ప్రకాష్ మెహతా (జననం 22 ఏప్రిల్ 1959) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పార్లమెంటరీ వ్యవహారాల, పరిశ్రమలు & మైనింగ్, గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేశాడు.

ప్రకాష్ మెహతా
ప్రకాష్ మెహతా


పదవీ కాలం
2014 డిసెంబర్ 5 – 2019 జూన్ 16
తరువాత రాధాకృష్ణ విఖే పాటిల్

పదవీ కాలం
2014 అక్టోబర్ 31 – 2014 డిసెంబర్ 5
తరువాత సుభాష్ దేశాయ్

పదవీ కాలం
2014 అక్టోబర్ 31 – 2014 డిసెంబర్ 5
తరువాత గిరీష్ బాపట్

పదవీ కాలం
2009 – 2019
తరువాత పరాగ్ షా
నియోజకవర్గం ఘట్కోపర్ తూర్పు
పదవీ కాలం
1990 – 2009
నియోజకవర్గం ఘట్కోపర్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-04-22) 1959 ఏప్రిల్ 22 (వయసు 65)
బొంబాయి , బొంబాయి రాష్ట్రం , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి కిషోరి మెహతా
సంతానం అభిషేక్, హర్ష్ మెహతా
నివాసం ముంబై
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

ప్రకాష్ మెహతా భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1990 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఘట్కోపర్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత వరుసగా 1995, 1999, 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఘట్కోపర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన శాసనసభ నియోజకవర్గాల పూర్ణవిభజనలో భాగంగా ఘట్కోపర్ శాసనసభ నియోజకవర్గం రద్దు కావడంతో నూతనంగా ఏర్పాటైన ఘట్కోపర్ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి 2009, 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై[1][2] 2014 డిసెంబర్ 5 నుండి 2019 జూన్ 16 వరకు పార్లమెంటరీ వ్యవహారాల, పరిశ్రమలు & మైనింగ్, గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేశాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  2. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  3. "Maharashtra: Chief Minister Devendra Fadnavis allots cabinet portfolios, keeps Home, Housing, Health with himself" (in ఇంగ్లీష్). DNA India. 2 November 2014. Archived from the original on 27 December 2024. Retrieved 27 December 2024.
  4. "Prakash Mehta is the new Industry, mines, parliamentary affairs minister in Maharashtra". deshgujarat.com. 2 November 2014. Retrieved 20 December 2016.