ప్రతిభా ప్రహ్లాద్

ప్రతిభా ప్రహ్లాద్ (జ. 1962) ఒక భరతనాట్య కళాకారిణి, నాట్య గురువు, నృత్య దర్శకురాలు, రచయిత్రి.

ప్రతిభా ప్రహ్లాద్

వ్యక్తిగత జీవితం మార్చు

ఈమె 1969, జనవరి 29వ తేదీన మైసూరులో జన్మించింది. ఈమె తన 4వ యేటి నుండే నాట్యం పట్ల ఆసక్తిని పెంచుకుంది. ఈమె స్కూలు, కాలేజీ చదువులన్నింటిలో మొదటి స్థానంలో ఉంటూ నాట్యం పట్ల తన ఆసక్తిని కొనసాగించింది. ఈమె నాలుగు నుండి ఎనిమిది సంవత్సరాల వయసు వరకు తమ ఇంటి ప్రక్కన ఉన్న డాన్స్ స్కూలులో నాట్యం నేర్చుకుంది.[1] నాట్యం పట్ల ఈమెకున్న అభిరుచిని గమనించి ఈమె తల్లిదండ్రులు ఈమెకు యు.ఎస్.కృష్ణారావు, [2] కళానిధి నారాయణన్, వి.ఎస్.ముత్తుస్వామి పిళ్ళైల వద్ద భరతనాట్యం, వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యాన్ని నేర్పించారు. ఈమెకు 20 సంవత్సరాల వయసు వచ్చే సరికి ఈమె నర్తకిగా తన ప్రతిభను చాటుకుంది. ఈమె మన దేశంతో పాటుగా 50కి పైగా విదేశాలలో తన నృత్యప్రదర్శన గావించింది.[3]

ఈమె మాస్ కమ్యూనికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉంది. ఈమె అనేక పత్రికలలో వ్యాసాలను ప్రచురించింది. టెలివిజన్ సీరియళ్ళలో నటించి, దర్శకత్వం వహించి, నిర్మించింది. నాట్యానికి సంబంధించిన పుస్తకాలను రచించింది. భరతనాట్యం గురించి ఈమె వ్రాసిన పుస్తకం ప్రచురించిన సంవత్సరం నుండి వరుసగా పది సంవత్సరాల వరకు అమెజాన్‌లో అమ్మకాలలో రెండవస్థానాన్ని పొందింది. ఆ పుస్తకం అనేక పునర్ముద్రణలను పొందింది.ఈమె మంచి వక్తగా అనేక విద్యా సంస్థలలో ప్రసంగాలను చేసింది.[4]

వృత్తి మార్చు

ఈమె ప్రసిద్ధ ఫౌండేషన్, ఫోరమ్‌ ఫర్ ఆర్ట్ బియాండ్ బార్డర్స్ అనే రెండు సంస్థలను స్థాపించింది. [5][6] ఈమె ప్రసిద్ధ డ్యాన్స్ రిపర్టరీకి ఆర్టిస్టిక్ డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా సేవలందించింది.[7] ఈమె ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫెస్టివల్‌కు వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేసింది.[8][9] ఈమె అనేక ప్రభుత్వ సాంస్కృతిక కమిటీలలో పనిచేసింది. 2010 కామన్‌వెల్త్ క్రీడల సాంస్కృతిక కమిటీకి కన్వీనర్‌గా ఆ క్రీడల ప్రారంభ, ముగింపు ఉత్సవాలను నిర్వహించింది.[10]

భారత తపాలాశాఖ ఈమెపై ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది.[11]

పురస్కారాలు, బిరుదులు మార్చు

ఈమె అనేక అవార్డులను బిరుదులను అందుకున్నది. 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. 2001లో సంగీత నాటక అకాడమీ అవార్డును స్వీకరించింది. ఈ అవార్డును పొందిన వారిలో ఈమె అతి పిన్న వయస్కురాలు. 2001లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అవార్డును, 1997లో కర్ణాటక సంగీత నృత్య అకాడమీ అవార్డును అందుకున్నది.[12][13] ఇవే కాక ఈ క్రింది పురస్కారాలను ఈమె స్వీకరించింది.

  • 2001లో ఆలిండియా నేషనల్ యూనిటీ కాన్ఫరెన్స్, న్యూఢిల్లీ వారిచే'ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డు'
  • 2001లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్, బెంగళూరు వారిచే 'కళాశిరోమణి పురస్కారం'
  • 1997లో కర్ణాటక సంగీత నృత్య అకాడమీ వారి 'కర్ణాటక కళాశ్రీ'
  • 1995లో శిరోమణి ఫౌండేషన్ వారిచే 'మహిళా శిరోమణి' అవార్డు.
  • 1995లో శ్రీ షణ్ముఖం శ్రీ విరూపాక్ష విద్యారణ్య మహాపీఠం, హంపి వారిచే'నాట్యభారతి'
  • 1991లో ఒరిస్సా సినీ క్రిటిక్స్, భువనేశ్వర్ వారిచే 'ఉత్తమ నర్తకి ' అవార్డు
  • 1987లో సుర్ సింగార్ సంసద్, బాంబే వారిచె3అ 'శృంగారమణి'
  • 2000లో బెంగళూర్ బజ్.కామ్‌ నిర్వహించిన ఇంటర్నెట్ పోల్‌లో 'బెంగళూర్స్ వుమెన్ ఆఫ్ ది డికేడ్' అవార్డు.

మూలాలు మార్చు

  1. "The unmatched Prathibha". Afternoon Voice.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Profile - U S Krishna Rao (1912 – 2005)". narthaki.com. Retrieved 2021-03-28.
  3. Kumar, Ranee (2018-11-29). "DIAF: A melange of cultures". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-03-28.
  4. Prahlad, Pratibha. "Smt. Prathibha Prahlad Personal Profile" (PDF). Archived from the original (PDF) on 2021-04-27. Retrieved 2021-04-27.
  5. "Prasiddha Foundation | Prathibha Prahlad". www.prathibhaprahlad.net. Archived from the original on 2021-08-04. Retrieved 2021-03-28.
  6. "Forum For Art Beyond Borders Trust In New Delhi Delhi New Delhi - NGO Foundation". www.ngofoundation.in. Retrieved 2021-03-28.
  7. "South Indian Dance Troupe Led by Padmashri Prathibha Prahlad Performs at CEU | Central European University". www.ceu.edu. Retrieved 2021-03-28.
  8. "DIAF". www.diaf.in. Archived from the original on 2021-04-27. Retrieved 2021-03-28.
  9. Kumar, Ranee (2018-11-29). "DIAF: A melange of cultures". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-03-28.
  10. Prahlad, Pratibha. "Smt. Prathibha Prahlad" (PDF). diaf.in. Archived from the original (PDF) on 2021-04-27. Retrieved 2021-04-27.
  11. "Prathibha Prahlad". Edubilla.com (in ఇంగ్లీష్). Retrieved 2021-03-28.
  12. "Overview | Prathibha Prahlad". www.prathibhaprahlad.net. Archived from the original on 2021-08-04. Retrieved 2021-03-28.
  13. "Making India a cultural power". Governance Now (in ఇంగ్లీష్). 2016-05-14. Retrieved 2021-03-28.