భట్టి విక్రమార్క

తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం తాలూకాలోని దంగేరు జమీందారీ కుటుంబానికి చెందిన శ్రీ పోలిశెట్టి వీర వెంకట సత్య నారాయణ మూర్తి ఈ చిత్రమును తమ పి.వి.వి.ఎస్.ఎం. ప్రొడక్షన్స్ బ్యానరుపై 1960 సం..లో నిర్మించి ఆయన తల్లిదండ్రులు దంగేరు జమీందార్లు, భూస్వాములు, మల్లవరం ఎస్టేటుదార్లు అయిన శ్రీ పోలిశెట్టి వెంకటరత్నం నాయుడు, వెంకాయమ్మ దంపతులకు అంకితమిచ్చాడు. ఈ చిత్రము అప్పట్లో విజయవంతమై, మంచి పేరు తెచ్చుకుని శత దినోత్సవము జరుపుకున్నది.

భట్టి విక్రమార్క
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం జంపన చంద్రశేఖరరావు
నిర్మాణం పోలిశెట్టి వీర వెంకట సత్యనారాయణమూర్తి
కథ అనిసెట్టి సుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కాంతారావు,
అంజలీదేవి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది సత్యం, జిక్కి, ఎ.పి.కోమల
నృత్యాలు వెంపటి సత్యం,
పసుమర్తి కృష్ణమూర్తి
గీతరచన అనిసెట్టి సుబ్బారావు
సంభాషణలు అనిసెట్టి సుబ్బారావు
ఛాయాగ్రహణం ఆది ఇరానీ
కూర్పు ఎన్.ఎమ్.శంకర్
నిర్మాణ సంస్థ పి.వి.వి.ఎస్.ఎం. ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాత్రలు-పాత్రధారులు

మార్చు

పాటలు

మార్చు
  1. ఓ నెలరాజా, వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్ - ఘంటసాల, పి.సుశీల
  2. ఓ శైల సుతా మాతా పతి పదసేవ నిరతము నీవా - పి.సుశీల బృందం
  3. ఓ సుందరీ అందమె విందురా పొందురా - పి.సుశీల
  4. కన్నెపిల్ల సొగసు చూడు మహారాజ వన్నెలాడి నగవు నాది - జిక్కి
  5. కొమ్ములు తిరిగిన మగవారు కొంగు తగిలితే పోలేరు - జిక్కి
  6. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల . రచన: కాళిదాస్
  7. జాయిరే జంభారే ఒకసారి రావేమి సుందరీ - మాధవపెద్ది సత్యం, జిక్కి
  8. జై త్రిభువనైక రాజ రాజేంద్రా రాజేంద్రా జై.. జై జగజేగీయమాన - మాధవపద్ది సత్యం
  9. నటించనా జగాలనే జయించనా - పి.లీల, పి.సుశీల (రంభా ఊర్వశుల నృత్యగీతం)
  10. నినునమ్మి సేవించు మనుజుండు ధన్యుండు (పద్యం) - మాధవపెద్ది సత్యం
  11. మనసారా ప్రేమించినారా మరుకేళి కేళింపవేల - పి.సుశీల, ఎ.పి.కోమల
  12. శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
  13. సత్యామయా గురుడ నిత్యామయా, నిత్యామయా గురుడ సత్యామయా - మాధవపద్ది సత్యం
  14. వింతయైన విధి విలాసం ఇదేనా మనసంత చింతల - ఘంటసాల

మూలాలు

మార్చు