కాశీనాథుని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి -అనవసర ఆంగ్లం
చి Wikipedia python library
పంక్తి 1:
'''కాశీనాథుని నాగేశ్వరరావు''' ([[1867]] - [[1938]]) ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. ఆయనను 'నాగేశ్వరరావు పంతులు' అనేవారు. '''దేశోద్ధారక''' అని ఆయనను అంతా గౌరవించేవారు. 1935లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] ఆయనను '[[కళాప్రపూర్ణ]]' బిరుదుతో సత్కరించింది. {{fact}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కాశీనాథుని నాగేశ్వరరావు
పంక్తి 20:
==జీవిత విశేషాలు==
[[బొమ్మ:Teluguleader kasinadhuni.JPG|left]]
కాశీనాధుని నాగేశ్వరరావు [[కృష్ణా జిల్లా]] [[ఎలకుర్రు]] గ్రామంలో [[1867]] లో [[మే 1]]న జన్మించాడు. తల్లిదండ్రులు: శ్యామలాంబ, బుచ్చయ్య. స్వగ్రామంలోనూ, తరువాత [[మచిలీపట్నం]]లోనూ విద్యాభ్యాసం కొనసాగింది. 1891లో 'మద్రాసు క్రిస్టియన్ కాలేజి'లో పట్టభద్రుడయ్యాడు. ఆ కాలేజిలో ప్రమముఖ విద్యావేత్త డా.రెవరెండ్ మిల్లర్ ప్రభావం ఆయనపై బడింది. [[వివేకవర్ధని]]లో [[కందుకూరి వీరేశలింగం]] వ్యాసాలు కూడా ఆయనను ప్రభావితం చేశారు
 
==వ్యాపారం==
పంక్తి 27:
 
==పత్రికా రంగం==
1907లో సూరత్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తరువాత ఆయన తెలుగువారికి తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించాడు. [[పత్రికా రంగం]]లో నాగేశ్వరరావు ప్రవేశం పాశ్చాత్య దేశాలలో [[పులిట్జర్]] ప్రయత్నంతో పోల్చవచ్చును. అప్పుడే విస్తరిస్తున్న దేశీయ పత్రికలపై ఆంగ్లేయుల ప్రభుత్వం ధోరణి వ్యతిరేకంగా ఉండేది. కనుక దేశీయ పత్రికలు నడపడానికి ధైర్యము, అంకితభావం చాలా అవసరం.
 
సెప్టెంబరు [[1908]]లో బొంబాయినుండి ఆయన ప్రారంభించిన [[ఆంధ్ర పత్రిక]] వార పత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాగేశ్వరరావు వ్యాసాలు ఆయన సామాజిక చేతనా దృక్పధాన్నీ, సమకాలీన చరిత్రపై ఆయన అవగాహననూ ప్రతిబింబించాయి. [[1914]]లో [[మొదటి ప్రపంచ యుద్ధం]] ప్రారంభమైనపుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులనూ, రాజకీయ పరిణామాలనూ తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే ఉద్దేశ్యంతో [[ఆంధ్ర పత్రిక]] దిన పత్రికను ప్రారంభింఛాడు. 1914 [[ఏప్రిల్ 1]]న మద్రాసునుండి ఈ పత్రిక తొలిసారిగా వెలువడడం తెలుగు పత్రికా రంగంలో ఒక సువర్ణాధ్యాయం. [[1924]]లో [[భారతి]] అనే సాంస్కృతిక, సాహితీ పత్రికను ప్రారంభించాడు. తెలుగు సాహితీప్రియులకు ఇది చాలాకాలం అభిమాన పత్రికగా నిలచింది.
 
==దేశోద్ధారక==
పంక్తి 35:
 
==ఆంధ్ర గ్రంధమాల==
పత్రికా రంగంలోనే కాక ప్రచురణా రంగంలో కూడా నాగేశ్వరరావు తన కృషిని విస్తరించాడు. 1926లో '[[ఆంధ్ర గ్రంథమాల]]' అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ 20 పైగా పుస్తకాలు ప్రచురించింది. వాటిలో 27 వ పుస్తకం,తిరుమల వెంకట రంగాచార్యులు సంకలనం చేసిన పారిభాషిక పదకోశము <ref>[http://www.archive.org/details/paribhashikapadh015114mbp పారిభాషిక పదకోశము ఇంటర్నెట్ ఆర్కైవ్ నకలు]</ref>. ఇంకా అనేక ప్రాచీన గ్రంథాలను పునర్ముద్రించింది. సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఈ పుస్తకాల వెలను చాలా కొద్ది మొత్తంగా నిర్ణయించారు. తెలుగునాట గ్రంథాలయోద్యమానికి నాగేశ్వరరావును పితామహునిగా వర్ణించవచ్చును. కాలక్రమంగా 120 పైగా [[గ్రంథాలయము| గ్రంథాలయాలు]] తెలుగునాట వెలశాయి.
 
==రాజకీయాలలో==
[[టంగుటూరి ప్రకాశం]] సమకాలీనుడైన నాగేశ్వరరావు 1924 - 1934 మధ్యకాలంలో నాలుగు సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఉన్నాడు. ముఖ్యంగా ఖద్దరు ఉద్యమానికి నాగేశ్వరరావు బలమైన మద్దతును, సహకారాన్ని అందించాడు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో చురుకుగా పాల్గొన్న నాయకులలో ఆయన ఒకడు. నాగేశ్వరరావుపై ప్రజలకు ఎంతో అభిమానం, నమ్మకం ఉండేవి.
 
==భగవద్గీత==
పంక్తి 52:
==మరణం==
 
కాశీనాథుని నాగేశ్వరరావు [[1938]] లో మరణించాడు. తెలుగు జాతికీ, తెలుగు భాషకూ, తెలుగు సంస్కృతికీ ఆయన సేవ ఎనలేనిది. వీరు అల్లుడు [[శివలెంక శంభు ప్రసాద్]] పంతులు గారి తదనంతరం ప్రముఖ పత్రికలు చాలా కాలం నడిపి అభివృద్ధి చేశారు.
 
==మూలాలు, బయటి లింకులు==