ప్రణితి షిండే
ప్రణితి సుశీల్ కుమార్ షిండే (జననం 1980 డిసెంబరు 9) మహారాష్ట్రకు చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు.[1] ఆమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యురాలు, షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎన్నికైన మహారాష్ట్ర శాసనసభ సభ్యురాలు.[2] ఆమె 2021 నుండి మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా.[3] అలాగే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్క్రీనింగ్ కమిటీ సభ్యురాలుగా వ్యవహరించింది.[4]
ప్రణితి సుశీల్ కుమార్ షిండే | |
---|---|
మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ | |
Assumed office 2009 - ప్రస్తుతం | |
నియోజకవర్గం | షోలాపూర్ సిటీ సెంట్రల్ |
మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ | |
Assumed office 2021 | |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు | నానా పటోలే |
చైర్‌పర్సన్- మహారాష్ట్ర లెజిస్లేచర్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ | |
Assumed office 2021 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1980 డిసెంబరు 9 |
జాతీయత | భారతీయురాలు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
తల్లిదండ్రులు | సుశీల్ కుమార్ షిండే (తండ్రి) ఉజ్వల షిండే (తల్లి) |
కళాశాల | సెయింట్. జేవియర్స్ కాలేజ్, ముంబై, ప్రభుత్వ న్యాయ కళాశాల, ముంబై |
నైపుణ్యం | రాజకీయ నాయకురాలు, సామాజిక కార్యకర్త |
As of అక్టోబరు 11, 2022 Source: [1] |
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకుగాను ఆమె కాంగ్రెస్ తరుపున జుక్కల్ నియోజకవర్గానికి అదనపు పరిశీలకురాలిగా వ్యవహరించింది.[5]
ప్రారంభ జీవితం
మార్చుప్రణితి షిండే 1980 డిసెంబరు 9న సుశీల్‌కుమార్ షిండే, ఉజ్వల షిండే దంపతులకు చిన్న కూతురుగా జన్మించింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు.[6] సుశీల్ కుమార్ షిండే. గతంలో కేంద్ర హోం శాఖ మంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా కూడా చేశాడు. ఆమె ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[7]
ఆమె తన ప్రభుత్వేతర సంస్థ (NGO) జైజుయ్ ద్వారా ప్రజలకు సహాయం చేస్తున్న సామాజిక కార్యకర్త.[8] అంతేకాకుండా, తన తండ్రి సుశీల్ కుమార్ షిండే రాజకీయాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రణితి షిండే రాజకీయ వారసురాలుగా పగ్గాలు అందుకుంది.
మూలాలు
మార్చు- ↑ "Praniti Sushilkumar Shinde". Retrieved 2022-10-11.
- ↑ News18 (24 October 2019). "Praniti Shinde in Solapur City Central Election Results 2019: Praniti Shinde of Congress Wins" (in ఇంగ్లీష్). Archived from the original on 25 October 2023. Retrieved 25 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Maharashtra: Sushil Kumar Shinde' daughter appointed Congress' executive president".
- ↑ "Cong forms screening panels for TN, WB, Kerala and Puducherry polls".
- ↑ "AICC: తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనపు పరిశీలకులను నియమించిన కాంగ్రెస్ పార్టీ | aicc appointed additional assembly observers for telangana". web.archive.org. 2023-12-10. Archived from the original on 2023-12-10. Retrieved 2023-12-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Detailed Profile – Shri. Sushil Kumar Sambhajirao Shinde – Members of Parliament (Lok Sabha) – Who's Who". Government: National Portal of India. Retrieved 9 January 2014.
- ↑ Indian Express -"Father's daughter graduates from St. Xavier's to Solapur".
- ↑ "She's like your younger sister". The New Indian Express. Retrieved 2021-06-17.