలుసవరించు

ఈ గ్రామంలో వరి, పుగాకు, మామిడి ప్రధానమైన పంటలు. ఇంకా కొబ్బరి, కూరగాయలు, పండ్లతోటలు, పామాయిల్ వ్యసాయం కూడా జరుగుతున్నది.

ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

ముసునూరు ఇంటి పేరుతో ప్రసిద్ధులుసవరించు

ముసునూరి లలిత్ బాబు:- చదరంగంలో, ఇతడు ఆంధ్రప్రదేశ్ నుండి నాల్గవ గ్రాండ్ మాస్టర్. భారతదేశంలో 26వ గ్రాండ్ మాస్టర్. [2]

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామంలో 7.25 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఘనవ్యర్ధాల కేంద్రాన్ని, 2017,మార్చ్-25న ప్రారంభించారు. ఆరువేల జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రతి ఇంటికీ రెండు బుట్టలను ఇచ్చి, తడి చెత్త, పొడిచెత్త, వేరువేరుగా సేకరించి, ప్రత్యేకంగా నియమించిన సిబ్బంది రిక్షాలద్వారా ఈ కేంద్రానికి తీసికొని వచ్చెదరు. ఈ కేంద్రంలో ఆ చెత్తను వర్మీ కంపోస్టు ఎరువులు తయారుచేసి, రైతులకు విక్రయించెదరు. ఆ విధంగా ఈ కేంద్రం ద్వారా గ్రామం, స్వచ్ఛతతోపాటు, ఆర్థిక వనరులను గూడా ఏర్పరచుకోగలదు. [8]

ఇవి కూడా చూడండిసవరించు

ముసునూరి నాయకులు

 
గ్రామంలో ఒక వీధి
 
గ్రామంలో గుడి
 
గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల

గ్రామాలుసవరించు

జనాభాసవరించు

ముసునూరు జనాభా (2001) - మొత్తం 55,036 - పురుషులు 27,996 - స్త్రీలు 27,040;
 • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[3]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అక్కిరెడ్డిగూడెం 738 2,912 1,477 1,435
2. బలివే 403 1,682 849 833
3. చెక్కపల్లి 1,253 5,336 2,735 2,601
4. చిల్లబోయినపల్లి 341 1,548 791 757
5. చింతలవల్లి 1,044 4,420 2,246 2,174
6. యెల్లాపురం 315 1,131 552 579
7. గోపవరం 1,614 6,134 3,139 2,995
8. గొల్లపూడి 1,290 5,337 2,726 2,611
9. కాట్రేనిపాడు 1,141 5,174 2,653 2,521
10. కొర్లగుంట 403 1,736 890 846
11. లొపుడి 723 3,035 1,560 1,475
12. ముసునూరు 1,361 5,912 2,829 3,083
13. రమణక్కపేట 1,042 4,475 2,348 2,127
14. సూరెపల్లి 496 2,063 1,060 1,003
15. తల్లవల్లి 27 102 49 53
16. వేల్పుచెర్ల 1,014 4,039 2,092 1,947

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 57,197 - పురుషుల సంఖ్య 28,941 - స్త్రీల సంఖ్య 28,256 - గృహాల సంఖ్య 15,205
జనాభా (2001) -మొత్తం 5912 -పురుషులు 2829 -స్త్రీలు 3083 -గృహాలు 1361 -హేక్తార్లు 2206

వాడుక భాష తెలుగు.

వనరులుసవరించు

 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 2. "ముసునూరు". Archived from the original on 12 ఫిబ్రవరి 2018. Retrieved 21 June 2016.
 3. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-05.

వెలుపలిలింకులుసవరించు

[2] ది హిందు దినపత్రిక; 2012,జనవరి-11; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2013,జులై-25; 8వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014,ఆగస్టు-21; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2014,ఆగస్టు-22; 9వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2015,మార్చ్-6; 10వపేజీ. [7] ఈనాడు అమరావతి/నూజివీడు; 2017,మార్చ్-19; 1వపేజీ. [8] ఈనాడు అమరావతి/నూజివీడు; 2017,మార్చ్-26; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=ముసునూరు&oldid=2933828" నుండి వెలికితీశారు