పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డి

పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994,1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డి
పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డి


మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 - 2004
నియోజకవర్గం జమ్మలమడుగు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1962
గుండ్లకుంట, పెద్దముడియం మండలం, వైఎస్‌ఆర్ జిల్లా కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ Indian Election Symbol Ceiling Fan.svg వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు శివ నాగిరెడ్డి
జీవిత భాగస్వామి ఇందిరా
బంధువులు పొన్నపురెడ్డి శివారెడ్డి (బాబాయ్)
సంతానం వెంకట శివారెడ్డి , సింధుజ, శివమ్మ

జననం, విద్యాభాస్యంసవరించు

పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డి 1962లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, జమ్మలమడుగులో జన్మించాడు. ఆయన వరంగల్ లోని కిట్స్ కళాశాలలో 1986లో బిటెక్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితంసవరించు

పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1994,1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి పై ఎమ్మెల్యేగా గెలిచి 1994లో ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా, 1999లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో గృహనిర్మాణశాఖ మంత్రిగా పనిచేశాడు.[1] ఆయన తరువాత 2004, 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. రామసుబ్బారెడ్డి టీడీపీ తరపున 2016లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై, ప్రభుత్వ విప్‌‌గా పనిచేశాడు. ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి మూలే సుధీర్‌ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. రామసుబ్బారెడ్డి 2020 మార్చి 11న టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2][3]

పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డి మార్చి 17న ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలుసవరించు

  1. ETV Bharat News (7 February 2021). "ఇదీ సంగతి: సర్పంచి నుంచి శాసనసభ వరకు." Archived from the original on 11 December 2021. Retrieved 11 December 2021.
  2. Sakshi (12 March 2020). "వైఎస్సార్‌సీపీలోకి రామసుబ్బారెడ్డి కుటుంబం". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. Suryaa (11 March 2020). "వైసిపిలోకి జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  4. Sakshi (17 March 2023). "'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌". Archived from the original on 18 March 2023. Retrieved 18 March 2023.