ప్రత్యూష
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ప్రత్యూష (1993ఆగస్టు 29 – 2002 ఫిబ్రవరి 23) ఒక సినీ నటి. ఐదు తెలుగు తెలుగు, పన్నెండు తమిళ సినిమాల్లో నటించింది. రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని మొదలైన సినిమాల్లో గుర్తించదగ్గ పాత్రల్లో నటించింది. ఇంకా అనేక టివి ధారావాహిక కార్యక్రమాల్లో నటించింది.
ప్రత్యూష | |
---|---|
జననం | 29 ఆగస్టు 1993 |
మరణం | 2002 ఫిబ్రవరి 23 | (వయసు 20)
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1998 – 2002 |
తల్లిదండ్రులు |
|
ఆమె తన స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి కలిసి కోకోకోలాలో విషం కలుపుకుని తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. సిద్దార్థ రెడ్డి మాత్రం బతికాడు. ఈ వార్త అన్ని ప్రముఖ దినపత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది.[2]
జీవితం
మార్చుప్రత్యూష నల్గొండ జిల్లా, భువనగిరిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి ఆమె చిన్నప్పుడే మరణించాడు. హోటల్ మేనేజ్మెంట్ చదివింది. మోడల్ గా ఉత్తమ స్మైల్ విభాగంలో అవార్డును పొందింది. 17 ఏళ్ళ వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశించింది. ఆమె తల్లి సరోజినీ దేవి ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. ఆమె సోదరుడు ప్రణీత్ చంద్ర సినిమాల్లో హీరోగా ప్రయత్నిస్తున్నాడు.
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష |
---|---|---|---|
1998 | రాయుడు | తెలుగు | |
1999 | శ్రీరాములయ్య | తెలుగు | |
1999 | సముద్రం | చంటి | తెలుగు |
2000 | మనునీధి | పూంగొడి | తమిళం |
2001 | ఇది ఏమి ఊరురా బాబు | తెలుగు | |
సూపర్ కుడుంబం | అభిరామి | తమిళం | |
స్నేహమంటే ఇదేరా | అమృత | తెలుగు | |
పొన్నాన్న నేరం | తమిళం | ||
థవసి | నందిని | తమిళం | |
కాదల్ పూక్కల్ | ఉప్పిలి | తమిళం | |
2002 | కలుసుకోవాలని | మాధవి | తెలుగు |
2004 | సౌండ్ పార్టీ | నందిని | తమిళం |
మరణం
మార్చుప్రత్యూష 2002 ఫిబ్రవరి 23 న తమ వివాహాన్ని పెద్దలు అంగీకరించడం లేదని తన స్నేహితుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంది. అదే రోజు హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సిద్దార్ధ రెడ్డి మాత్రం చావును తప్పించుకున్నాడు[3]
మూలాలు
మార్చు- ↑ Sakshi (7 December 2019). "నా కూతురి కేసులో అసలు తీర్పే రాలేదు". Archived from the original on 19 జూలై 2021. Retrieved 19 July 2021.
- ↑ Feb 25, TNN /; 2002; Ist, 01:53. "Love-struck actress commits suicide | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-11-20.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Actress' lover convicted in murder case". Sify.com. Archived from the original on 2012-06-24. Retrieved 2012-08-05.