వి.ఎస్.ముత్తుస్వామి పిళ్ళై

వైదీశ్వరన్‌కోయిల్ సేతురామన్ ముత్తుస్వామి పిళ్ళై (1921 – 1992) ఒక భరతనాట్య గురువు.

వి.ఎస్.ముత్తుస్వామి పిళ్ళై
జననం(1921-10-24)1921 అక్టోబరు 24
మరణం1992 జనవరి 18(1992-01-18) (వయసు 70)
వృత్తినృత్య దర్శకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భరతనాట్యం
జీవిత భాగస్వామివలంబాళ్
పిల్లలుఎం.తైయనయాగి,
ఎం.బాలు,
ఎం.చారుబాల,
ఎం.సెల్వం,
ఎం.ఆరుముగం,
ఎం.విజయలక్ష్మి,
ఎం.గీత,
ఎం.సంబంధం,
ఎం.నిర్మల
పురస్కారాలుకళైమామణి,
సంగీత నాటక అకాడమీ అవార్డు

ఆరంభజీవితం మార్చు

ఇతడు 1921, అక్టోబరు 24వ తేదీన ఒక సంగీతకారుల, నృత్యకళాకారుల కుటుంబంలో జన్మించాడు. ఇతని 5వ సంవత్సరంలో తల్లి సేతురాము మరణించింది. దానితో ఇతడిని నట్టువనార్ వైదీశ్వరకోయిల్ మీనాక్షిసుందరం దత్తత తీసుకున్నాడు. బాల్యంలో ఇతడు వైదీశ్వరకోయిల్ మీనాక్షిసుందరం విద్యార్థులకు భరతనాట్యం నేర్పించడం నిశితంగా గమనించి నాట్యం పట్ల మక్కువ పెంచుకున్నాడు. అలాగే కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నాడు. తన పెంపుడు తండ్రితో పాటు దేవస్థానంలో పాటలు పాడటం, శ్లోకాల వల్లించడం, తాళం వేయడం వంటివి చేసేవాడు. కొన్నిసార్లు దేవదాసీ నృత్యాలకు నట్టువాంగం చేసేవాడు.[1]

ఇతడు తన 15వ యేట తన పెంపుడు తల్లిదండ్రులతో మద్రాసుకు మకాం మార్చాడు. అయితే తన చెల్లెలు ముత్తులక్ష్మి మరణానంతరం ఇతడు మాయవరంలో స్థిరపడి కట్టుమన్నార్ కోయిల్ ముత్తుకుమారపిళ్ళై వద్ద గురుకుల పద్ధతిలో భరతనాట్యం అభ్యసించాడు.[2]

వృత్తి మార్చు

ఇతడు వలంబాళ్‌ను వివాహం చేసుకున్న తరువాత మద్రాసులో సినిమా దర్శకుడు కె.సుబ్రహ్మణ్యం నడుపుతున్న నాట్యకళాశాల నృత్యోదయలో నాట్యాచార్యునిగా చేరాడు. "నాట్య కళాసేవ" అనే సంస్థ ద్వారా నాట్యప్రదర్శనలు ఇచ్చాడు. అక్కడ ఇతనికి వివిధ శాస్త్రీయ నృత్యాలతో పరిచయం కలిగి వాటిని నృత్యనాటికలలో ప్రయోగాలు చేశాడు.[3]

వళువూర్ బి. రామయ్య పిళ్ళై, వైదీశ్వరకోయిల్ మీనాక్షిసుందరం పిళ్ళై వంటి నట్టువనార్ల వలె ఇతడు కూడా సినిమా రంగంలో స్థిరపడ్డాడు. 1938 నుండి 1964 వరకు ఇతడు తమిళ, తెలుగు, మలయాళ, హిందీ సినిమాలలో నృత్యదర్శకుడిగా పనిచేశాడు. ఇతడు 30కిపైగా సినిమాలకు నృత్యదర్శకుడిగా పనిచేశాడు. [4]

సినిమా రంగంలో భరతనాట్య కొరియోగ్రాఫర్ల అవకాశాలు సన్నగిల్లాక ఇతడు ఆ రంగం నుండి విరమించాల్సి వచ్చింది. కుటుంబాన్ని ఒక గ్రామంలో ఉంచి ఇతడు మైలాపూర్‌లో ఒక చిన్న ఇంట్లో ఉంటూ తన కళపట్ల దృష్టిని నిలిపాడు.[5] ఇతడు 1970, 80లలో ఐరోపా నుండి భరతనాట్యం నేర్చుకోవడానికి వచ్చిన విదేశీ విద్యార్థులకు ముఖ్యంగా ఫ్రెంచి వారికి నాట్యాన్ని నేర్పించాడు. వారిలో చాలామంది ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నుండి, ఫ్రెంచి ప్రభుత్వం నుండి ఉపకారవేతనం పొందినవారు. వీరిలో చాలామందికి మేనక, శకుంతల, మైత్రేయి, పద్మావతి, కుంతి, కల్పన వంటి భారతీయ పేర్లు పెట్టబడి వారు తమ దేశానికి వెళ్ళిన తర్వాత కూడా అదే పేర్లతో కొనసాగుతున్నారు. కొంతమంది టిజినియా లూసీ, ఎలిజబెత్ పెటిట్, అర్మెల్లె చోక్వార్డ్, డామినిక్ డెలోర్ం వంటి తమ అసలైన పేర్లతోనే చెలామణి అయ్యారు.[6]

విదేశీ శిష్యులే కాక ఇతని వద్ద అనేక మంది భారతీయులు కూడా భరతనాట్యం నేర్చుకున్నారు. వారిలో సాయి - సుబ్బులక్ష్మి, ప్రతిభా ప్రహ్లాద్, జయలలిత మొదలైన వారున్నారు.

అవార్డులు మార్చు

మూలాలు మార్చు

  1. Vijayaraghavan 2011, pp. 14–15.
  2. Vijayaraghavan 2011, pp. 16–17.
  3. Vijayaraghavan 2011, pp. 17–18.
  4. Vijayaraghavan 2011, p. 18.
  5. Vijayaraghavan 2011, pp. 19–20.
  6. Vijayaraghavan 2011, pp. 21–22.

ఆధారాలు మార్చు

  • Vijayaraghavan, Sujatha (April 2011). "A marvel of tradition and talent". Sruti. No. 319.
  • "V. S. Muthuswamy Pillai". Sangeet Natak Akademi.[permanent dead link]
  • Venkataraman, Leela (February 1990). "Spotlight on Traditional Gurus". Sruti. No. 65.
  • National Seminar on Bharatanatyam Dance Traditions (1989): Muthuswamy Pillai (4 DVD set). The Sruti Foundation.
  • Venkataraman, Leela (2011-02-03). "In the guru's mould". The Hindu.
  • "The last disciple: An interview with Dominique Delorme". March 2011. Archived from the original on 2021-04-16. Retrieved 2021-04-16.
  • Srikanth, Rupa (2018-12-20). "Bragha Bessell looks back on her dance journey". The Hindu.
  • "Video of a Bharatanatyam recital by Caroline, Dominique Delorme, Patricia (Padmavati) conducted by Muthuswamy Pillai". National Cultural Audiovisual Archives.