పోలిశెట్టి
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
పోలిశెట్టి అనేది ప్రస్తుతం బలిజ వర్గంవారిలో చాలామందికి ఇంటిపేరుగా గృహనామం గా ఉన్నది. పోలిశెట్టి వారి వంశీయులు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోనూ, రాయలసీమజిల్లాల్లోనూ, కోస్తాఆంధ్ర జిల్లాల్లో ప్రధానంగా ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ విస్తరించి ఉన్నారు. [1]
నేడు గోదావరి జిల్లాల్లో ప్రముఖంగా 150 కి పైగా గ్రామాల్లో విస్తరించి నివసిస్తున్న వీరివద్ద ఉన్న చరిత్రల ప్రకారం వీరి పూర్వీకులు కర్నాటకలోని ఐహాలుకు చెందిన చాళుక్య వంశీయులు. తరువాత వ్యాపార వర్గంలో చేరి నవరత్నాల వ్యాపారాలు చేసేవారు. కల్యాణపట్నం, మంగళూరు, ద్వారసముద్రం, పెనుకొండ, కాంచీపురం, విజయనగరంలలో స్థిరపడిన వీరు 14వ శతాబ్దమున విజయనగర సామ్రాజ్య యిమ్మడి దేవరాయల కాలములో గజపతులతో దండయాత్రలలో భాగంగా సైనిక పరిపాలనా పరమైన వ్యాపార కుటుంబాలుగా రాజమహేంద్రవరము రాజ్యం చేరి రాజమహేంద్రవరము, ద్రాక్షారామంలో స్థిరపడినవారు. హోయసల, చోళ, విజయనగర రాజులకు రాజబందువులు. మానవ్యసశ్రీశెట్టిపాల గోత్రోద్భవులు. వీరు ప్రధానంగా తరతరాలుగా వ్యాపార రంగంలో ప్రాముఖ్యతనందిన బలిజ కుటుంబాలకు చెందినవారు. చాళుక్య రాచకుటుంబాలకు చెంది తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాలు రత్నాల వ్యాపారాలలో ప్రాముఖ్యత గడించుటవలన వీరు రత్నాలబలిజవారు లేదా అని పిలవబడెను. [2]
కల్యాణపట్టణానికి చెందిన రత్నాల బలిజవారిలో 143 వంశాలు గల 11 తెగలు గలవని, వారి ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు కట్టుబాట్లు అన్ని గ్రంధస్తం చేయబడి ఉన్నాయని పోలిశెట్టివారి వంశ చరిత్ర ద్వారా తెలుస్తుంది. [3]
వీరి కుటుంబీకులు రాజమహేంద్రవరం రాజ్యం దేశాయిశెట్లు, పట్టణశెట్టి, సెట్టిపెద్దలు వంటి శెట్టితనాల పెద్దలుగా పేరుమోసి అనేక పదవులు నిర్వహించినారు [4]
అలానే రాజమహేంద్రవరం రాజ్యంలో ద్రాక్షారామ కోరంగి రేవుపట్టణము కేంద్రంగా 16వ శతాబ్దంలో 401 బలిజశెట్టి వంశాలు 11 తెగలుగా స్వదేశ విదేశ వ్యాపారాలు 500 వాడల ద్వారా చేసినట్టు కూడా గ్రంధస్తం చేయబడింది [5]
ద్రాక్షారామ పోలిశెట్టి వారి వంశ శాఖలవారు చల్లపల్లి, కొప్పర్రు, బ్రహ్మపురి గ్రామాలలో 16 వ శతాబ్దము నుంచి నివసిస్తున్నారు. వీరునూ గూడాల, అత్తిలి, తణుకు ప్రాంతాలలో విస్తరించియున్న పోలిశెట్టి వారందరు ఒకే వంశవృక్షానికి చెందినవారని వీరి వద్దగల ప్రాచీన వంశవృక్షాల ద్వారా తెలియుచున్నది. వీరి వంశాలు ఇప్పుడు ఉభయగోదావరి జిల్లాల్లో 150 కు పైగా గ్రామాల్లో నివసిస్తూ, ఇప్పుడు మానవ్యస శ్రీ శెట్టిపాల, ఆత్రేయస, బరద్వాజస, జనపాల, నరపాల, పైడిపాల, ధనపాల, జనకుల, ధనపతుల ఇలా రకరకాల గోత్రాలు చెప్పుకొనుచున్నారు.
యీ వంశమునుండి యెందరో ప్రసిధ్ధులు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారవేత్తలు రాష్ట్ర వ్యాప్తంగా విస్థరించి ఉన్నారు.
కొందరు ప్రముఖులు
మార్చు- శ్రీ పోలిశెట్టి సదాశివరాయశెట్టివర్మ గారు,గొప్ప వ్యాపారి, విజయనగర రె౦డవ దేవరాయల సేనాని
- శ్రీ పోలిశెట్టి రాయప్పరాజవర్మ దళవాయి గారు, గొప్ప వ్యాపారి, విజయనగర తుళువ వీర నరసి౦హరాయల రాజబ౦ధువు, సేనాని
- శ్రీ పోలిశెట్టి గున్నయ్యశెట్టి నాయకమహాపాతృడు గారు, రాజమహే౦ద్రవర౦ దేశాయి
- శ్రీ పోలిశెట్టి నరసప్పశెట్టి నాయక మహాపాత్రుడు గారు, రాజమహే౦ద్రవర౦ దేశాయి
- శ్రీ పోలిశెట్టి గున్నరాయలుశెట్టి చౌదరిగారు బోడసకుర్రు పరగణా చౌదరులు యిజారాదార్లు, టీ. చల్లపల్లి యెష్టేట్ ముఠాదారులు
- రావు సాహెబ్ శ్రీ పోలిశెట్టి రంగనాయకులు నాయుడు గారు, (గొప్ప ఇంజనీరుగా బ్రిటీషు ప్రభుత్వము గుర్తింపు పొన్దినవారు)
- మహాదాత శ్రీ పోలిశెట్టి కమలనాభం నాయుడు గారు, కాపులపాలెం, యానాం
- శ్రీ పోలిశెట్టి వెంకటరత్నం గారు, భూస్వామి, పీ. మల్లవరం ఎస్టేటుదారు,దంగేరు జమీందారు గారు (1875-1955) [6], [7]
- శ్రీ పోలిశెట్టి మంగయ్య నాయుడు గారు, టీ. చల్లపల్లి గ్రామ మున్సబు గారు, యిజారాదార్లు
- శ్రీ పోలిశెట్టి నరసప్ప నాయుడు గారు, టీ. చల్లపల్లి గ్రామ పెత్తందారు గారు, యిజారాదార్లు
- ధర్మదాత రావుబహద్దూర్ శ్రీ పోలిశెట్టి ధర్మారాయుడు గారు, టీ. చల్లపల్లి యెష్టేట్ పిఠాపురం మహారాజ సంస్థాన గ్రామాల పెత్తందారు గారు
- శ్రీ పోలిశెట్టి వెంకటరత్నం గారు, గూడాల గ్రామ పెత్తందారు గారు
- శ్రీ పోలిశెట్టి స్వామి నాయుడు గారు, స్వతంత్ర సమరయోధులు, జుస్టిస్ పార్టీ లీడర్, తూర్పు గోదావరి జిల్లా బోర్డ్ మెంబరు గూడాల
- శ్రీ పోలిశెట్టి విశ్వేశ్వర రావు గారు, స్వతంత్ర సమరయోధులు, గూడాల
- శ్రీ పోలిశెట్టి తిరుపతి రాయుడు గారు, కొప్పర్రు (నరసాపురం) గ్రామ మున్సబు గారు
- శ్రీ పోలిశెట్టి వెంకట సుబ్బారావు గారు, కొప్పర్రు (నరసాపురం) గ్రామ మున్సబు గారు
- శ్రీ పోలిశెట్టి రాదాకృష్ణ దాసు గారు, కొప్పర్రు (నరసాపురం) గ్రామ మున్సబు గారు
- శ్రీ పోలిశెట్టి సత్తిరాజు గారు, ఫేమస్ "తాపేశ్వరం కాజా" రూపశిల్పి, తాపేశ్వరం [8]
- శ్రీ పోలిశెట్టి సాంబమూర్తి నాయుడు గారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో అడిషనల్ సెక్రటరీగా చేసారు
- శ్రీ పోలిశెట్టి శేషావతారం గారు, స్వతంత్ర సమరయోధులు, కొప్పర్రు (నరసాపురం), యమ్.ఎల్.ఎ., 1967 - పాలకొల్లు
- శ్రీ పోలిశెట్టి వీర వెంకట సత్య నారాయణ మూర్తి గారు, దంగేరు జమీందారీ భూస్వాములు - "భట్టి విక్రమార్క" సినిమా నిర్మాత
- శ్రీ పోలిశెట్టి నవీన్, తెలుగు సినీ నటులు [9]
మూలాలు
మార్చు- పోలిశెట్టి వారి వంశ చరిత్ర
లింకులు
మార్చుశ్రీ పోలిశెట్టి వారి పూర్తి చరిత్ర [1] [2]
- ↑ name= పోలిశెట్టి వారి వంశ చరిత్ర
- ↑ name= పోలిశెట్టి వారి వంశ చరిత్ర
- ↑ name= పోలిశెట్టి వారి వంశ చరిత్ర
- ↑ name= పోలిశెట్టి వారి వంశ చరిత్ర
- ↑ name= పోలిశెట్టి వారి వంశ చరిత్ర
- ↑ https://archive.org/details/in.ernet.dli.2015.83815/page/n433/mode/1up?q=polisetti
- ↑ https://archive.org/details/estates-land-act-committee-landholders-statement-part-1/page/n1/mode/1up?q=polisetti
- ↑ పోలిశెట్టి సత్తిరాజు https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B6%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81
- ↑ నవీన్_పొలిశెట్టి https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%B5%E0%B1%80%E0%B0%A8%E0%B1%8D_%E0%B0%AA%E0%B1%8A%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B6%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF