పౌరుష గ్రంథి

(పౌరుష గ్రంధులు నుండి దారిమార్పు చెందింది)

పౌరుష గ్రంథి (Prostate gland) శుక్రకోశ పీఠభాగంలో ఉంటుంది. ఇది ప్రసేకంలోకి అనేక నాళాల ద్వారా తెరచుకొంటుంది. ఇది స్రవించే క్షార పదార్థం శుక్రకణాలను ఉత్తేజితం చేస్తుంది. ఇది శుక్రద్రవంలో అధిక భాగాన్ని ఏర్పరుస్తుంది.

పౌరుష గ్రంథి
Male Anatomy
Prostate with seminal vesicles and seminal ducts, viewed from in front and above.
లాటిన్ prostata
గ్రే'స్ subject #263 1251
ధమని internal pudendal artery, inferior vesical artery, and middle rectal artery
సిర internal iliac vein
నాడి inferior hypogastric plexus
లింఫు external iliac lymph nodes, internal iliac lymph nodes
Precursor Endodermic evaginations of the urethra
MeSH Prostate
Dorlands/Elsevier p_36/12671161

విధులు

మార్చు

పౌరుష గ్రంధి ఒక విధమైన తెల్లని పాలవంటి ఆమ్లపు ద్రవాన్ని ఉత్పత్తిచేస్తుంది.[1] ఇది స్కలించబడే వీర్యంలో సుమారు 20–30% భాగం ఉండి శుక్రకణాలు, శుక్ర కోశాల నుండి స్రవించబడే ఇతర ద్రవాలతో కలిసియుంటుంది.[1] వీర్యంలోని శుక్రకోశాల ద్రవాల మూలంగా ఆమ్లత్వం క్షారంగా మారుతుంది. ఇది యోనిలోని ఆమ్లత్వాన్ని సమంగా చేసి శుక్రకణాల జీవితకాలాన్ని పొడిగిస్తాయి.[2] పౌరుష గ్రంధి రావాలు స్కలితంలో మొదటగా శుక్రకణాలతో కలిసి బయటికి వస్తాయి; ఈ శుక్రకణాలు ఎక్కువకాలం జీవిస్తాయి. ఈ గ్రంధి చుట్టూ వుండే కండరాలు వీర్యాన్ని బయటికి పంపించడానికి తోడ్పడతాయి.

స్రావాలు

మార్చు

పౌరుష గ్రంధి స్రావాలు వివిధ జాతుల్లో వేర్వేరుగా ఉంటాయి. ఇవి సాధారణంగా చక్కెరలను కలిగివుండి స్వల్పంగా ఆమ్లత్వాన్ని కలిగివుంటుంది. మానవులలో వీనిలో మాంసకృత్తులు 1% కన్నా తక్కువగా ఉంటాయి. వీనిలో ప్రోటియోలైటిక్ ఎంజైములు, ప్రోస్టేటిక్ ఆసిడ్ ఫాస్ఫటేజ్, ప్రోస్టేట్ స్పెసిఫిక్ ఆంటీజెన్లు ముఖ్యమైనవి. ఇవి కాకుండా జింకు రక్తంలో కన్నా 500–1,000 రెట్లు అధికంగా ఉంటుంది.

నియంత్రణ

మార్చు

పురుష లక్షణాలను కలిగించే పురుష సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరోన్ (testosterones) పౌరుష గ్రంధి సరిగా పనిచేయడానికి కీలకమైనది. ఈ హార్మోను ముఖ్యంగా వృషణాలలో తయారౌతుంది. కొంచెం అడ్రినల్ గ్రంధుల నుండి కూడా వస్తుంది.

స్త్రీల పౌరుష గ్రంధి

మార్చు

ప్రసేకానికి ఆనుకొని వుండే స్కీన్ గ్రంధి (Skene's gland) స్త్రీలలో పౌరుష గ్రంధికి సమజాతం (homologous) గా పేర్కొనేవారు. 2002 సంవత్సరంలో దీనిని అధికారికంగా ప్రకటించి స్త్రీల పౌరుష గ్రంధి (Female Prostate gland) గా గుర్తించారు.[3]

పురుషులలో వలెనే స్త్రీల పౌరుష గ్రంధి సంభోగ సమయంలో భావప్రాప్తి కలిగినప్పుడు స్కలించి స్రావాలు ఎక్కువగా బయటికి వస్తాయి. ఇది ప్రోస్టేట్ స్పెసిఫిక్ ఆంటీజెన్ (Prostate specific antigen/PSA) ను స్రవిస్తుంది. ఈ గ్రంధి యొక్క క్యాంసర్ లో దీని సాంద్రత పెరుగుతుంది.[4]

వ్యాధులు

మార్చు

పౌరుష గ్రంధి ఇంఫెక్షన్

మార్చు
 
Micrograph showing an inflamed prostate gland, the histologic correlate of prostatitis. A normal non-inflamed prostatic gland is seen on the left of the image. H&E stain.

ప్రొస్టేటైటిస్ (Prostatitis) అనగా పౌరుష గ్రంధి వాపు లేదా ఇంఫెక్షన్. ఇందులో నాలుగు వివిధ రూపాలు ఉన్నాయి. స్వల్పకాలిక ప్రోస్టెటైటిక్, బాక్టీరియల్ ప్రోస్టెటైటిస్ (category I and II) రెండు సూక్ష్మజీవనాశకాల వైద్యం ద్వారా నయం చేయవచ్చును. దీర్ఘకాలిక ప్రోస్టేటైటిస్ (category III) వలన కటిప్రాంతంలో నిప్పి చాలాకాలంగా బాధిస్తుంది. ఇది సుమారు 95% కేసులలో కనిపిస్తుంది,[5] [6]

పౌరుష గ్రంధి పెరగడం

మార్చు

పౌరుష గ్రంధి పెరగడం (Benign prostatic hyperplasia or BPH) ఎక్కువగా వృద్ధులలో కనిపిస్తుంది;[7] దీని మూలంగా మూత్రవిసర్జన కష్టం అవుతుంది. తద్వారా ఎక్కువసార్లు మూత్రం పోయడం కూడా జరుగుతుంది. బాగా పెరిగినప్పుడు ఇది ప్రసేకాన్ని పూర్తిగా మూసివేసి మూత్రం వెళ్లడం చాలా కష్టం లేదా అసాధ్యం అవుతుంది.

పెరిగిన పౌరుష గ్రంధిని మందుల వైద్యం ప్రయత్నించవచ్చును. కానీ ఎక్కువమందికి శస్త్రచికిత్స అవసరం అవుతుంది. ఇందులో సూది ద్వారా మైక్రోవేవ్ లను ఉపయోగించి చిన్న వేడిమితో కాల్చవచ్చును.[8]

శస్త్రచికిత్సలో ఈ గ్రంధిని తొలగించడం ప్రసేకం ద్వారా ఎండోస్కోప్ ద్వారా సుళువుగా చేయవచ్చును. దీనిని transurethral resection of the prostate TURP అంటారు. ఇందులో ప్రసేకం ద్వారా చిన్న పరికరాన్ని పంపి మూత్రానికి అడ్డం కలిగిస్తున్న భాగాన్ని తొలగిస్తారు. అయితే ఇందులో మధ్యభాగాన్ని మాత్రమే తొలగిస్తారు.

పౌరుష గ్రంధి క్యాంసర్

మార్చు
 
Micrograph showing normal prostatic glands and glands of prostate cancer (prostate adenocarcinoma) - right upper aspect of image. HPS stain. Prostate biopsy.

అభివృద్ధి చెందిన దేశాలలో పౌరుష గ్రంధి క్యాంసర్ (Prostate cancer) వృద్ధులలో అత్యధికంగా వచ్చే క్యాంసర్. దీని మూలంగా సుమారు 3% మంది మరణిస్తున్నట్లుగా అంచనా. దీనికి తొందరా గుర్తించడానికి మలద్వారం ద్వారా వేలితో పరీక్ష, రక్తంలో ప్రోస్టేట్ స్పెసిఫిక్ ఆంటీజెన్ కొలవడం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చాలా ఉపకరిస్తాయి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "CHEMICAL COMPOSITION OF HUMAN SEMEN AND OF THE SECRETIONS OF THE PROSTATE AND SEMINAL VESICLES". ajplegacy.physiology.org. Retrieved 2010-08-10.
  2. "SEMEN ANALYSIS". www.umc.sunysb.edu. Retrieved 2009-04-28.
  3. Flam, Faye (2006-03-15). "The Seattle Times: Health: Gee, women have ... a prostate?". seattletimes.nwsource.com. Retrieved 2009-04-28.
  4. Kratochvíl S (1994). "[Orgasmic expulsions in women]". Česk Psychiatr (in Czech). 90 (2): 71–7. PMID 8004685.{{cite journal}}: CS1 maint: unrecognized language (link)
  5. "Video post-op interviews with prostatitis surgery patients". Archived from the original on 2019-12-12.
  6. "Pharmacological treatment options for prostatitis/chronic pelvic pain syndrome". 2006. Archived from the original on 2006-10-18. Retrieved 2006-12-11.
  7. Verhamme KM; Dieleman JP; Bleumink GS (2002). "Incidence and prevalence of lower urinary tract symptoms suggestive of benign prostatic hyperplasia in primary care--the Triumph project". Eur. Urol. 42 (4): 323–8. doi:10.1016/S0302-2838(02)00354-8. PMID 12361895.
  8. Christensen, TL; Andriole, GL (February 2009). "Benign Prostatic Hyperplasia: Current Treatment Strategies". Consultant. 49 (2).{{cite journal}}: CS1 maint: date and year (link)

బయటి లింకులు

మార్చు