పోతుగంటి భరత్ ప్రసాద్

పోతుగంటి భరత్ ప్రసాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది, రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

పోతుగంటి భరత్ ప్రసాద్

కల్వకుర్తి జెడ్పీటీసీ
పదవీ కాలం
2019 – ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1987 ఆగష్టు 7
గుండూరు గ్రామం , కల్వకుర్తి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు పి.రాములు, భాగ్యలక్ష్మి
నివాసం చంపాపేట్, హైదరాబాద్
టీచర్స్ కాలనీ, అచ్చంపేట
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం మార్చు

భరత్ ప్రసాద్ 1987 ఆగష్టు 7న తెలంగాణ, నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండలం, గుండూరు గ్రామంలో పి.రాములు, భాగ్యలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయన జెఎన్టీయూ నుంచి బీటెక్, ఎంబీఏ పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం మార్చు

భరత్ ప్రసాద్ తన తండ్రి పి.రాములు అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసి కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై[1] రాష్ట్ర జెడ్పీటీసీల సంఘం జనరల్ సెక్రెటరీగా సేవలందిస్తున్నాడు. ఆయనకు 2019 నుంచి 2022 వరకు నాగర్‌కర్నూల్‌ జెడ్పీ చైర్మన్ గా అవకాశం ఉన్నప్పటికీ అప్పటి పరిస్థితుల వల్ల అవకాశం దక్కలేదు. భరత్ 2023 తెలంగాణ ఎన్నికల అనంతరం 2024 ఫిబ్రవరి 29న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన తండ్రితో కలిసి బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3]

2024 భారత సార్వత్రిక ఎన్నికల సందర్బంగా బీజేపీ 2024 మార్చి 02న 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేయగా నాగర్‌కర్నూల్‌ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం భరత్‌ప్రసాద్‌ను నుండి బీజేపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది.[4][5][6]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Sakshi (5 June 2019). "కారు..జోరు." Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
  2. Eenadu (3 March 2024). "కమలం అభ్యర్థి ఖరారు". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
  3. A. B. P. Desam (29 February 2024). "ఎన్నికల ముందు కేసీఆర్‌కు ఝలక్! బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ". Archived from the original on 29 February 2024. Retrieved 29 February 2024.
  4. Eenadu (2 March 2024). "తెలంగాణలో భాజపా లోక్‌సభ అభ్యర్థులు వీరే." Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024.
  5. Sakshi (3 March 2024). "నాగర్‌కర్నూల్‌బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రొఫైల్‌". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
  6. Andhrajyothy (2 March 2024). "నాగర్‌కర్నూల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భరత్‌". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.