చివరకు మిగిలేది (నవల): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 22:
 
====సంక్షిప్త కథ====
ధయానిధి పట్ట్ట్టణంలో డాక్టరు చదువుతూ పల్లెకు వచ్చినపుడు కోమలి అనే ఒక తక్కువ కులపు అమ్మయిని ప్రేమిస్తాడు, కాని ఆమెకు తన ప్రేమను వ్యక్తపరచడం ఎలానో , అసలు తనది ప్రేమో లేక ఆకర్షణో తెలియని సంగ్దిగ్దంలో ఉండి చదువు సంద్యలు లేని ఆమెకు ఆ అభిప్రాయాలను వ్యక్తం చేయలేక పోతాడు.
 
 
పంక్తి 54:
==రచయిత గురించి==
{{main|బుచ్చిబాబు (రచయిత)}}
[[బుచ్చిబాబు (రచయిత)|బుచ్చిబాబు]] గురించి [[మధురాంతకం రాజారాం]] ఓ చోట ఇలా అంటారు- "బుచ్చిబాబు"గా ప్రసిద్ధి చెందిన [[శివరాజు వెంకట సుబ్బారావు]]గారు పశ్చిమగోదావరి జిల్లాలో 1916లో జన్మించారు. ఎం.ఎ. (ఇంగ్లీషు) పట్టభద్రులు. షేక్స్‌పియర్‌, బెట్రెండ్‌ రస్సెల్‌, సోమర్సెట్‌మామ్‌, టి.ఎస్‌.ఇలియట్‌, ఆల్దస్‌ హాక్స్‌లీ వంటి మహామహుల సాహిత్యాన్ని ఔపోశన పట్టారు. తెలుగులో కథాశిల్పానికి వన్నెలు బెట్టిన మహారచయితల్లో ఒకరు. నిరంతర త్రయం, ఎల్లోరాలో ఏకాంతసేవ, కాలచక్రం నిలిచింది, మరమేకులు-చీరమడతలు, తడిమంటకు పొడినీళ్లు, అడవిగాచిన వెన్నెల, మేడమెట్లు- ఇలా ఖండ కావ్యాల్లాంటి కథలెన్నో రాశారు. తెలుగు నవలల్లో ఆయన రచన 'చివరికి మిగిలేది' ప్రముఖమైనది. <ref name="chikolu">[http://www.eenadu.net/archives/archive-18-9-2008/sahithyam/display.asp?url=chaduvu3.htm [[ఈనాడు]] లో చీకోలు సుందరయ్య వ్యాసం] </ref>
 
==అభిప్రాయాలు==
 
"చివరకు మిగిలేదేమిటి? దీనికి సమాధానం తెలిస్తే జీవిత రహస్యంతెలుసుకొన్నట్లే. అసలు జీవితానికి అర్ధం ఏమై ఉంటుంది?" లాంటి వాక్యాలతో ఈ నవల మొదలవుతుంది. .. జీవిత రహస్యం తెలుసుకొనే తపనలో దయానిధికి ఒక సత్యంఅర్ధమవుతుంది. "మనిషికి కావలిసింది కాసింత దయ" అని బుచ్చిబాబు ఈ నవల ద్వారా చెప్పదలచుకొన్నాడు<ref>[http://www.avkf.org/BookLink/view_authors.php?cat_id=40 AVKF పుస్తకాల సైటులో పరిచయ వాక్యాలనుండి]</ref>
 
 
చివరకు మిగిలేది నవల ఏ ప్రశ్నతో మొదలయ్యిందో అదే ప్రశ్నతొ ముగిసి విశ్రాంతి పొందింది. .. బుచ్చిబాబు రచించిన ఒకే ఒక నవల "చివరకు మిగిలేది" ఓపెన్ ఎండింగ్ నవల. <ref name="vegunta">'''వేగుంట మోహన ప్రసాద్''' రేడియో ప్రసంగ వ్యాసం - [[శత వసంత సాహితీ మంజీరాలు]]లో ముద్రించబడింది.</ref>
 
 
బుచ్చిబాబు నవల శరీర, మానసిక, హృదయ, ఆత్మ సంస్కారాలకు సంబంధించిన మీమాంస. కోమలి చివరికి తానున్న కుటీరపు దహనంలో, జ్వాలల్లో చిక్కుకుపోవడం, దయానిధి ఆమెను రక్షించడం, తనకు తోడుగా ఎటో తీసుకెళ్ళి పోవడం కూడా దహన సంస్కారపు ఆత్మ సంస్కారంలోని భావమే. దయానిధి తల్లి శిలా విగ్రహం తల పగిలినా ఆమె పాదాలు ఇంకా నిలిచి ఉండడం ఈ సమాజపు సంస్కారంలో భాగమే. రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలోని మధ్య తరగతి మందహాసంలోని భాగస్థులే నిజాయితీ లేని దశరథ రామయ్య, గోవిందరావు, కృష్ణమూర్తి, జోగప్ప నాయుడు, గుర్నాధం, ప్రకాశరావు, అరూపానందస్వామి, శిష్యులు జీవ సజీవలు. మరీ ముఖ్యంగా రాజభూషణంలు. వారికి చివరికి మిగిలేదేమిటనే ప్రశ్నే రాదు. ఎంత అదృష్టవంతులు వాళ్ళు. నారన్న నౌకరే అయినా అతనికి దయానిధిపైనున్న ప్రేమ మిగిలింది. అనంతాచారికి ఆదరణ మిగిలింది. వైకుంఠానికి కృతజ్ఞత మిగిలింది. నవలలోని అగ్రవర్ణాలవాళ్ళు సుఖపడింది లేదు వాళ్ళ కృతక నీతివలన. నిమ్న వర్ణాలలోని కామాక్షి, కోమలులు ఇంతకంటే నష్టపోయేది ఏమీ లేదు. జగన్నాధం కృతకమైన తెలుగులో మాట్లాడుతాడు. ఆ వెక్కిరింపు సమాజం పట్లనే. అతనే గనుక సహజమైన భాషలో మాట్లాడి ఉంటే దయానిధి అస్తిత్వ వేదన అతన్ని కాల్చేసేది. '''చివరికి మిగిలేది''' నవలలో మాతృ ప్రేమ, స్వీయ ప్రేమల వికృతులు చివరికి ద్వేష రాహిత్యంలో ప్రేమ సాఫల్యాన్ని పొంది విశ్రాంతినొందిన నవల. <ref name="vegunta"/>
 
 
"[[సోమర్‌సెట్ మాం]] రాసిన [[ఆఫ్ హ్యూమన్ బాండేజ్]] నవల లేకపోతే బుచ్చిబాబు "చివరకు మిగిలేది" రాసి వుండడన్నది స్పష్టమే - అ లేకపోతే ఇ ఉండదు అన్న సూత్రం ప్రకారం - అయితే, బుచ్చిబాబుపై మాం ప్రభావం కంఠదఘ్నంగా ఉన్న విషయం వారిద్దరి కథలను కూడా పరిశీలిస్తే స్పష్టమవుతుంది." (కంఠదఘ్నంగా అంటే గొంతుదాకా - లోతుగా, గాఢంగా - అని అర్థం
చేసుకున్నాను.) - కాకాని ఈ రెండూ నవలలనీ ముందుమాట, స్వీయ కథాత్మక లక్షణం, వస్తువు, పాత్రచిత్రణ - అనే అంశాల దృష్ట్యా పరిశీలించి తేల్చారు. వీటన్నిటిలో సామీప్యం ఉన్నా, స్త్రీ పాత్రలు మాత్రం బుచ్చిబాబు ఊహాశక్తి నుంచి ప్రభవించినవేగాని, మాం
ప్రభావం నుండి కాదన్నారు. <ref>] "సాహిత్య ప్రభావం" లో "బుచ్చిబాబుపై విలియం సోమర్సెట్ మాం ప్రభావం"
అన్న అధ్యాయం. కాకాని చక్రపాణి. Media House Publications, 2004. - http://groups.google.tl/group/telugu-unicode/browse_thread/thread/21da143bf7d841a0 లో కొడవళ్ళ హనుమంతరావు ఉట్టంకించినది</ref>
 
 
 
నవల మొత్తం మనోవిశ్లేషణ - ఒక తాత్త్వికచింతనగా సాగినందునేమో సూక్తిముక్తావళిలాగానో సుభాషణ రత్నావళిలాగానో అనిపించింది నాకు. నిజంగా జరిగినకథ కంటే దాన్నిగురించిన అతని ఆలోచనలూ, సిద్ధాంతీకరణ పుష్కలంగా వున్నాయి. (ఈవిషయం బుచ్చిబాబు కూడా తొలిపలుకులో ప్రస్తావించారు ప్రతివారికీ వుండే బలహీనత లేదా లక్షణం అని). జీవితం పుట్టినక్షణంనుండి ఆమరణాంతం సాగే ప్రయాణం. మరణంతోనే జీవితానికి ముగింపు. ఈనవల జీవితానికి అర్థంలేదు చివరకి మిగిలేది ఏమీ లేదన్న దయానిధిసిద్దాంతంతో ముగుస్తుందే తప్ప అతని మరణంతో కాదు. అతను ఇంకా జీవించి వుండగానే. ఇంక ఏమీ లేదు అనుకోడం నిరాశావాదం. నిజానికి అతను జీవితంలో అనుభవించింది కూడా ఏమీలేదు. .... చివరకుమిగిలేది ప్రధమపురుషలో సాగినా, ప్రధానపాత్ర ఆంతరంగిక చిత్రణ కావడంచేత ఉత్తమపురుషలో సాగినట్టే వుంటుంది చదువరికి. ఉత్తమపురుషలో కథ చెప్పినప్పుడు కొన్ని వసతులుండే మాట నిజమే. కాని ఈరెండు నవలల్లో వస్తువు పరిశీలించినప్పుడు, రచయితలు ఆవస్తువుని చిత్రించిన తీరు గమనించినప్పుడు, ఈగ్రామరు అనవసరం అనిపించింది అనుకుంటాను నేను. సూక్ష్మంగా చెప్పాలంటే బుచ్చిబాబు రచయితగా చివరకు మిగిలేదిలో సాధించినదానికీ, పాఠకుడిగా తనవుత్తరంలో వెలిబుచ్చిన అభిప్రాయాలకీ సమన్వయం కుదరడంలేదు. <ref name="malathi"/>