పోలిమెట్ల
"పోలిమెట్ల" కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
పోలిమెట్ల | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°21′51″N 81°00′31″E / 16.364287°N 81.008579°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | గుడ్లవల్లేరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 356 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
సమీప గ్రామాలు
మార్చుగుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుగుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామంలో మౌలిక వసతులు
మార్చుపాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
మార్చుమంచినీటి చెరువు - ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఆరు ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువులో 2016, మే-17న, 9.3 లక్షల అంచనావ్యయంతో, పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. సారవంతమైన ఈ మట్టిని, ఈ గ్రామ రైతులు, తమ ట్రాక్టర్లతో పొలాలకు తరలించుకొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామములో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [3]
ఊరచెరువు:- గ్రామములోని శ్రీరామాలయం ఎదురుగా ఉన్న ఈ చెరువులో, ఈ గ్రామవాసి, పాలిటెక్నిక్ పూర్వ అధ్యాపకుడు శ్రీ పర్వతనేని రామకృష్ణ, ఒక లక్ష రూపాయల వ్యయంతో నిర్మించిన రేవును ప్రారంభించారు. [4]
గ్రామ పంచాయతీ
మార్చుగ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ రామాలయం.
గ్రామ విశేషాలు
మార్చుహైదరాబాదులోని "డైరీ ట్రీట్" అను ఐస్ క్రీం సంస్థకు ఎం.డి.అయిన, ఈ గ్రామానికి చెందిన, మండవ రాంబాబు, ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ సిటీ) గా అభివృద్ధిచేయడానికై ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [2]
ఈ గ్రామములో అట్లూరి సుందరరామయ్య అను ఒక శతాధిక వృద్ధుడు ఉన్నారు. ఇతను ఇంతకు ముందు, 12 సంవత్సరాలుపాటు, ఈ గ్రామ సర్పంచ్‌గా పనిచేసి గ్రామాభివృద్ధికి కృషిచేసారు. 2017, జనవరి-1న, ఆయన శతాధిక మహోత్సవాన్ని గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఇప్పటి వరకు ఆయన తన పనులు తనే చేసుకుంటున్నారు. ఇతను 2017, మార్చి-23న గ్రామంలో, హఠాత్తుగా కన్నుమూసారు. [5]
మూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చు[1] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-19; 26వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-28; 25వపేజీ. [3] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, మే-18; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, అక్టోబరు-11; 2వపేజీ.[5] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017, మార్చి-24; 2వపేజీ.