పోతుగంటి రాములు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ పార్లమెట్ సభ్యుడు.[1][2]

పి. రాములు
పి.రాములు


లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
  2019- ప్రస్తుతం
నియోజకవర్గం నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఆగస్టు 17, 1952
గుండూరు గ్రామం , కల్వకుర్తి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి భాగ్యలక్ష్మి
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
నివాసం నాగర్‌కర్నూల్‌, తెలంగాణ

రాములు 1952, ఆగస్టు 17న ఎల్లమ్మ, నాగయ్య దంపతులకు నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండలం, గుండూరు గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బిఏ పూర్తిచేసి, వ్యవసాయ రంగంలో పనిచేశాడు.[3]

వ్యక్తిగత జీవితం

మార్చు

రాములుకు 1977, మే 12న భాగ్యలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.

రాజకీయ విశేషాలు

మార్చు

1994లో తెలుగుదేశం పార్టీ తరపున అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం అభ్యర్థిగా గెలుపొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టాడు. 1999లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి క్రీడలు, యువజన సేవల శాఖామంత్రిగా పనిచేశాడు. 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. 2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందాడు.[4][5]

2019లో జరిగిన 17వ లోక్ సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి పై 1,89,748 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6][7][8] 2019, సెప్టెంబరు 13 నుండి హోం వ్యవహారాలపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ- వాతావరణ మార్పు సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.

పి.రాములు 2023 తెలంగాణ ఎన్నికల అనంతరం 2024 ఫిబ్రవరి 29న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[9][10]

ఇతర వివరాలు

మార్చు

ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా మొదలైన దేశాలలో పర్యటించాడు.

మూలాలు

మార్చు
  1. https://www.bbc.com/telugu/india-48345983
  2. https://www.andhrajyothy.com/elections/constituency?ConsID=295[permanent dead link]
  3. "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 2021-08-04.
  4. Mana Telangana (8 April 2019). "అప్పుడే విజయం ఖాయమైంది". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  5. Eenadu (10 November 2023). "రాజకీయాల్లో కొలువుదీరారు". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  6. Indina Government, MPs. "Ramulu Pothuganti". www.india.gov.in. Archived from the original on 9 August 2019. Retrieved 4 August 2021.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-17. Retrieved 2019-07-17.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-17. Retrieved 2019-07-17.
  9. A. B. P. Desam (29 February 2024). "ఎన్నికల ముందు కేసీఆర్‌కు ఝలక్! బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ". Archived from the original on 29 February 2024. Retrieved 29 February 2024.
  10. Sakshi (29 February 2024). "బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు". Archived from the original on 29 ఫిబ్రవరి 2024. Retrieved 29 February 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=పి.రాములు&oldid=4302641" నుండి వెలికితీశారు