పోతుబరి నారాయణరావు

పోతుబరి నారాయణరావు నటుడు, ప్రయోక్త, కవి, సమీక్షకుడు.[1] తన బహుముఖమైన ప్రతిభతో సాలూరులో కొన్ని దశాబ్ధాలపాటు గుర్తింపు పొందాడు. అతని గొంతు శ్రావ్యంగా, గంభీర్యంగా సుస్పష్టంగా శ్రోతలను కట్టి పడేసేట్టు ఉంటుంది. అతను కోన్ని నాటికలలో 'ఆకాశవాణి' లో తమ గొంతును వినిపించాడు. సాలూరు సమితిలో టైపిస్టుగా ప్రారంభమైన వీరి జీవితం విజయనగరం జిల్లాపరిషత్ సూపరెండెంటుగా పదవీ విరమణ పొందాడు. అతని రచనలు 'రాశి ' కన్న 'వాసి ' కలిగినవని చదివినవారు అభినందించకుండా ఉండలేరు.వీరు కోన్ని కధలతో పాటు అనేక గీతాలనూ వ్రాసారు.అది 'కబీర్ షా ' పార్టీవారు వందలాది వేదికలపై పాడి శ్రోతలను ఆకట్టుకున్నారు కూడా.

ప్రచురణలు

మార్చు
  • ఎండా-వానా (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 10-8-1988) [1] Archived 2021-01-14 at the Wayback Machine
  • వల కొరికిన చేపలు (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 20-12-1989)
  • బాకీ తీరిపోయింది (ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రిక 01-10-2000)
  • వా ' కింగ్ ' (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 25-8-2001) [2][permanent dead link]

మూలాలు

మార్చు
  1. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2021-01-12.