ప్రజాసాహితి
కేవలం సాహిత్య ప్రయోజనాన్ని అన్ని కోణాల్లోనూ నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్న తెలుగు పత్రికల్లో ఒక పత్రిక “ప్రజాసాహితి”. రంగనాయకమ్మ ప్రారంభించిన ఈ పత్రికను కొన్నేళ్ల తరువాత జనసాహితి సాహిత్య సంస్థకు అప్పగించిన తరువాత కొత్తపల్లి రవిబాబు ప్రధాన సంపాదకులుగా పత్రికను నడుపుతున్నారు. పి. ఎస్. నాగరాజు సంపాదకులుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. అమరులు నిర్మలానంద ఈ పత్రికకు గౌరవ సంపాదకుడిగా వ్యవరించారు. సాధారణంగా ఉద్యమ కృషిలో కొనసాగే పత్రికలు నిరాటంకంగా రావడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. వాటినన్నింటిని అధిగమిస్తూ గత 32 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి సంచికా ఆ నెల మొదటివారంలోనే పాఠకునికి అందజేయడం ఈ పత్రిక సాధించిన ఒక విజయం. [1]
రకం | మాసపత్రిక |
---|---|
సంపాదకులు | కొత్తపల్లి రవిబాబు 9490196890 |
స్థాపించినది | 1977 విజయవాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా |
కేంద్రం | విజయవాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా |
ISSN | 0971-278X |
జాలస్థలి | http://prajaasaahithi.com |
ఈ పత్రిక మరో విశేషమైన విషయమేమిటంటే కనీసం ప్రతి మూడు నెలలకొకసారైనా ఒక ప్రత్యేక సంచికను సమగ్రంగా తీసుకురావడం. ప్రపంచంలో ఎక్కడెక్కడి దేశాల్లో వస్తున్న ప్రగతిశీల, అభ్యుదయ, విప్లవ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్న పత్రికగా “ప్రజాసాహితి”కున్న ఖ్యాతినికూడా పేర్కొనితీరాలి. కథ, కవిత, వ్యాసం, సీరియల్, బాల సాహిత్యం, పుస్తక సమీక్షలు, చర్చలు, ఇలా ఒకటేమిటి సమస్త సాహిత్య ప్రక్రియల్లోనూ రచనలు మనకిందులో పలకరిస్తాయి. మన ఆలోచనను పెంచుతాయి. ఒక మాటలో చెప్పాలంటే సాహిత్య ప్రయోజనాన్ని నెరవేరుస్తాయి.
ఈ పత్రిక సంవత్సర చందా 200/- రూపాయలు.
- చిరునామా: ప్రజాసాహితి, 30-7-6 అన్నదాన సమాజం రోద్ దుర్గా అగ్రహారం విజయవాడ – 2. ISSN 0971-278X
మూలాలు
మార్చు- ↑ "మీరు చదివారా? బ్లాగులో ప్రజాసాహితి పత్రిక పరిచయం". Archived from the original on 2010-07-14. Retrieved 2010-07-02.
బయటి లంకెలు
మార్చు