ప్రతాప్ సింఘ్ కైరాన్
ప్రతాప్ సింఘ్ కైరాన్ (1901-1965) పంజాబ్ ప్రావిన్సు (బ్రిటిష్ పాలనలోని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ సంఘటిత ప్రాంతం) ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఆయన స్వతంత్రానంతరం పంజాబ్ ప్రావిన్సు నిర్మాణరూపకర్తగా అపారమైన అనుభవం గడించాడు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం రెండు మార్లు ఖైదు చేసింది. ఒకసారి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అభిప్రాయప్రకటన చేసినందుకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. ఆయన రాజకీయ ప్రభావం, పరిశీలన, వ్యూహాలు ఇప్పటికీ పంజాబ్ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి.
ప్రతాప్ సింఘ్ కైరాన్ | |
---|---|
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1 అక్టోబర్ 1901 |
బాల్యం
మార్చుప్రతాప్ సింఘ్ కరీం 1901లో ఒక సిక్కు కుటుంబంలో జన్మించాడు. ఆయన పేరులో ఆయన స్వగ్రామం కైరాన్ (అమృత్సర్ జిల్లా; పంజాబ్ ప్రావిన్స్ ; బ్రిటిష్ శకం) చోటు చేసుకుంది. [1] ఆయన తండ్రి పేరు నిహాల్ సింఘ్ కైరాన్. నిహాల్ సింఘ్ కైరాన్ పంజాబ్ ప్రావిన్సు మహిళల విద్యావిధానం ఆరంభించి అభివృద్ధికి కృషిచేసాడు. ప్రతాప్ డెహ్రాడూన్ లోని కోల్. బ్రౌన్ కేంబ్రిడ్జ్ స్కూల్, కల్సా కాలేజ్; అమృతసర్‌లలో విద్యను అభ్యసించాడు. అక్కడ ఆయన తోటలు, ఫ్యాక్టరీలలో పనిచేస్తూ మిషిగన్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ అందుకున్నాడు. బర్కిలీ లోని కాలిఫోర్నియా మిషిగన్ వెళ్ళే ముందు ఆయన విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ మాస్టర్ డిగ్రీ అందుకున్నాడు. ఆయన యు.ఎస్. టోటపని విధానంతో ప్రేరణపొంది తరువాత వాటిని ఇండియాలో కూడా పరిచయం చేసాడు.
కుటుంబం
మార్చుప్రతాప్ సింఘ్ కైరాన్‌కు సురేందర్ సింఘ్, సర్బ్రిందర్ కైరాన్, గురీందర్ సింఘ్ అనే కుమారులు ఉన్నారు. చిన్నకుమారుడైన గురీందర్ సింఘ్ తన తండ్రిలా కాంగ్రెస్ సభ్యుడుగా పనిచేసాడు. సురీందర్ తరువాత శిరోమణి అకాలీ దళ్‌లో సభ్యుడయ్యాడు. సురీందర్ కుమారుడు ఆదేశ్ ప్రతాప్ సింఘ్ కైరాన్ ప్రకాష్ సింఘ్ కైరాన్ ప్రణీత్ కౌర్‌ల కుమార్తెను వివాహం చేసుకున్నాడు.[2][3]
రాజకీయ ప్రవేశం
మార్చుకైరాన్ 1929లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. 1932 ఏప్రిల్ 13న ఆయన అమృతసర్‌లో " ది న్యూ ఎరా " పేరుతో ఆగ్ల వార్తాపత్రికను ఆరంభించాడు. ఆయన రాజకీయాలలో ప్రవేశించిన తరువాత వార్తాపత్రిక ప్రచురణ నిలిపివేయబడింది. ఆయన ముందు సిరోమణి అకాలీదళ్ సభ్యత్వం తీసుకున్నాడు. తరువాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నాడు. ఆయన 1932లో సివిల్ డిస్ ఒబీడియంస్‌లో పాల్గొని జైలు దండన అనుభవించాడు. 1937లో కాంగ్రెస్ సభ్యుడు బాబాగురుదిత్ సింఘ్‌ను (సథాలీ) ఓడించి అకాలీ సభ్యుడుగా పజాబ్ అసెంబ్లీలో ప్రవేశించాడు. 1941 నుండి 1946 వరకు పంజాబ్ ప్రొవింస్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీగా పనిచేసాడు. 1942 లో క్విట్ ఇండియా ఉద్యంలో పాల్గొని ఆయన తిరిగి జైలు దండన అనుభవించాడు. 1946లో అసెంబ్లీకి ఎన్నికచేయబడ్డాడు.
అధికారం
మార్చు1947లో స్వతంత్రం లభించిన తరువాత ప్రతాప్ సింఘ్ కైరాన్ పలు అధికార పదవులు చేపట్టారు. రీహాబిలిటేషన్ మినిస్టర్, డెవెలెప్మెంట్ మినిస్టర్ (1947-1949), ముఖ్యమంత్రి (1956 జనవరి 21 నుండి 1964 జూన్ 23) పదవులు వహించాడు.
పునరావాస మంత్రిత్వశాఖ
మార్చుభారతదేశ విభజన తరువాత రీహాబిలిటేషన్ మంత్రిగా కైరాన్ పశ్చిమ పంజాబ్ నుండి వలస వచ్చిన మిలియన్లకొద్దీ శరణార్ధులకు పునరావాసం కల్పించడానికి కృషిచేసాడు. అతి కొద్ది సమయంలో దాదాపు మూడు మిలియన్ల ప్రజలకు తూర్పు పంజాబులో పునరావాసం కల్పించబడి నూతన ఉపాధి సౌకర్యం అందించబడింది.
ముఖ్యమంత్రి
మార్చుప్రతాప్ సింఘ్ కైరాన్ దార్శనికుడు. భూసంస్కరణలో ఆయన ప్రధానపాత్ర వహించాడు. పంజాబును సుసంపన్నం చేయడంలో ఆయనపాత్ర ప్రధానమైనది.ఆయన పంజాబు అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయ స్థాపన చేసాడు. ఈ విశ్వవిద్యాలయం పంజాబులో హరితవిప్లవం తీసుకురావడంలో ప్రధానపాత్ర వహించింది. ఆయన పంజాబ్ పారిశ్రమీకరణకు అత్యధికంగా కృషి చేసాడు. చండీగఢ్ నగర రూపకల్పనకు, ఫరీదాబాద్ పారిశ్రామిక వాడ (ప్రస్తుత హర్యానా) ఏర్పాటుకు కృషి చేసాడు. కైరాన్ నిర్భంధ ప్రాథమిక, మాద్యమిక విద్యను ఉచితంగా అందించాడు. ఆయన మూడు ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించి జిల్లాకొక పాలిటెక్నిక్ ఇంస్టిట్యూట్ ఏర్పాటు చేయించాడు. నీటిపారుదల మౌలిక సౌకర్యాల నిర్మాణం, విద్యుదీకరణ, రహదారి నిర్మాణం ఆయన ప్రధాన పాత్ర వహించాడు. ఆయన లచం సంబంధిత నేరారోపణను ఎదుర్కొన్నాడు.[4]
మరణం
మార్చు1964 లో ఆయన రాజకీయ సలహాదారులు ఆయనను పలు ఆరోపణల నుండి విడిపించిన తరువాత ఆయన పంజాబు ముఖ్యమంత్రిగా తన పదవికి రాజీనామా చేసాడు. 1965 ఫిబ్రవరి 6న ఆయన రహదారిలో కారులో ప్రయాణిస్తున్న తరుణంలో ఆయనను సుచా సింఘ్ బస్సి కాల్చివేసాడు. మరణిచే సమయంలో ఆయన ఢిల్లీ నుండి అమృతసర్‌కు ప్రయాణం చేస్తున్నాడు. కారు రసోయి గ్రామసమీపానికి చేరుకున్న సమయంలో మరణం సంభవించింది. సుచా సింఘ్ తరువత ఉరితీయబడ్డాడు. [5]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ మూస:Cite bgook
- ↑ "Former Chief Minister Punjab Partap Singh Kairon's killer set free". India Today. 31 August 1994. Retrieved 28 December 2013.
- ↑ "Kairons' sibling rivalry drags on". Financial Express. 8 February 1999. Retrieved 28 December 2013.
- ↑ http://www.newindianexpress.com/cities/chennai/article227936.ece[permanent dead link]
- ↑ "Biography of the legendary Sikh leader". Archived from the original on 2016-03-03. Retrieved 2016-07-22.
బాహ్య లింకులు
మార్చు- Partap Singh Kairon materials in the South Asian American Digital Archive (SAADA)[permanent dead link]