పోలిశెట్టి హనుమయ్యగుప్త

పోలిశెట్టి హనుమయ్యగుప్త, స్వాతంత్ర్య సమరయోధుడు, హేతువాది. భారత నాస్తిక సమాజంలో (1973-77) గౌరవాధ్యక్షుడు. ఇంగ్లాండులో బార్ ఎట్ లా చదివారు. గుంటూరు జిల్లాలో కులనిర్మూలన సభ జరిపారు. 1981లో చనిపోయారు.

1920లో కలకత్తా కాంగ్రేసు ప్రత్యేక సమావేశాల తర్వాత హనుమయ్యగుప్త, ఉన్నవ లక్ష్మీనారాయణ, గొల్లపూడి సీతారామశాస్త్రి తదితర న్యాయవాదులతో కలిసి గుంటూరు జిల్లా కోర్టులో తమ లాభదాయకమైన న్యాయవాద వృత్తి ప్రాక్టీసును విడిచిపెట్టి ప్రజాహిత కార్యక్రమాలకు తమ జీవితాన్ని అంకితం చేశారు. 1920 జనవరి 21న జరిగిన గుంటూరు బార్ అషోసియేషన్ సభలో కాంగ్రేసు పిలుపునిచ్చిన సహాయనిరాకరణోద్యమానికి మద్దతు 11 నెలలపాటు ప్రాక్టీసును ఆపివేయాలని 14మంది న్యాయవాదులు తీర్మానించారు. వారిలో హనుమయ్య గుప్త కూడా ఒకడు.[1]

హనుమయ్యగుప్త, కొండా వెంకటప్పయ్య ఆధ్వర్యంలో జరిగిన పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. నిరాకరణోద్యమం పతాకస్థాయిలో ఉన్న తరుణంలో 1921 జూలై 30న బాపట్లలో హనుమయ్య గుప్తను, కొండా వెంకటప్పయ్య, మద్ది వెంకటసుబ్బయ్య, చీమకుర్తి బసవయ్యలతో పాటు అరెస్టు చేసి జైలులో ఉంచారు.[2]

రచనలు

మార్చు
  • My studies in Ramayana (1968)
  • A Wounded Society
  • The Ramayana: A New Point of View

మూలాలు

మార్చు
  1. History Of Freedom Movement In Guntoor District 1921-47 Dr. B. SESHAGIRI RAO పేజీ.56 [1]
  2. [Congress and Classes: Nationalism, Workers, and Peasants By Kapil Kumar పేజీ.162 [2]